Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
మజ్జిగలో మైమరిపించే.. సౌందర్య రహస్యాలు..!!
ఇండియన్స్ చాలా ఎక్కువగా ఇష్టపడేది.. మజ్జిగ. జీర్ణక్రియకు, ఎసిడిటీ తగ్గించడానికి, మోషన్స్ తగ్గడానికి, కోలన్ ని శుభ్రం చేయడానికి ఎంతో సహాయపడే.. మజ్జిగ మీకు యంగ్ లుక్ ని కూడా అందిస్తుందంటే.. ఆశ్చర్యపోతారు.
మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది.. డెడ్ స్కిన్ ని తొలగించి.. క్లియర్ స్కిన్ అందిస్తుంది. అలాగే.. ఇందులో ఉండే ముఖ్యమైన ఫ్యాట్స్.. చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. బిగుతుగా చేస్తాయి. డ్యామేజ్ అయిన చర్మ కణాలను రిపేర్ చేస్తాయి.
మజ్జిగ ఫేస్ ప్యాక్స్ అప్లై చేస్తే ఇందులో ఉండే.. ఎసిడిక్, యాస్ట్రిజెంట్ గుణాలు.. డార్క్ స్పాట్స్ ని తగ్గించడంలో, చర్మాన్ని టైట్ గా, బ్రైట్ చేసి.. స్కిన్ టోన్ ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మజ్జిగలో క్యాల్షియం, ప్రొటీన్స్, పొటాషియం ఉండటం వల్ల.. చర్మంలో కొల్లాజెన్ లెవెల్ ని మెరుగుపరుస్తాయి. అలా ముడతలు, ఫైన్ లైన్స్ తొలగించవచ్చు.

ఎండకు కమిలిన చర్మానికి
1 టేబుల్ స్పూన్ మజ్జిగ, అంతే మోతాదులో టమోటా రసం కలపాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసి.. కాటన్ ప్యాడ్ తో ముఖానికి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత.. ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

డ్రై స్కిన్
1 టేబుల్ స్పూన్ మజ్జిగ, అర టీస్పూన్ మీగడ కలిపి.. చర్మంపై మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

క్లియర్ స్కిన్ పొందడానికి
బాగా పండిన మామిడి పండు ముక్క తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మజ్జిగ, ఒక టీ స్పూన్ తేనె కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

క్లెన్సింగ్ మాస్క్
ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ, 1 టీస్పూన్ రోజ్ వాటర్, కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ కలపి.. ముఖానికి అప్లై చేయాలి. 10నిమిషాల తర్వాత.. కాటన్ ప్యాడ్ ఉపయోగించి.. శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి తొలగిపోవడానికి సహాయపడుతుంది.

డెడ్ స్కిన్ సెల్స్
పావు కప్పు మజ్జిగ, అర కప్పు సీసాల్ట్, 10 చుక్కల ఆల్మండ్ ఆయిల్ కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

ముడతలు తొలగించడానికి
ఒక టేబుల్ స్పూన్ బాగా పండిన అవకాడో గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ, ఒక గుడ్డులోని తెల్లసొన మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత.. ముఖానికి అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

చర్మ రంధ్రాలకు
ఒక టేబుల్ స్పూన్ చల్లటి మజ్జిగలో కాటన్ బాల్ ముంచి.. ముఖంపై బాగా రుద్దాలి. 5 నిమిషాల తర్వాత.. చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరిన తర్వాత.. పలుచగా.. రోజ్ వాటర్ రాసుకోవాలి. కాసేపటి తర్వాత.. లైట్ మాయిశ్చరైజర్ తో మసాజ్ చేస్తే.. చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి.

స్కిన్ రిపేరింగ్
ఒక ఎగ్ వైట్ తీసుకుని అందులో టేబుల్ స్పూన్ తేనె, 10 చుక్కల ఆల్మండ్ ఆయిల్, టీ స్పూన్ మజ్జిగ కలపాలి. అన్నీ బాగా మిక్స్ చేసి..ముఖానికి, మెడకు రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత.. బాగా స్ర్కబ్ చేసి. .శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ వైటెనింగ్
1 టేబుల్ స్పూన్ మజ్జిగ, 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, చిటికెడు పసుపు, టీ స్పూన్ తేనె కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత.. బాగా స్క్రబ్ చేసి.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ టోనింగ్ మాస్క్
1 టేబుల్ స్పూన్ బట్టమిల్క్ పౌడర్ లో కావాల్సినన్ని నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఈ టీప్ తో.. డార్క్ స్పాట్స్ తొలగిపోయి.. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.



Click it and Unblock the Notifications











