For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంలో మొటిమలు, మచ్చలను తొలగించే ఎఫెక్టివ్ లవంగం ఫేస్ మాస్క్ ..!!

లవంగాలతో మొటిమలను ఎలా నివారించుకోవచ్చు...? రెమెడీని తయారుచేయు పద్దతి ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

|

టీనేజ్ వారినే కాదు, మద్యవయస్సు వారిని కూడా బాధించే సమస్యల పింపుల్స్. ముఖంలో చిన్న మొటిమ కనబడితే చాలు అమ్మాయిలు చాలా ఆందోళన చెందుతారు. ఈ సమస్యను నివారించుకోవడానికి వివిధ రకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో కమర్షియల్ గా అందుబాటులో ఉండే కెమికల్స్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం కంటే నేచురల్ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

మొటిమలు నివారించడంలో వివిధ రకాల హెర్బల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి . ఇవి చాలా ఎఫెక్టివ్ గా మార్పును చూపెడుతాయి. అలాంటి హెర్బల్ ప్రొడక్ట్స్ లో లవంగాలు ఒకటి. లవంగాలు వంటలకు ఉపయోగించడం మాత్రమే, ఆరోగ్య పరంగాను ఉపయోగించడం మాత్రమే కాదు, బ్యూటీ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మొటిమలను నివారించడంలో గ్రేట్ గా సహాపడుతుంది. ఎలాంటి మార్క్స్ , మచ్చలు ఏర్పకుండా లవంగాలు గ్రేట్ గా నివారిస్తుంది.

 DIY Clove Face Mask Recipe To Clear Severe Acne!

లవంగాల్లో ఉండే ఔషధ గుణాలు, సెబాస్టియన్ గ్రంథులు తెరచుకునేలా చేసి, చర్మంలోని మురికిని, డస్ట్ ను నివారిస్తుంది. చర్మంలో ఎర్రటి మచ్చలను కూడా నివారిస్తుంది. తెరచుకున్న చర్మ రంద్రాలలో ఉండే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాను నివారిస్తుంది. చర్మంలో స్ప్రెడ్ కాకుండా నివారిస్తుంది.

అంతే కాదు లవంగాలు సున్నితమైన కెమికల్ పీల్ మాస్క్ గా ఉపయోగపడుతుంది. డెడ్ స్కిన్ లేయర్స్ ను తొలగిస్తుంది, హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తప్రసరణను ప్రసరింపచేస్తుంది, కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. చర్మంలో కొత్త కణాలను ప్రోత్సహిస్తుంది. మరి లవంగాలతో మొటిమలను ఎలా నివారించుకోవచ్చు...? రెమెడీని తయారుచేయు పద్దతి ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

స్టెప్ 1 :

స్టెప్ 1 :

ఆపిల్ కు తొక్క తీసి, ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి. ఆపిల్లో ఉండే ఫైబర్ చర్మానికి కావల్సిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

స్టెప్ 2 :

స్టెప్ 2 :

ఒక కప్పు నీళ్ళను బాయిల్ చేసి, అందులో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు వేసి, 15 నిముషాలు ఉడికించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, చల్లార్చాలి. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో చర్మం హెల్తీగా , మెరుస్తూ ఉంటుంది.

స్టెప్ 3 :

స్టెప్ 3 :

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ ఆపిల్ పేస్ట్ , ఈక్వెల్ గా గ్రీన్ టీ, వేసి మిక్స్ చేయాలి. రెండు మిక్స్ అయ్యేలా స్పూన్ తో కలియబెట్టాలి. తర్వాత 1 చుక్క లవంగాల నూనె వేసి మిక్స్ చేయాలి.

స్టెప్ 4 :

స్టెప్ 4 :

తర్వాత ఇందులో కొద్దిగా తేనె కూడా మిక్స్ చేయాలి. తేనెలో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్ సి , చర్మానికి అవసరమయ్యే పోషణను అందిస్తుంది.

స్టెప్ 5 :

స్టెప్ 5 :

ముఖం శుభ్రంగా కడిగి, తేమ లేకుండా తుడవాలి. మేకప్ వేసుకుని ఉండే మైల్డ్ ఫేస్ వాష్ ను ఉపయోగించి, మేకప్ ను తొలగించాలి. ఫేష్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి.

స్టెప్ 6 :

స్టెప్ 6 :

ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న హోం మేడ్ క్లోవ్స్ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయాలి. కళ్ళు, నోటి చుట్టూ అవాయిడ్ చేయాలి. 15 నిముషాల నుండి 20 నిముషాలు అలాగే ఉండనివ్వాలి.

స్టెప్ 7:

స్టెప్ 7:

ఫేస్ మాస్క్ పూర్తిగా డ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరించి స్క్రబ్ చేసి, సర్క్యులర్ మోషన్ లో స్ర్కబ్ చేయాలి. రెండు నిముషాల పాటు చేసి, తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

స్టెప్ 8 :

స్టెప్ 8 :

తర్వాత తేమ లేకుండా కాటన్ టవల్ తో శుభ్రంగా తుడిచి, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

గుర్తుంచుకోవల్సిన విషయాలు:

గుర్తుంచుకోవల్సిన విషయాలు:

* లవంగం నూనె చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి, కొద్దిగా మాత్రమే ఉపయోగించాలి.

* అదే విధంగా లవంగాలు కూడా చాలా ఘాటుగా ఉంటాయి, చర్మానికి కొద్దిగా ఇరిటేషన్ కలిగిస్తుంది. కాబట్టి, లవంగాల పొడి కూడా తక్కువగా వినియోంగించుకోవాలి. ముందుగా ప్యాచ్ టెస్ట్ వేసి తర్వాత ఫేస్ ప్యాక్ కు ఉపయోగించుకోవాలి.

* ముఖానికి అప్లై చేసినప్పుడు మంట, దురద వంటి లక్షణాలు కనబడ్డ వెంటనే వాటర్ తో శుభ్రం చేసేసుకోవాలి.

* ఈ ప్యాక్ ను వారానికొకసారి వేస్తే అద్భుతంగా ఉంటుంది.

రిజల్ట్ :

రిజల్ట్ :

ఈ ఫేస్ ప్యాక్ వల్ల మొటిమలు పూర్తిగా తగ్గుతాయి. ముఖంలో నల్ల మచ్చలు తొలగిపోతాయి.

English summary

DIY Clove Face Mask Recipe To Clear Severe Acne!

Clear acne, lighten blemishes and get healthy skin with this clove face mask recipe!
Story first published: Tuesday, December 27, 2016, 18:32 [IST]
Desktop Bottom Promotion