Latest Updates
-
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
ఆయిల్ స్కిన్ వారిలో సన్ టాన్ నివారించే బెస్ట్ హోం మేడ్ స్క్రబ్స్
చర్మసమస్యల్లో సన్ టాన్ ఒకటి. ఇది ఒక సాదారణ చర్మ సమస్య . సూర్య రశ్మి నుండి వెలువడే హానికరమైన యూవీ రేస్ నుండి చర్మాన్ని రక్షించుకోవాలి. లేదంటే ఇది స్కిన్ క్యాన్సర్ కు దారితీస్తుంది.
సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాలు చర్మానికి హాని కలగకుండా సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగపడుతాయి . సన్ స్క్రీన్ కేవలం వింటర్లో , శీతాకాలంలో వినిగియోస్తే చాలు అనేకొనే వారు చాలా మంది ఉన్నారు.
అయితే అది నిజం కాదు, ఏ సీజన్ లో అయినా సర్ స్కిన్ కు మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ లేకుండా బయట వెళుతున్నారంటే మీ శరీరం మీదకు సన్ టాన్ ను మీరు ఆహ్వానించినట్లే...అయితే అందుకు చింతించాల్సిన అవసరం లేదు . ఎందుకంటే సన్ టాన్ ను నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ టానింగ్ స్ర్కబ్స్ కూడా ఉన్నాయి. ఇవి చర్మం మీద పోరాటం చేసి స్కిన్ టాన్ ను నివారిస్తాయి . సూర్యుని నుండి వెలువడే యూవీ రేస్ మాత్రమే కాదు , స్విమ్మింగ్ వల్ల కూడా చర్మం టాన్ కు గురి అవుతుంది . స్విమ్మింగ్ వాటర్ లో క్లోరిన్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మ మీద తీవ్రప్రభావం చూపుతుంది.
సన్ టాన్ నివారించుకోవడానికి సరైన స్ర్కబ్ ను ఉపయోగించడం వల్ల, మీ స్కిన్ టోన్ నార్మల్ గా ఉంటుంది. కానీ మీ చర్మ తత్వాన్ని బట్టి, స్కిన్ స్క్రబ్బింగ్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆయిల్ స్కిన్ గల వారు అయితే..? ఆయిల్ స్కిన్ మీద టాన్ తొలగించుకోవడానికి బెస్ట్ టానింగ్ స్ర్కబ్ అవసరం అవుతుంది . టాన్ స్క్రబ్ రిసిపిలను ఉపయోగించడం వల్ల చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది మరియు మొటిమలు మరియు మచ్చలు ఏర్పడకుండా నివారిస్తుంది.
స్కిన్ ఎక్స్ ఫ్లోయేషన్ కు ఫేస్ స్క్రబ్ చాలా అవసరం అవుతుంది . ఫేస్ స్క్రబ్బింగ్ వల్ల చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ మరియు మురికి తొలగిపోతుంది . కాబట్టి, క్రమం తప్పకుండా క్లెన్సింగ్, స్ర్కబ్బింగ్, మరియు మాయిశ్చరైజింగ్ ను వారానికొకసారైనా అనుసరించాల్సి ఉంటుంది.
మరి ఆయిల్ స్కిన్ కలవారు సన్ టాన్ నివారించుకోవడానికి ఉపయోగించాల్సిన స్క్రబ్ రిసిపిలు ఏంటో ఒక సారి చూద్దాం...

1. లెమన్ మరియు షుగర్ స్ర్కబ్:
ఆయిల్ స్కిన్ కలవారికి ఇది ఒక బెస్ట్ టాన్ రిమూవల్ స్ర్కబ్ గా భావిస్తారు . మీకు అవసరం అయినంత షుగర్ ను తీసుకొని, దానికి సరిపడా నిమ్మరసం జోడించి బాగా మిక్స్ చేసి టాన్ ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత సర్క్యులర్ మోషన్ లో బాగా మర్దన చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల టాన్ మొత్తం నివారించుకోవచ్చు.

2. ఆరెంజ్ పీల్ మరియు మిల్క్ స్క్రబ్ :
బాగా ఎండిన ఆరెంజ్ తొక్కను పౌడర్ చేయాలి. దీనికి కొద్దిగా పాలు మిక్స్ చేసి స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి . దీన్ని పూర్తిగా డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్ తొక్క స్కిన్ టోన్ ను తేలికపరుస్తుంది, పాలు మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

3. గందం మరియు పాలతో స్ర్కబ్:
ఆయిల్ స్కిన్ కోసం ఇది ఒక బెస్ట్ టానింగ్ స్క్రబ్ ?ఒక బౌల్లో గందం మరియు పచ్చిపాలు వేసి బాగా మిక్స్ చేయాలి . దీనికి కొద్దిగా పసుపు మిక్స్ చేసి దీన్ని టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి డ్రై ఆయిన తర్వాత పూర్తిగా కడిగేసుకోవాలి.

4. టమోటో మరియు షుగర్ స్ర్కబ్:
టమోటోలను స్లైసెస్ గా కట్ చేసుకోవాలి . తర్వాత ఒక ప్లేట్ లో పంచదార తీసుకొని టమోటోముక్కలను షుగర్ లో డిప్ చేసి శరీరానికి అప్లై చేస్తూ మర్ధన చేయాలి . పంచదార స్పటికలు చర్మానికి గుచ్చుకుంటున్నట్లైతే టమోటో రసంలో కొద్దిసేపు డిప్ చేసి తర్వాత స్ర్కబ్ చేయాలి. ఈ స్క్రబ్ సన్ టాన్ మాత్రమే తొలగించడం కాదు, ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.

5. శెనగపిండి మరియు పసుపు స్క్రబ్:
ఆయిల్ స్కిన్ కు అయిన టాన్ ను తొలగించుకోవడానికి చూస్తున్నట్లైతే ఇది ఒక బెస్ట్ టాన్ రిమూవల్ స్క్రబ్ . ఈ స్ర్కబ్ తో వివిధ రకాల బెనిఫిట్స్ఉన్నాయి . శెనగపిండి తీసుకొని అందులో కొద్దిగా పసుపు , కొద్దిగా నీళ్ళు మిక్స్ చేయాలి. మెత్తగా పేస్ట్ చేసి నిధానంగా ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి . డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

6. తేనె మరియు రైస్ పౌడర్ స్ర్కబ్ :
ఈ స్ర్కబ్ సన్ టాన్ తొలగించడం మాత్రమే కాదు . ఇది స్కిన్ టోన్ ను మార్చుతుంది . నేచురల్ గ్లో అందిస్తుంది . తేనె మరియు బియ్యం పౌడర్ మిక్స్ చేసి స్క్రబ్ చేయాలి . సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఈ స్ర్కబ్ గ్రేట్ గా పనిచేస్తుంది .

7. అలోవెర జెల్ :
అలోవెర జెల్ తో చర్మానికి చాలా ప్రయోజనాలున్నాయి . ఫ్రెష్ గా ఉండే జెల్ తీసుకొని చర్మానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి . ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

8. బేకింగ్ సోడ మరియు వాటర్ స్ర్కబ్ :
ఆయిల్ స్కిన్ కలవారు మైల్డ్ స్ర్కబ్ ను ఉపయోగించాలి . బేకింగ్ సోడాకు కొద్దిగా వాటర్ మిక్స్ చేసి సన్ టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ బేస్ లో చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications











