Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వారం రోజుల్లో మెరిసే చర్మం పొందడానికి అమేజింగ్ సొల్యూషన్..!!
మీ ముఖం మచ్చలేని చందమామలా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారా ? స్మూత్ అండ్ గార్జియస్ స్కిన్ కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారా ? అయితే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అలాగనీ క్రీములు, ఫేస్ వాష్ లు వాడక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క పదార్థంతో వారం రోజుల్లో మీ చర్మ సోయగాన్ని రెట్టింపు చేసుకోండి.
ఓట్ మీల్..! ఇది ఒక్కటి చాలు మీ చర్మాన్ని అందంగా మార్చడానికి. చాలామంది ఓట్ మీల్ ను బ్రేక్ ఫాస్ట్ రెసిపీగా తీసుకుంటూ ఉంటారు. ఇందులో అనేక పోషక విలువలు ఉండటం వల్ల.. ఓట్ మీల్ ని డైట్ లో చేర్చుకుంటారు. ఫైబర్, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఓట్ మీల్ ఎముకల ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది.
ఇన్ని హెల్త్ బెన్ఫిట్స్ ఉన్న ఓట్ మీల్ మీ చర్మ సౌందర్యాన్ని పెంచుతుందంటే.. నమ్ముతారు కదూ. దీన్ని బ్యూటీ బెన్ఫిట్స్ కోసం రకరకాలుగా ఉపయోగిస్తారు. ఇది గ్లోయింగ్ చర్మాన్ని అందిస్తుంది. కాబట్టి ఓట్ మీల్ తో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి. వారం రోజుల్లో మీ చర్మంలో మెరుపుని చూసి.. మైమరిచిపోతారు.

ఓట్ మీల్, హనీ, రోజ్ వాటర్
రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్, ఆల్మండ్ ఆయిల్, పపాయ
మీ చర్మంపై సన్ ట్యాన్ ఏర్పడి ఉంటే.. 50 గ్రాముల బొప్పాయిని గుజ్జుగా చేయాలి. ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్, గ్రైండ్ చేసిన ఓట్స్ మిక్స్ చేయాలి. అవసరమైతే.. 3 మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్, నిమ్మరసం, ఆల్మండ్స్
ఎల్లప్పుడూ మీ చర్మం మెరిసిపోవాలంటే.. ఈ ప్యాక్ ట్రై చేయండి. 3 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేయాలి. అయితే నీటితో శుభ్రం చేసుకోకుండా.. కాటన్ బాల్స్ తో చర్మాన్ని క్లీన్ చేసుకోండి. ఇప్పుడు చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. అద్భుతమైన మెరుపు మీ సొంతమవుతుంది.

ఓట్ మీల్, పాలు
ఆయిలీ స్కిన్ నివారించడానికి 3 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, 7 టేబుల్ స్పూన్ల పాలు కలపాలి. ఈ రెండింటినీ 15 నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఓట్స్, కివి, హనీ, పెరుగు
స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మీ స్కిన్ టోన్ మెరుగుపరుచుకోవడానికి ఈ ప్యాక్ ఉపయోగించవచ్చు. 1 కివీ ఫ్రూట్, 2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి.. 15 నిమిషాలు ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.

ఎలా ఉపయోగించాలి ?
పైన చెప్పిన ఫేస్ ప్యాక్స్ అన్నింటినీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఏదో ఒకదాన్ని ఎంచుకుని.. ఏడు రోజులపాటు అప్లై చేయాలి. లేదంటే.. రోజుకి ఒక ఫేస్ ప్యాక్ మీకు నచ్చినవి ఉపయోగించినా.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అయితే.. ఈ ప్యాక్స్ ని ముఖంపై రుద్దాల్సిన అవసరం లేదు. ఊరికే అప్లై చేస్తే సరిపోతుంది.



Click it and Unblock the Notifications