Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఉప్పులో దాగున్న ఆశ్చర్యకర బ్యూటీ సీక్రెట్స్.. !!
ఉప్పు వంటకాల్లో రుచినే కాదు.. అందానికి వన్నె తెస్తుంది. మెరిసే చర్మానికి ఉప్పు ఉపయోగపడుతుంది. ఇది న్యాచురల్ క్లెన్సర్ లా ఉపయోగపడుతుంది. అసలు ఉప్పు అందాన్ని రెట్టింపు చేయడంలో ఎలా ఉపయోగపడుతుందని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కానీ మెరిసే పళ్లు పొందడానికి, నోటి దుర్వాసన దూరం చేయడానికి ఉప్పు సహాయపడుతుంది.

అలాగే చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు, గోళ్ల అందానికి కూడా రాళ్ల ఉప్పు అద్భుతమైన పరిష్కారమని బ్యూటి ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. కాబట్టి బ్యూటి ప్రాడక్ట్స్ కి బదులు ఉప్పుని మీ బ్యూటి కిట్ లో చేర్చుకోవాల్సిందే. మరి చర్మ సౌందర్యానికి ఉప్పును ఎలా ఉపయోగించాలో చూద్దాం..
ఉప్పు సహజసిద్ధమైన క్లెన్సర్. ఇది చర్మంపై పేరుకున్న మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. రాళ్ల ఉప్పుని కొన్ని నీళ్లలో కలిపి.. స్ప్రే బాటిలో నిల్వ ఉంచుకోవాలి. దీన్ని ఎప్పుడు అవసరమైతే.. అప్పుడు ముఖంపై స్ప్రే చేసి.. తుడుచుకుంటూ ఉంటే.. ఫేస్ ఫ్రెష్ గా కనిపిస్తుంది.

స్నానం చేసిన తర్వాత చర్మం తడిగా ఉన్నప్పుడు ఉప్పు చల్లుకుని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. లేదా కొబ్బరినూనెలో కొద్దిగా ఉప్పు కలిపి.. శరీరమంతా రుద్దుకోవాలి. ఇలా ఒక నిమిషం చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.
కళ్లకింద నల్లటి వలయాలు ఇబ్బందిపెడుతుంటే.. కొద్దిగా గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకుని.. నీళ్లలో ముంచిన దూదిని కళ్ల మీద పెట్టుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. రెగ్యులర్ గా చేస్తూ ఉంటే.. కళ్లకింద నల్లటి వలయాలు తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications