Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముఖంపై అసహ్యంగా కనిపించే మచ్చలు నివారించే హోంమేడ్ ప్యాక్
ప్రతి ఒక్కరూ అందంగా కనపడాలని తాపత్రయపడుతారు. కానీ ముఖంలో కొన్ని మచ్చలు తమకున్న అందాన్ని పాడు చేస్తాయి. ఈ మచ్చల వల్ల మీరు అందంగా కనబలేకపోతున్నారన్న దిగులు ఏర్పడుతుంది. కొన్ని రకాల మచ్చలు, హోం రెమెడీస్ లేదా క్రీములు ఉపయోగించడం వల్ల తొలగిపోతాయి. కానీ కొన్ని మచ్చలు ఎంత ప్రయత్నించినా తొలగించానికి సాధ్యం కాదు. ఇలాంటి మచ్చలు మొటిమల వల్ల ఏర్పడతాయి.
మార్కెట్లో కొన్ని వేలకొద్ది సౌందర్య ఉత్పత్తులన్నా, ప్రతి రోజూ ఏదో ఒక కొత్త రకం ఉత్పత్తిని మనకు పరిచయం చేస్తూనే ఉంటారు. అయితే అవి చాలా ఖరీదైనవై ఉంటాయి. లేదా అంత సులభంగా అందుబాటులో ఉండవు. కెమికల్స్ తో తయారు చేసినవి కావడం వల్ల అవి చర్మానికి హాని చేసే అవకాశాలుంటాయి.
కెమికల్స్ తో తయారుచేసిన ఉత్పత్తుల కంటే మనమే ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకునే ఫేస్ మాస్క్ లు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇవి చర్మానికి మెరుపుతో పాటు, చర్మంలోపల డ్యామేజ్ ను నివారిస్తాయి. ఇంకా ముఖ సౌందర్యంను పాడు చేసే మచ్చలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అందుకు మనం ఇంట్లో తయారుచేసుకొనే ఈ ఫేస్ మాస్క్ ను ఎగ్ వైట్ ఉపయోగించి తయారుచేసుకోవచ్చు. ముఖంలో మచ్చలను మాయం చేయడానికి ఎగ్ వైట్ ముఖ్య పాత్రపోషిస్తుంది. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, మొటిమలు తిరిగి ఏర్పడకుండా చర్మంలో దాగి ఉన్న క్రిములను నాశనం చేయడానికి సహాయపడుతుంది.
వంటగదిలో మనకు అందుబాటులో ఉండే ఈ పదర్థాల వల్ల ఎలాంటి రీమార్క్ లేకుండా చాలా ఎఫెక్టివ్ గా ఫేస్ మాస్క్ గా పనిచేసి చర్మంలో దాగున్న మచ్చలను నివారిస్తుంది.
కావల్సిన పదార్థాలు:
ఎగ్ వైట్
ఒక టేబుల్ స్పూన్ తేనె

పాటించాల్సిన నియమాలు:
ఎగ్ నుంచి ఎగ్ వైట్ ను వేరు చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
అందులో 1 టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనెను మిక్స్ చేయాలి.
ఈ రెండు పదార్థాలు బాగా మిక్స్ అయ్యే వరకూ కలపాలి.
బాగా మిక్స్ అయిన తర్వాత, ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.
మొదటి పది నిముషాలు ముఖంను మసాజ్ చేయాలి. ఆ తర్వాత అరగంట పాటు మాస్క్ ను అలాగే వదిలేయాలి. అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే ముఖంలో ఎలాంటి మచ్చలు ఉండవు. ముఖం కాంతి వంతంగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications