Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఆరెంజ్-అలోవెర జ్యూస్ తో మిరాకిల్ బ్యూటి బెనిఫిట్స్ ..!!
అందమైన చందమామలాంటి ముఖంలో నల్లగా ఒక మచ్చ కనిపిస్తే ఎలా ఉంటుంది. చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ముఖ చర్మం ఎప్పుడు అందంగా ఉండాలి. అందమైన ముఖంలో మొటిమలు మచ్చలు ఉంటే ఉన్నవారికే కాదు, చూసే వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.
సాధారణంగా , మనలో చాలా మంది ఇలా ముఖంలో సెడన్ గా కనిపించే మార్పులకు భయపడిపోయి బ్యూటీ స్టోర్స్ చుట్టూ తిరుగుతూ ఖరీదై బ్యూటీప్రొడక్ట్స్ ను కొని, ఉపయోగిస్తుంటారు . మార్కెట్లో ఇన్ స్టాంట్ గా ఉండే ఈ పదార్థాలు చాల ఎఫెక్టివ్ గా మచ్చలను మొటిమలను నివారిస్తాయనుకుంటారు.
ఈ కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల ఇవి చర్మానికి మేలు చేయడం కంటే హాని ఎక్కువ చేస్తుంది. కాబట్టి, మన వంటగదిలోని కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవడం మంచిది. ఆరెంజ్ అలోవెవర వంటివి చర్మ సంరక్షణలో ముఖ్య పాత్ర పోసిస్తాయి. చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా పినచేసి స్కిన్ కంప్లెక్షన్ ను హెల్తీగా మరియు రేడియంట్ గా మార్చుతాయి.
మరి ఈ రెండింటి కాంబినేషన్ లో ఫేస్ మాస్క్ ఎలా తయారుచేసుకోవాలి. ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం
కావల్సినపదార్థాలు:
ఆరెంజ్ జ్యూస్ : 3 టేబుల్ స్పూన్లు
అలోవెర: 2 టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం:
పైన సూచించిన పదార్థాలను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి.
తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఈ రెండింటి కాంబినేషన్ లో ముఖానికి వేసుకును ఫేస్ ప్యాక్ వల్ల పొందే బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం...

1. డ్రై స్కిన్ నివారిస్తుంది:
ఆరెంజ్ అలోవెర ప్యాక్ వల్ల డ్రై స్కిన్ నివారించబడుతుంది. స్కిన్ సాప్ట్ గా మరియు సపెల్ గా మార్చుతుంది.

2. ముడుతలను మాయం చేస్తుంది:
ఈ రెండింటి కాంబినేషన్ ఫేస్ ప్యాక్ తో ముడుతలు మాయం అవుతాయి. వీటిలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి . కాబట్టి ఇవి ఏజింగ్ సెల్స్ ను ఆలస్యం చేస్తుంది. దాంతో ఫైన్ లైన్స్ ముడుతలు నివారించబడుతాయి.

3. మైనర్ స్కిన్ సమస్యలను నివారిస్తుంది:
ఈ కాంబినేషన్ ప్యాక్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మైనర్ కట్స్ , బర్న్స్ ను మరియు కీటకాలు కుట్టినప్పుడు ఈ మిశ్రమాన్ని రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

4. స్కిన్ టోన్ లైట్ చేస్తుంది :
ఈ రెండింటి మిశ్రమంలో ఉండే విటమిన్ సి చర్మానికి నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. స్కిన్ టోన్ లైట్ చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మంచి కలర్ పొందుతారు.

5. బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది:
ఆరెంజ్ అలోవెర ఫేస్ మాస్క్ ముఖంలో మురికి, మలినాలను తొలగిస్తుంది. చర్మ రంద్రాలు తెరచుకునేలా చేసి శుభ్రం చేస్తుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది .

6. చర్మంలో జిడ్డును నివారిస్తుంది:
ఈ కాంబినేషన్ ఫేస్ ప్యాక్ వల్ల చర్మంలో సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో చర్మంలో జిడ్డు తొలగించుకోవచ్చు.

7. తెరచుకున్న చర్మ రంద్రాలను ష్రింక్ చేస్తుంది:
ఆరెంజ్ మరియు అలోవెర కాంబినేషన్ ఫేస్ మాస్క్ వల్ల చర్మం రంద్రాలను చాలా ఎఫెక్టివ్ గా ముడుచుకుపోయేలా చేస్తుంది. స్కిన్ కంప్లెక్షన్ పెంచుతుంది.



Click it and Unblock the Notifications