For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెడ్ వైన్ లో దాగున్న రియల్ బ్యూటీ సీక్రెట్స్

By Swathi
|

రెడ్డిష్, పర్పల్ కలర్ లో ఉండే.. రెడ్ హెల్తీ డ్రింక్ ని నిరూపించబడింది. పూర్వకాలంలో రెడ్ వైన్ మెడిసిన్స్ లో కూడా ఉపయోగించారు. రకరకాల ఫ్రూట్ ఫ్లేవర్స్ రెడ్ వైన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. రాస్బెర్రీస్, గూజ్ బెర్రీస్, ఎండుద్రాక్ష వంటి ఫ్లేవర్స్ లో రెడ్ వైన్ మార్కెట్ లో అందుబాటులో ఉంది.

READ MORE: ఒక్క గ్లాసు రెడ్ వైన్ తో మెండైన ఆరోగ్య ప్రయోజనాలు...

ఆరోగ్య ప్రయోజనాలున్న రెడ్ వైన్ చర్మ సౌందర్యానికి ఎందుకు ఉపయోగపడకూడదు ? నిజమే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్న రెడ్ వైన్ ని.. బ్యూటీ లుక్ కోసం కూడా ఉపయోగించవచ్చట. ఇందులో ఉన్న పోషకాలే చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయని స్టడీస్ చెబుతున్నాయి. రెడ్ వైన్ తో రియల్ బ్యూటీనెస్ పొందండం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఏజింగ్

ఏజింగ్

ఆర్గానిక్ రెడ్ వైన్స్ లో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్, టాన్నిన్ వంటి గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ సౌందర్యానికి మంచిది. కాబట్టి కొద్దిగా రెడ్ వైన్ తీసుకుని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు అరికట్టడమే కాకుండా.. చర్మానికి కొత్త నిగారింపు తీసుకొస్తుంది.

యాక్నే

యాక్నే

రెడ్ వైన్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల యాక్నేతో పోరాడి, జిడ్డుని తగ్గిస్తుంది.

స్కిన్ డ్యామేజ్

స్కిన్ డ్యామేజ్

ఎమినో యాసిడ్స్ రెడ్ వైన్ లో రిచ్ గా ఉంటాయి. ఇవి చర్మానికి న్యూ లుక్ తీసుకొస్తాయి. అలాగే సూర్య రశ్మి వల్ల వచ్చే సమస్యలను నివారిస్తుంది.

గ్లోయింగ్ స్కిన్

గ్లోయింగ్ స్కిన్

రెడ్ వైన్ లో పోలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి సెల్ ఆక్సిడేషన్ ని నివారిస్తాయి. నిర్జీవంగా మారిన చర్మానికి నిగారింపు తీసుకొస్తాయి. రెడ్ వైన్ ని డైరెక్ట్ గా అప్లై చేయవచ్చు. లేదా ఓట్ మీల్ తో కలిపి.. ముఖానికి రాసుకుని 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మంలో గ్లో రావడంతో పాటు.. డెడ్ సెల్స్ ని తొలగిస్తుంది.

టోనర్

టోనర్

రెడ్ వైన్ అమేజింగ్ ఫేస్ టోనర్ లా పనిచేస్తుంది. రెడ్ వైన్ లో దూది ముంచి ముఖంపై రుద్దుకోవాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఫేస్ ప్యాక్

ఫేస్ ప్యాక్

ఒక కప్పులో టేబుల్‌స్పూను తేనె, టీస్పూను పంచదార పొడి వేసి అందులో 4 టేబుల్‌స్పూన్లు రెడ్‌వైన్‌, ఒక గుడ్డు తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకి రాసుకుని కొద్దిసేపు మర్దనా చేసి పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మెరిసే చర్మానికి

మెరిసే చర్మానికి

అరకప్పు రెడ్‌వైన్‌లో పావుకప్పు రోజ్‌వాటర్‌ కలపాలి. ఈ మిశ్రమంలో తడిపిన దూదితో ముఖాన్ని తుడుచుకోవాలి. మిగిలిన మిశ్రమాన్ని ప్లాస్టిక్‌ డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా వారంరోజులు చేస్తూ ఉంటే.. మేని ఛాయ మెరిసిపోతుంది.

మచ్చలకు

మచ్చలకు

రెండు టేబుల్‌స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒక టేబుల్‌స్పూను రెడ్‌వైన్‌ వేసి పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ముఖంపై మచ్చలు త్వరగా పోతాయి.

English summary

Amazing Uses Of Red Wine In Your Skincare Routine

Amazing Uses Of Red Wine In Your Skincare Routine. Red wine is a deep reddish-purple coloured wine that has been proven to be one of the healthiest alcoholic drinks. Red wine was also used for its medical properties in ancient times.
Story first published: Saturday, January 30, 2016, 10:45 [IST]
Desktop Bottom Promotion