Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
డూ ఇట్ యువర్ సెల్ఫ్: మొటిమలు, మచ్చలను నివారించే ఫవర్ ఫుల్ ఫేస్ ప్యాక్
మహిళల చర్మ సమస్యల్లో మొటిమలు మరియు మచ్చలు చాలా కామన్ సమస్య . అనుకోకుండా వచ్చే ఈ మచ్చలు కలవరపెడుతుంటాయి. తమ అందాన్ని పాడు చేస్తుంటాయని, మొటిమలు వస్తే అంత సామాన్యంగా తగ్గవని ఆందోళన చెందుతుంటారు.
చర్మంలో ఇలా మచ్చలు మరియు మొటిమలు ఏర్పడటానికి కారణం వివిధ రకాలున్నాయి, వాటిలో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, హార్మోనుల ప్రభావం, జెనెటిక్స్ మరియు వాతావరణ ప్రభావం మొటిమలు మరియు మచ్చలకు దారితీస్తుంది.
ఇలా మొటమలు , మచ్చలను నివారించుకోవడానికి వివిధ రకాల క్రీములు వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కొన్ని ఎఫెక్టివ్ ఫేస్ మాస్క్ ల వల్ల మొటిమలను నివారించుకోవచ్చు . ఈ ఫేస్ మాస్క్ ను మన ఇంట్లోని క్రీములను ఉపయోగించే సులభంగా , స్వయంగా తయారుచేసుకోవచ్చు . ఈ హోం రెమెడీస్ కేవలం మొటిమలను నివారించడం మాత్రమే కాదు, ఇతర స్కిన్ సమస్యలను కూడా నివారించి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి.

మొటిమలు మచ్చలను నివారించే అమేజింగ్ హోం మేడ్ ఫేస్ మాస్క్ తయారుచేసుకోవడానికి మూడు ముఖ్యమైన పదార్థాలు ఉపయోగపడుతాయి. వాటిలో ఎగ్ వైట్, లెమన్ మరియు పసుపు . ఎగ్ వైట్ మొటిమలను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంతే కాదు మచ్చలను కూడా మాయం చేస్తుంది.
పసుపు చర్మంలోని మలినాలను తొలగిస్తుంది మరియు మొటిమలను మచ్చలను తొలగిస్తుంది. అంతే కాదు ఇతర చర్మ సమస్యలతో పాటు చర్మాన్ని శుభ్రం చేసి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది.
నిమ్మరసంలో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మొటిమలను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది . ఇది డెడ్ స్కిన్ సెల్స్ మరియు ఎక్సెసివ్ ఆయిల్ ను తొలగిస్తుంది . ఈ మూడింటి కాంబినేషన్లో మీరు తయారుచేసుకొనే ఈ హోం రెమెడీస్ ఇతర క్రీములు మరియు ఫేస్ మాస్క్ లతో సమానంగా పనిచేస్తుంది. మరి ఈ పవర్ ఫుల్ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేసుకోవాలి. అందుకు అవసరమయ్యే పదార్థాలేంటో చూద్దాం...

1 ఎగ్ వైట్
1/2 teaspoon నిమ్మరసం
చిటికెడు పసుపు
స్టెప్స్:
గుడ్డులోని తెల్ల సొనను మాత్రమే తీసుకోవాలి.
దీనికి కొద్దిగా నిమ్మరసం మరియు పసుపు జోడించాలి.
ఈమూడు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి.
అలా తయారైన పేస్ట్ ను ముఖం మొత్తం అప్లై చేయాలి.
15-20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి.
ఈ పింపుల్ ఫ్రీ ట్రీట్మెంట్ ను వారంలో రెండు సార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యకరమైన అందమైన చర్మం సౌందర్యాన్ని పొందవచ్చు.



Click it and Unblock the Notifications
