For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరగు-అవొకాడో ఫేస్ ప్యాక్ తో నేచురల్ బ్యూటీ మీ సొంతం..!!

|

మన పూర్వీకులు ఎలాంటి ఇంగ్లీస్ మెడిసిన్స్ లేకుండానే ఎలా అంత ఆరోగ్యంగా ఉండే వారు? ఇప్పటి వారు తరచూ అనారోగ్యాలకు గురి కావడానికి కారణాలేంటని చూస్తే, మనం తీసుకునే అన్ ఆర్గానిక్ ఫుడ్స్, వాతావరణ కాలుష్యం, వ్యాయామలోపం వంటి కారణాలు కనబడుతాయి. ఆ కాలంలో ఆరోగ్యానికైనా...అందానికైనా హోం రెమెడీస్ ఎక్కువగా ఉపయోగించే వారు. ముఖ్యంగా చర్మం మరియు జుట్టు విషయంలో కూడా నేచురల్ పదార్థాలనే ఎక్కువగా ఉపయోగించే వారు.

ఈ విషయాలను అమ్మమ్మలు చెబుతుంటే కూడా పెడచెవిన పెట్టే వారు చాలా మందే ఉన్నారు. ఇన్ స్టాంట్ గా మనకు అందుబాటులో ఉండే రసాయనిక, అనారోగ్యరమైన ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. అందుకు కారణం అవి ఇన్ స్టాంట్ గా త్వరగా ఫలితాలను ఇస్తాయని ఆశిస్తారు? కానీ ఎలాంటి ఫలితం ఉండదు.

మార్కెట్లో ఉండే కెమికల్ ప్రొడక్ట్స్ కంటే నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే పదార్థాలను ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు మరియు సురక్షితమైనవి. నేచురల్ ప్రొడక్ట్స్ లో స్వచ్చమైన విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మరియు అందాన్నికి గొప్పగా సహాయపడుతాయి. అలాంటి నేచురల్ పొడక్ట్స్ లో పెరుగు ఒకటి. పెరుగు అవొకాడో పండు కాంబినేషన్ లో చర్మానికి అనేక ప్రయోజనాలున్నాయన్నా విషయం మీకు తెలుసా..? మరి ఈ రెండింటి కాంబినేషన్ లో ఫేస్ ప్యాక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు:

  • అవొకాడో పల్ప్ : 2tbsp
  • పెరుగు : 2tbsp

తయారుచేయు విధానం:

1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పైన సూచించిన పదార్థాలను మిక్స్ చేయాలి.
2. బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.
3. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
ఈ నేచురల్ హోం మేడ్ కర్డ్ అవొకాడో ఫేస్ ప్యాక్ వల్ల పొందే స్కిన్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...

1. స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది:

1. స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది:

అవొకాడో మరియు పెరుగు ఎక్సలెంట్ స్కిన్ హైడ్రేటింగ్ ఏజెంట్. ఇది చర్మ రంద్రాల్లోకి చొచ్చుకుని పోయి చర్మానికి తగినంత హైడ్రేషన్ అందిస్తుంది. చర్మం సాఫ్ట్ గా మరియు తేమగా మార్చుతుంది.

2. మొటిమలను తగ్గిస్తుంది:

2. మొటిమలను తగ్గిస్తుంది:

ఈ నేచురల్ ఫేస్ ప్యాక్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను మరియు మైక్రోబ్స్ ను నాశనం చేయడం వల్ల చర్మంలో మొటిమలు మచ్చలు ఏర్పడకుండా నివారిస్తుంది.

3.రేడియంట్ స్కిన్ అందిస్తుంది:

3.రేడియంట్ స్కిన్ అందిస్తుంది:

ఈ రెండింటి కాంబినేషన్ ఫేస్ ప్యాక్ లో న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మం ను బ్రైట్ గా మరియు రేడియంట్ గా మార్చుతుంది.

4. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది:

4. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది:

పెరుగు మరియు అవొకాడో ఫేస్ ప్యాక్ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్ ఫేస్ ప్యాక్ లో స్కిన్ లైటనింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. డల్ స్కిన్ తొలగిస్తుంది . రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5.ముడుతలను నివారిస్తుంది:

5.ముడుతలను నివారిస్తుంది:

అవొకాడో మరియు పెరుగు కాంబినేషన్ ఫేస్ ప్యాక్ స్కిన్ ఎలాసిటి పెంచుతుంది మరియు స్కిన్ ఏజింగ్ లక్షణాలను నివారించబడుతుంది . ఫైన్ లైన్స్ తొలగిపోతాయి.

6. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

6. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

ఈ నేచురల్ ఫేస్ ప్యాక్ లో ప్రోటీన్స్ మరియు ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

7. చర్మాన్ని శుభ్రం చేస్తుంది:

7. చర్మాన్ని శుభ్రం చేస్తుంది:

ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ మలినాలను తొలగిస్తుంది మరియు మైక్రోబ్స్ ను ఎదుర్కొంటుంది .చర్మాన్ని శుభ్రం చేయడం వల్ల చర్మం రిఫ్రెష్ గా మరియు హెల్తీగా కనబడుతుంది.

English summary

Apply Curd And Avocado On Your Skin, Watch What Happens!

Well, the fact is that natural beauty products are always much safer and less harsher on your skin compared to chemical-based products. Also, natural ingredients come with a whole array of vitamins and nutrients that can infuse health and beauty into your skin from within.
Story first published:Tuesday, August 2, 2016, 16:01 [IST]
Desktop Bottom Promotion