Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
నేచురల్ గ్లోయింగ్ స్కిన్ కు బీట్ రూట్ ఫేస్ మాస్క్ ..
రెడ్ బ్లడ్ బీట్ రూట్ కి ఇది ఒక మంచి సీజన్. బీట్ రూట్ ను చాలా తక్కువగా వినియోగిస్తారు. కారణం దాని ఆకారం, రంగు రుచి. అయితే, బీట్ రూట్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగిన హెల్తీ వెజిటేబుల్. బీట్ రూట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల పొందవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాదు, సౌందర్యానికి పెంచే విటమిన్ బి ఎక్కువగా ఉండే బీట్ రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండా చేస్తుంది. బీట్ రూట్ రసంలో స్కిన్ టోన్ (చర్మ ఛాయను)మెరుగుపరిచే గుణాలు అధికం.

చర్మంలో మచ్చలను తొలగిస్తుంది. అంతే కాదు అనేక రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. బీట్ రూట్ ను ముఖానికి మాస్క్ లా అప్లై చేస్తే ఇది ముఖంలో మెటిమలు మచ్చలు తొలగిస్తుంది. పెదాలకు నేచురల్ పింక్ కలర్ ను అందిస్తుంది. అనేక చర్మ సమస్యలను నివారించడంలో ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీ.
బీట్ రూట్ లో ఉండే బిటాలిన్ అనే యాంటీఆక్సిడెంట్ స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ అద్భుతమైన గుణాలను కలిగి ఉంది. ఇది ప్రకాశవంతమైన చర్మం అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మంలో మొటిమలు, మచ్చలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . చర్మం లోపలి నుండి శుభ్రం చేసి, చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. చర్మానికి నేచురల్ గ్లోను అందిస్తుంది .

స్కిన్ లైటనింగ్ ఫేస్ మాస్క్ లలో దీన్ని చేర్చుకోవడం వల్ల చర్మంలో కొన్ని అద్భుతాలను చేస్తుంది . అదే సమయంలో ఈ ఫేస్ మాస్క్ వల్ల కాస్మోటిక్ ఉపయోగాన్ని తగ్గిస్తుంది. చర్మానికి నేచురల్ రోజీ గ్లోను అందిస్తుంది . చర్మానికి నేచురల్ గ్లోను అందివ్వడానికి బీట్ రూట్ తో పాటు మిల్క్ క్రీమ్, శెనగపిండి అవసరమవుతుంది.
కావల్సిన పదార్థాలు:
బీట్ రూట్ 1టేబుల్ స్పూన్
మిల్క్ క్రీమ్ 1టేబుల్ స్పూన్
శెనగపిండి 1టేబుల్ స్పూన్

మాస్క్ తయారుచేసుకునే విధానం:
మొదట బీట్ రూట్ ను తురుముకోవాలి, తర్వాత దీన్ని పిండి రసాన్ని తియ్యాలి .
బీట్ రూట్ జ్యూస్ ను ఒక బౌల్లో వేసి, మిల్క్ క్రీమ్, శెనగపిండి వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
పేస్ట్ లా తయారయ్యే వరకూ మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది స్కిన్ టోన్ ను పింక్ గా మార్చుతుంది. మరియు డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది. చర్మానికి నేచురల్ గ్లోను అందివ్వడానికి ఉపయోగించే సింపుల్ అండ్ హైలీ ఎఫెక్టవ్ ఫేస్ మాస్క్



Click it and Unblock the Notifications