Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
తేనె, వేప మిశ్రమం చర్మానికి పట్టిస్తే.. పొందే గ్రేట్ బెన్ఫిట్స్..!!
మన అమ్మమ్మలు చెప్పే బ్యూటీ సీక్రెట్స్ గుర్తున్నాయా ? వాళ్లు చెప్పే సలహాల్లో ట్రెడిషనల్ రెమిడీస్ ఎక్కువగా ఉంటాయి. అవైతేనే.. ఎఫెక్టివ్ ఫలితాలు ఇస్తాయి. అందుకే.. వాటిని ప్రయత్నించమని సలహా ఇస్తుంటారు. కానీ.. చాలామంది వాటిని పట్టించుకోరు, నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ.. వాటిని ఫాలో అయితే మాత్రం.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని బ్యూటీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
చర్మం సంరక్షణకు, జుట్టు సంరక్షణకు మన బామ్మలు చెప్పిన రెమిడీస్.. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కాస్మొటిక్స్ కంటే.. ఇవి చాలా న్యాచురల్ గా పనిచేస్తాయని అంటున్నారు నిపుణులు. చాలా సందర్భాల్లో చర్మం ఆరోగ్యాన్ని, నిగారింపును కోల్పోతుంది. దీనికి కాలుష్యం, పూర్ డైట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సన్ ట్యాన్ వంటివి కారణాలు.
మీకు తెలుసా.. తేనె, వేప మిశ్రమం రకరకాల చర్మ సమస్యలను నివారిస్తుందని..? నిజమే.. ఈ ట్రెడిషన్ హోం రెమెడీ ఉపయోగించడం వల్ల చర్మంలో అద్భుతమైన ప్రయోజనాలు చూడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కావాల్సిన పదార్థాలు
వేప ఆకులు 3 నుంచి 4
తేనె 1 టేబుల్ స్పూన్
ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానం
ముందుగా వేప ఆకులను నీటిలో 20 నిమిషాలు నానబెట్టాలి.
ఇప్పుడు వేప ఆకులు, తేనెను మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి.
దీన్ని ముఖానికి పట్టించాలి.
15 ఆరిన తర్వాత.. గోరువెచ్చని నీటితో, మైల్డ్ ఫేస్ వాష్ ఉపయోగించి.. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల పొందే 7 గ్రేట్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

యాక్నె తగ్గించడానికి
వేప, తేనె మిశ్రమం యాక్నె నివారించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. యాక్నెతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. యాక్నెకి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

మాయిశ్చరైజర్
తేనె చర్మానికి న్యాచురల్ గా హైడ్రేటింగ్ అందిస్తుంది. దీన్ని వేపతో కలిపి పట్టించుకోవడం వల్ల.. ఇది చర్మంలోని ప్రతి కణానికి మాయిశ్చరైజర్ అందించి.. చర్మం సాఫ్ట్ గా మారేలా చేస్తుంది.

గాయాలకు
తేనె, వేప మిశ్రమం ఏదైనా గాయాలు అయినప్పుడు, బ్లడ్ కారుతున్నప్పుడు, కాలినప్పుడు ఉపయోగించడం వల్ల.. మంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

ర్యాషెస్ నివారించడానికి
అర్టికేరియా, ర్యాషెస్, దురద వంటి స్కిన్ అలర్జీలను కూడా.. ఈ ప్యాక్ ఎఫెక్టివ్ గా ఉపశమనం కలిగిస్తుంది.

బ్లాక్ హెడ్స్ తొలగించడానికి
చర్మంలో ఉండే బ్లాక్ హెడ్స్ ని తొలగించడంలో ఇది చాలా పవర్ ఫుల్ న్యాచురల్ ప్యాక్. ఇది చర్మంలోపలి వరకు వెళ్లి.. బ్లాక్ హెడ్స్ తొలగించడంలో ఎపెక్టివ్ గా పనిచేస్తుంది.

ఆయిలీ స్కిన్
వేప, తేనె మిశ్రమం.. చర్మంలో సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల చర్మంలో ఆయిలీ నెస్ నివారించవచ్చు.

సోరియాసిస్
తేనె, వేప మిశ్రమం.. హీలింగ్ నేచర్ కలిగి ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. సోరియాసిస్, ఎగ్జిమా వంటి వాటిని ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.



Click it and Unblock the Notifications
