Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఆయిల్ స్కిన్ నివారించే కీర, ఓట్ మీల్ మరియు అలోవెర స్క్రబ్
ప్రస్తుత రోజుల మన చుట్టూ ఉన్నవారిని గమనిస్తే చాలా మంది ఆయిల్ స్కిన్ కు, జిడ్డు చర్మానికి గురిఅవుతున్నట్లు గుర్గించవచ్చు. ఈ చర్మ సమస్యను ఒకరకంగా ఎపిడిమిక్ అని చెప్పవచ్చు.
ఆయిల్ స్కిన్ ఫలితంగా చర్మంలో సెబమ్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది .
ఇలాంటి చర్మం ఉన్న వారిలో మొటిమలు, మచ్చలు, స్కిన్ ప్యాచ్ లు మరియు ఇతర చర్మ సమస్యలకు కారణమవుతుంది .ఇంకా వాతావరణ పరిస్థితులను బట్టి, చర్మం నిర్జీవంగా, చర్మం పొరికిగా మారుతుంది.
జిడ్డు చర్మానికి కారణం మనం తినే ఆహారం, హార్మోన్ లెవల్స్, వాతావరణం, కాలుష్యం లేదా మన జీవన శైలి వంటి వివిధ కారణాల వల్ల ఆయిల్ స్కిన్ కు దారి తీస్తుంది.

జిడ్డు చర్మం ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చు . ముఖ్యంగా మార్కెట్లో అందుబాటులో ఉండే కాస్మోటిక్ మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు మరింత ఎక్కువ అవుతుంది.
మరో ముఖ్య విషయమేమిటంట ఆయిల్ స్కిన్ కలవారు స్క్రబ్బింగ్ తో మంచి ఉపశమనం కలుగుతుంది.స్క్రబ్బింగ్ వల్ల చర్మంలోని అదనపు జిడ్డును తొలగించుకోవచ్చు , అలాగే డెడ్ స్కిన్ కూడా తొలగించుకోవచ్చు.
చర్మంలో జిడ్డును తొలగించడానికి కీరకాయ,ఓట్ మీల్, అలోవెర జెల్ వంటి నేచురల్ పదార్థాలతో తయారుచేసిన ఫేస్ స్క్రబ్ తో జిడ్డును తొలగించుకోవచ్చు.ఫేస్ స్క్రబ్ చాలా సులభంగా మరియు ప్రభావవంతంగా పనిచేసి, ఆయిల్ స్కిన్ ను నివారిస్తుంది.
కీరకాయ చర్మానికి చాలగొప్పగా పనిచేసి, చర్మ కణాలను ఉత్తేజితం చేస్తుంది మరియు మృ తకణాల కలిగిన చర్మాన్ని తొలగిస్తుంది.

అదేవిధంగా తృణధాన్యాలలో ఒకటైన ఓట్ మీల్ అద్భుతంగా నేచురల్ స్క్రబ్బర్ గా పనిచేస్తుంది. ఈ రెండి పదార్థాలను మిశ్రమానికి కలబంద రసంజోడించి ఫేస్ స్క్రబ్బింగ్ గా ఉపయోగించడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా మార్చుతుంది మరియు చర్మం ఎక్కువ సమయం ఫ్రెష్ గా ఉంటుంది .
ఈ ఆర్టికల్లో స్క్రబ్బింగ్ కు ఉపయోగపడే పదార్థాలతో ఇంట్లోనే ఏవిధంగా తయారుచేసుకొని ఉపయోగించవచ్చున్న విషయం ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది . ఈ ఫేస్ స్క్రబ్ ఆయిల్ చర్మానికి చాలా గొప్పగా పనిచేసి, అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది.
కావల్సిన పదార్థాలు:
1కీరదోసకాయ
1 టేబుల్ స్పూన్ పచ్చి ఓట్ మీల్
2 టేబుల్ స్పూన్ల కలబంద రసం
తయారుచేయు పద్దతి:
మొదట కీరకాయ ముక్కలను మిక్సీపట్టాలి, తర్వాత అందులోనే ఓట్ మీల్ కూడా వేసి రెండూ కలిపి మిక్సీ పట్టాలి. తర్వాత ఈ పేస్ట్ కు కొద్దిగా కలబంద రసం జోడించాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి . మొత్తం మిశ్రమం పేస్ట్ అయిన తర్వాత ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయాలి. 10 నిముషాలు మసాజ్ చేసిన తర్వాత , మరో అరగంట అలాగే ఉండనిచ్చి, ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ ట్రీట్మెంట్ ను మీరు వారానికొకసారి రిపీట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో జిడ్డు పోయి అద్భుతంగా కనబడుతారు.



Click it and Unblock the Notifications