For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుంకుమపువ్వు-పాలు కాంబినేషన్ ఫేస్ ప్యాక్ తో యంగ్ లుక్ మీసొంతం...

|

కుంకుమపువ్వు గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. ఎందుకంటే కుంకుమపువ్వు అనగానే గర్భిణీ స్త్రీలకు ఇచ్చేంది అని టక్కున గుర్తొస్తుంది. కుంకుమ పువ్వులో ఆశ్చర్యం కలిగించి ఆరోగ్య ప్రయోజనాలు మరియు బ్యూటీ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. కుంకుమపువ్వు పాలు కాంబినేషన్ ను స్కిన్ కు అప్లై చేస్తే ఏమవుతుంది?!

అమేజింగ్ లుక్ సొంతం చేసుకోవచ్చు. మీకు నచ్చిన కొంత మంది సెలబ్రెటీలు, బ్యూటిఫుల్ గా వండర్ ఫుల్ గా కనబడుటకు కారణమేమనుకుంటున్నారు? మీకు అది వాస్తవం కాదమో అనుకుంటారు కదా?

మనలో చాలా మంది మోడల్స్ మరియు సెలబ్రెటీలు అందంగా కనబడుటకు కోసం ప్రొఫిషనల్స్ సహాయం తీసుకుంటారని అనుకుంటారు. ఇంకా ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ వగైరా వగైరా చేయించుకుంటారని అనుకుంటాము ఇంకా ఫోటోషాప్ ఎక్సపర్ట్ సహాయం కూడా ఉంటుందని అనుకుంటాము.

సెలబ్రెటీల విషయంలో పైన తెలిపిన విషయాలు నిజం కావచ్చు, కానీ చాలా మంది సెలబ్రెటీలు నేచురల్ రెమెడీస్ మరింత బెటర్ గా పనిచేస్తాయని, వారి అందాన్ని మెరుగుపరుస్తాయని అంటుంటారు. వారు అందానికి రహస్యం నేచురల్ రెమెడీస్ అని చాలా సందర్భాల్లో ఇంటర్యూలలో వెల్లడిస్తుంటారు.

కుంకుమపువ్వు మరియు పాల మిశ్రమం వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తుంది? ముఖ్యంగా చర్మం సౌందర్యంను పెంచడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మరి ఈ రెండింటి మిశ్రమాన్ని ఎలా తయారుచేయాలి ? ఎలా అప్లై చేయాలన్న విషయం తెలుసుకుందాం..

ఫేస్ ప్యాక్ తయారీ:
కుంకుమ పువ్వు: 1టీస్పూన్
పాలు : 2 టీస్పూన్లు

తయారు చేయు విధానం:
పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి బాగా మిక్స్ చేయాలి.
కొద్దిసేపు అలాగే ఉంచి , కుంకుమపువ్వు పాలలో బాగా నానిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి.
తడి ఆరిన తర్వాత , సెకండ్ లేయర్ గా మరో సారీ అప్లై చేయాలి.
15నిముషాల తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
మరి ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు , చర్మ సౌందర్యాన్ని ఏవిధంగా మెరుగుపరుస్తుందో తెలుసుకుందాం...

యవ్వనంగా కనబడేలా చేస్తుంది:

యవ్వనంగా కనబడేలా చేస్తుంది:

కుంకుమపువ్వు మరియు పాల మిశ్రమం యొక్క ఫేస్ ప్యాక్ చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది. స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. ఏజింగ్ స్కిన్ టిష్యులను రిపేర్ చేస్తుంది. దాంతో చర్మం మరింత యంగ్ గా కనబడేలా చేస్తుంది.

.డ్రై స్కిన్ తగ్గిస్తుంది :

.డ్రై స్కిన్ తగ్గిస్తుంది :

పాలు మరియు కుంకుమపువ్వు మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. చర్మానికి తగిన హైడ్రేషన్ ను అందిస్తుంది. ఇది చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. దాంతో చర్మం చూడటానికి సాఫ్ట్ గా మరియు సపెల్ గా కనబడేట్లు చేస్తుంది.

 సన్ టాన్ తగ్గిస్తుంది:

సన్ టాన్ తగ్గిస్తుంది:

పాలు మరియు కుంకుమపువ్వు యొక్క కాంబినేషన్ ఫేస్ ప్యాల్ సన్ టాన్ నివారిస్తుంది . సన్ బర్న్ ను ఎఫెక్టివ్ గా నయం చేస్తుంది. చర్మం మరింత అందంగా, తెల్లగా కనబడేలా చేస్తుంది.

 స్కిన్ ను వైట్ గా మార్చుతుంది:

స్కిన్ ను వైట్ గా మార్చుతుంది:

ఈ నేచురల్ ఫేస్ ప్యాక్ , చర్మానికి నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఇది చూడటానికి స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మం అందంగా మెరుస్తుంటుంది.

హీలింగ్ ఎఫెక్ట్:

హీలింగ్ ఎఫెక్ట్:

సఫ్రాన్ మరియు మిల్క్ కాంబినేసన్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చిన్న చిన్న గాయాలను మాన్పడంలో అద్భుతంగా పనిచేస్తుంది,. ముఖ్యంగా సన్ బర్న్, కాళ్ళ పగుళ్లు, తెగిన గాయాలను మాన్పడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

ఈ హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షనాలు పుష్కలంగా ఉన్నాయి , ఇది చర్మంలోని బ్యాక్టీరియా నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . దాంతో చర్మం చూడటానికి అందంగా, మొటిమలు లేకుండా క్లియర్ స్కిన్ కనబడేలా చేస్తుంది.

 చర్మ కాంతిని పెంచుతుంది:

చర్మ కాంతిని పెంచుతుంది:

పాలు, కుంకుమపువ్వు యొక్క మిశ్రమం చర్మం కాంతిని పెంచడంలో అద్బుతంగా సహాయపడుతుంది. చర్మం రంద్రాలను క్లోజ్ చేసి, చర్మం కాంతివంతంగా చేస్తుంది.

English summary

Apply Milk And Saffron On Your Skin, Watch What Happens!

Apply Milk And Saffron On Your Skin, Watch What Happens! Have ever looked at your favourite celebrities and wondered how they can possibly possess such a flawless skin? It looks almost unreal, right? Many of us feel that most of the models and celebrities tend to get a little professional help from their plastic surgeons, make-up artists and also the photoshop experts.
Story first published: Thursday, July 7, 2016, 11:19 [IST]
Desktop Bottom Promotion