Latest Updates
-
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.!
టమోటా, గంధం ఫేస్ ప్యాక్ అప్లై చేస్తే చర్మంలో జరిగే మార్పులు ?
మీ చర్మం డల్ గా, అన్ హెల్తీగా మారిందని ఫీలవుతున్నారా ? ఎంత కాస్ట్ లీ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినా ఫలితం లేదని భావిస్తున్నారా ? కాస్మొటిక్ ప్రొడక్ట్స్ పై నమ్మకం కోల్పోయారా ? అయితే.. మీకు ఇంట్లోనే అద్భుతమైన చిట్కా ఉంది. అది కూడా తక్కువ ఖర్చుతో.. ఇంట్లోని వస్తువులతో వేసుకునే ఈ ఫేస్ ప్యాక్ మిమ్మల్ని గార్జియస్ గా మార్చేస్తుంది.
న్యాచురల్ స్కిన్ కేర్ రెమిడీస్.. చాలా తక్కువ ఖర్చే కాకుండా.. ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. పూర్వకాలం నుంచి.. చర్మ, జుట్టు సంరక్షణ కోసం ఎలాంటి ప్రొడక్ట్స్ ఉండేవి కాదు. కేవలం న్యాచురల్ రెమిడీస్ తో వాళ్లు చర్మాన్ని, జుట్టుని అందంగా పొందేవాళ్లు. ఆ కాలంలో వాళ్లంతా న్యాచురల్ గా ఉన్నారు కాబట్టి.. హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ పొందేవాళ్లు.
బ్యూటీ ప్రొడక్ట్స్ పై ఆధారపడటమే కాకుండా.. అన్ హెల్తీ ఫుడ్స్, కాలుష్యం, పని ఒత్తిడి, అన్ హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ప్రస్తుత జనరేషన్ అన్ హెల్తీ స్కిన్, హెయిర్ పొందడానికి కారణమవుతున్నాయి. మీకు తెలుసా గంధం, టమోటా జ్యూస్ కలిపి ముఖానికి పట్టించడం వల్ల లెక్కలేనన్న స్కిన్ బెన్ఫిట్స్ పొందవచ్చని ? తెలియకపోతే ఇప్పుడే చూడండి..

ఫేస్ ప్యాక్
1 టేబుల్ స్పూన్ గంధం, 1 టేబుల్ స్పూన్ టొమాటో జ్యూస్ కలపాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు అలానే వదిలేయాలి. అంతే..

స్కిన్ ట్యాన్ తగ్గించడానికి
టమోటా జ్యూస్ లో ఉండే టాన్నిన్స్, హీల్ చేసే గుణాలున్న గంధం రెండింటిని కలిపి పట్టించడం వల్ల.. సన్ బర్న్, స్కిన్ టాన్ ని నివారించవచ్చు.

స్కిన్ టోన్
టమోటా జ్యూస్, గంధం లో మెలనిన్ పిగ్మెంట్ లెవెల్స్ తగ్గించే గుణం ఉంది. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా పట్టించడం వల్ల.. చర్మం చాలా ఫెయిర్ గా మారుతుంది.

యాక్నే
టమోటా జ్యూస్ లో విటమిన్ సి ఉంటుంది. గంధంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉంటుంది. ఈ రెండింటి మిశ్రమం.. యాక్నేకి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. దీంతో చర్మం క్లియర్ గా, పింపుల్స్ లేకుండా మెరిసిపోతుంది.

యాంటీ ఏజింగ్
గంధం, టమోటా కాంబినేషన్ లో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల కొల్లాజెన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అలాగే కొత్త కణాలు ఏర్పడతాయి. అలాగే.. మొదట్లో కనిపించే ఏజింగ్ లక్షణాలు, ముడతలు, ఫైన్ లైన్స్ ని నివారించవచ్చు.

దురద
ఆయుర్వేదంలో కూడా టమోటా, గంధంను చర్మంపై దద్దుర్లు, దురద నివారించడానికి ఉపయోగించేవాళ్లట.

చర్మానికి మాయిశ్చరైజర్
టమోటా జ్యూస్, గంధం పొడి చర్మానికి హైడ్రేటింగ్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి. అలాగే ప్రతి కణానికి మాయిశ్చరైజర్ ని అందిస్తాయి. దీనివల్ల చర్మం సాఫ్ట్ గా, కాంప్లెక్షన్ తో ఉంటుంది.

మెరిసే చర్మానికి
టమోటా, గంధం కలిపిన మిశ్రమం.. చర్మాన్ని టైట్ గా చేయడానికి సహాయపడుతుంది. గుంతలను నివారిస్తుంది. న్యాచులర్ స్కిన్ టోనర్ లా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications