For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లిజరిన్ తో ఆయిల్ స్కిన్ కి గుడ్ బై

By Swathi
|

చర్మ సౌందర్యానికి గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది. అందులోనూ జిడ్డు చర్మానికి గ్లిజరిన్ మంచి పరిష్కారమని చెప్పాలి. ఎలాంటి కలర్, వాసన లేకుండా ఉండే.. ఈ గ్లిజరిన్ ను అనేక స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తారు. ఇందులో మాయిశ్చరైజింగ్ ప్రయోజనాలు దాగున్నాయి.

పులిపిర్ల నివారణకు ఉత్తమ ఇంటి చిట్కాలు పులిపిర్ల నివారణకు ఉత్తమ ఇంటి చిట్కాలు

స్కిన్ కేర్ బెన్ఫిట్స్ మాత్రమే కాదు.. దీన్ని మెడిసిన్స్ కూడా ఉపయోగిస్తారు. అన్ని రకాల చర్మ తత్వాలకు గ్లిజరిన్ ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఆయిలీ స్కిన్ కి ఇది చాలా మంచి పరిష్కారం. జిడ్డు చర్మం వాళ్లను వేధించే యాక్నె, స్కిన్ ఇన్ఫెక్షన్స్, ముడతలు, గీతలు వంటి సమస్యలన్నింటినీ గ్లిజరిన్ పరిష్కరించగలదు.

గ్లిజరిన్ ను రోజూ ఉపయోగించడం వల్ల.. ఎలాంటి చర్మ సమస్యలనైనా నివారించవచ్చు. అలాగే హెల్తీ స్కిన్ మీ సొంతమవుతుంది. అయితే ఆయిలీ స్కిన్ సమస్యతో బాధపడేవాళ్లకు గ్లిజరిన్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

కణాలకు

కణాలకు

గ్లిజరిన్ కణాలకు బాగా సహాయపడుతుంది. జిడ్డు చర్మం కలిగిన వాళ్లు గ్లిజరిన్ ని అప్లై చేయడం వల్ల అనేక చర్మ సమస్యలను నివారించవచ్చు. మొటిమలు, యాక్నె, బ్లాక్ హెడ్స్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నాన్ టాక్సిక్ నేచర్

నాన్ టాక్సిక్ నేచర్

గ్లిజరిన్ లో నాన్ టాక్సిక్ నేచర్ ఉంటుంది. ఇది ఆయిలీ చర్మానికి ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. చిన్నపిల్లల చర్మానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇతర పదార్థాలతో మిక్స్ చేసినా.. దీనిలోని పవర్ కోల్పోదు. ఇది ఎలాంటి దుష్ర్పభావం చూపదు. అలాగే.. ఎలాంటి అలర్జీలకు కారణమవదు.

ఎగ్జిమా

ఎగ్జిమా

గ్లిజరిన్ ను రకరకాల క్రీములు, లోషన్స్, సోప్ లలో ఉపయోగిస్తారు. ఎందుకంటే.. ఇందులో చర్మాన్ని స్మూత్ గా మార్చే గుణాలు ఉంటాయి. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సోరియాసిస్, ఎగ్జిమా వంటి సమస్యలను కూడా ఇది నివారిస్తుంది.

చర్మానికి మాయిశ్చరైజర్

చర్మానికి మాయిశ్చరైజర్

ఆయిలీ స్కిన్ కి గ్లిజరిన్ పర్ఫెక్ట్ మాయిశ్చరైజర్. క్లెన్సర్, లోషన్స్ లో ఉపయోగించడం వల్ల చర్మానికి కావాల్సిన హైడ్రేషన్ ఇస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్

స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్

ఆయిలీ స్కిన్ వల్ల చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే యాక్నె, మొటిమలకు కారణమవుతుంది. గ్లిజరిన్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల నిర్జీవమైన చర్మాన్ని నివారించవచ్చు. చర్మం గ్లోయింగ్ గా మారుతుంది.

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

గ్లిజరిన్ ఆయిలీ స్కిన్ కి మంచి పరిష్కారం. ఇది అనేక రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. డ్రై, డల్ స్కిన్ కి కూడా గ్లిజరిన్ ఉపయోగించవచ్చు.

English summary

Benefits Of Glycerin For An Oily Skin

Benefits Of Glycerin For An Oily Skin. Glycerin, also known as glycerol, has many uses for skin care. It is a colourless and odourless liquid used in many skin care products due to its amazing moisturising benefits.
Story first published: Wednesday, March 9, 2016, 17:05 [IST]
Desktop Bottom Promotion