Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
అందంగా, తెల్లగా మెరిసిపోవడానికి డిఫరెంట్ క్యారెట్ ఫేస్ ప్యాక్స్
క్యారెట్ ఆరోగ్యానికి మాత్రమే మంచిదని అనుకుంటారందరూ, కానీ బ్యూటీ విషయంలో వండర్స్ క్రియేట్ చేస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. క్యారెట్ లో వివిధ రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి చర్మానికి చాలా అవసంర అవుతాయి. చర్మంను యంగ్ గా మరియు యూత్ ఫుల్ స్కిన్ తో కనబడేలా చేస్తాయి.
నిర్జీవమైన, పేల్ స్కిన్ కలిగి ఎప్పుడూ చూడటానికి అలసటగా కనిపిస్తుంటారు. ఈ సమస్యను నివారించుకోవడానికి మార్కెట్లోని క్రీములన్నీ ఉపయోగించి ఎలాంటి ప్రయోజనం లేకుండా విసిగిపోయుంటారు. ముఖానికి కెమికల్ క్రీమ్స్ అండ్ కమర్షియల్ మాస్క్ లు వేసుకోవడానికి బదులుగా నేచురల్ గా మన ఇంట్లో ఉండే క్యారెట్ ను సౌందార్యానికి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మానికి ఎలాంటి డ్యామేజ్ కలగదు.
క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే వీర్య వృద్ధి..సంతాన ప్రాప్తి..!
క్యారెట్ లో ఉండే విటమిన్ సి, ఎ మరియు ఇలు వయస్సు మీద పడే లక్షణాలను నివారిస్తుంది. మరియు చర్మానికి రక్తప్రసరణను పెంచుతుంది. ఇది ముఖ చర్మానికి ఎక్కువ ఆక్సిజెన్ మరియు న్యూట్రీషియన్స్ పెంచుతుంది పెంచుతుంది. దాంతో చర్మం చూడటానికి యంగ్ గా మరియు హెల్తీగా కనబడుతుంది . క్యారెట్ మాస్క్ డల్ స్కిన్, డార్క్ స్కిన్, పిగ్మెంటేషన్, అదేవిధంగా ముడుతల వంటి అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది.
మొటిమలు-మచ్చలను నివారించి, చర్మంకాంతివంతం చేసే క్యారెట్ జ్యూస్
ఈ ఆర్టికల్లో క్యారెట్ ను వివిధ రకాలుగా ఫేస్ మాస్క్ ను ఏవిధంగా వేసుకోవాలన్న విషయాన్ని తెలపడం జరిగింది. మరి ఎలానో తెలుసుకుందాం....

1.ఫెయిర్ స్కిన్ పొందడానికి క్యారెట్ మాస్క్:
15రోజుల్లో బ్రైట్ అండ్ ఫెయిర్ స్కిన్ పొందడానికి రోజువిడిచి రోజూ తప్పనిసరిగా క్యారెట్ మాస్క్ ను వేసుకోవాలి. ఇలా కనీసం 15-16డేస్ చేస్తే మంచిది. ఒక చెంచా క్యారెట్ పేస్ట్, ఒక చెంచా శెనగపిండి, ఒక చెంచా రోజ్ వాటర్, ఒక చెంచా కీరదోసకాయ పేస్ట్ ను బాగా మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి 15-30తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. ముడుతలను నివారించే క్యారెట్ మాస్క్:
ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ పేస్ట్ ఒక చెంచా పాలు, ఒక చెంచా రైస్ ఫ్లోర్ ఒక చెంచా పసుపు , మరియు ఒక చెంచా తేనె కూడా వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజువిడిచి రోజు రెగ్యులర్ గా క్యారెట్ ప్యాక్ ఒక నెలపాటు వేసుకుంటుంటే...ముఖంలో ఉండే ముడుతలన్నీ మాయం అవుతాయి.

3. పిగ్మెంటేషన్ మరియు ఫ్రెక్లెస్ నివారించుకోవడానికి క్యారెట్ మాస్క్ :
ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె మూడింటిని మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేయి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . ఈ ఫేస్ ప్యాక్ ను వారానికొకసారి, 4వారాల పాటు వేసుకోవడం వల్ల ఫ్రెక్లెస్ నివారించుకోవచ్చు.

4. గ్లోయింగ్ స్కిన్ కోసం క్యారెట్ మాస్క్:
ఒక చెంచా క్యారెట్ తురుములో ఒక చెంచా ఓట్స్ మరియు ఒక చెంచా ఆపిల్ తురుము వేయాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి , నిధానంగా ముఖం మొత్తం మర్దన చేయాలి. దీన్ని ముఖం మీద 10నిముశాలుంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

5. ముఖంలో వాపు తగ్గించే క్యారెట్ మాస్క్:
సాధారణంగా ఉదయం నిద్రలేవగానే ముఖం ఉబ్బి ఉంటుంది . అందువల్ల క్యారెట్ మాస్క్ ను ఉదయం ముఖానికి ప్యాక్ లా వేసుకోవడం వల్ల, వాపును తగ్గిస్తుంది. అందుకు ఒక చెంచా క్యారెట్ తురుములో, ఒక చెంచా బీట్ రూట్ తురుము, ఒక చెంచా పొటాటో తురుము, ఒక చెంచా పెరుగు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకొని 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

6. ఆయిల్ స్కిన్ :
ముఖంలో జిడ్డును తొలగించుకోవడానికి 3 చెంచాలా క్యారెట్ జ్యూస్ ,ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి మిక్స్ చేసి అందులో కాటన్ బాల్స్ వేసి వాటితో ముఖం తుడుచుకోవాలి. ఇలా ఉదయం మరియు సాయంత్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

7. డ్రై స్కిన్ కోసం క్యారెట్ మాస్క్:
డ్రై స్కిన్ మాస్క్ చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. అందుకు ఒక చెంచా క్యారెట్ తురుములో ఒక చెంచా పాలు, ఒక ఎగ్ వైట్ వేసి, మీ ముఖానికి అప్లై చేసి 15 అలాగే వదిలేయాలి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సాఫ్ట్ గా మరియు సపెల్ స్కిన్ పొందవచ్చు.



Click it and Unblock the Notifications











