Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సింపుల్ రెమిడీ: చెక్క, తేనె ప్యాక్ తో బ్లాక్ హెడ్స్ కి బైబై
ఓపెన్ ఎయిర్ పింపుల్స్ నల్లగా మారితే.. వాటినే బ్లాక్ హెడ్స్ అని పిలుస్తారు. బ్లాక్ హెడ్స్ కి ప్రధాన కారణం బ్యాడ్ హ్యాబిట్స్, హార్మోన్స్, బ్యూటీ ప్రొడక్ట్స్. ఈ సమస్య అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరిలోనూ కామన్ గా కనిపిస్తుంది. చాలా వరకు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ.. కొన్ని సందర్భాల్లో చర్మ సమస్యలకు కారణమవుతాయి.
ఒక్కసారి బ్లాక్ హెడ్స్ వచ్చాయంటే మాత్రం తొలగించడం కష్టమే. బ్లాక్ హెడ్స్ రిమూవర్ స్ట్రిప్స్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి అంత ఎఫెక్టివ్ గా పనిచేయవు. అయితే.. ఇంట్లోనే వంటింటి వస్తువులతోనే.. బ్లాక్ హెడ్ రిమూవర్ స్ట్రిప్ తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా సులభమైన పనే.

దాల్చిన చెక్క, తేనెతో ఈ బ్లాక్ హెడ్ రిమూవర్ స్ట్రిప్ తయారు చేసుకోవచ్చు. ఈ రెండింటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అవి చర్మంలోపల ఉండే ప్రాబ్లమ్ క్లియర్ చేస్తాయి. అలాగే దీంతో బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడం కూడా ఈజీనే. వాటిని నొక్కడం, గట్టిగా లాగాల్సిన అవసరం లేదు. కేవలం స్ట్రిప్ తయారు చేసి.. అప్లై చేయడమే.

కావాల్సిన పదార్థాలు
ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్
3 టేబుల్ స్పూన్ల తేనె
1 కాటన్ స్ట్రిప్
ముందుగా దాల్చిన చెక్క పొడి, తేనెను కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని బ్లాక్ హెడ్స్ పై అప్లై చేయాలి. ముక్కపైనా, గడ్డంపైనా ఎక్కడైనా అప్లై చేయవచ్చు. తర్వాత క్లీన్ గా ఉండే కాటన్ స్ట్రిప్ అతికించాలి. 10 నిమిషాల తర్వాత స్ట్రిప్ తొలగించి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేస్తే సరిపోతుంది.



Click it and Unblock the Notifications