Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
డూ ఇట్ యువర్ సెల్ఫ్: పింపుల్స్ అండ్ స్కార్స్ ను మాయం చేసే హోం మేడ్ స్క్రబ్
మొటిమలు మచ్చలు. మనల్ని వేదించే బ్యూటీ సమస్యల్లో ఇది ఒకటి. ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొని ఉంటారు. అలాగే కొన్ని రోజుల తర్వాత ఈ సమస్య నివారించబడుతుంది. అయితే మొటిమైలతే పోతాయికానీ, వాటి ద్వారా ఏర్పడ్డ మచ్చలు మాత్రం చర్మం మీద తిష్ట వేసి కూర్చుకుంటాయి. ఇలాంటి మెండి మచ్చలు తొలగించడం కూడా కష్టమే.
ఇలాంటి మెండి మచ్చలను తొలగించడం కోసం కొన్ని బ్యూటీ కిట్ లోని సరైన పదార్థాలను ఎంపిక చేసుకొని చర్మంలో అవి కనబడకుండా చేయవచ్చు .
మార్కెట్లో లభించే కొన్ని కాస్మోటిక్స్, క్రీములు ద్వారా ఈమెండి మచ్చలను కనబడనివ్వకుండా చేయవచ్చు . కానీ ఈ మచ్చల మాత్రం అలాగే ఉంటాయి .
ఇలాంటి మచ్చలు ఒక్కసారి వస్తే సరి తిరిగి మళ్లీ మళ్లీ ఇబ్బంది పెడుతుంటే, ఇక ఉన్న అందం కాస్తా పాడవుతుంది. వీటికి శాస్వత పరిష్కారం చూసుకోలేందంటే మేమున్నామంటా మనకు గుర్తుచేస్తూ చర్మం మీద ఏర్పడుతుంటాయి.

ఇలాంటి మొటిమలను, మెండి మచ్చలను నివారించడంలో కోసం ఖరీదైన బ్యూటీ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా ఇంట్లో ఉండే నేచురల్ పదార్థాలతోనే నివారించుకోవచ్చు.అందుకోసం మన వంటగదిలో ఉండే మూడు పదార్థాలు చాల ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
అవును మీరు విన్నది నిజమే మీరంతట మీరేబ్యూటీ ఎక్సపర్ట్ అయిపోవచ్చు. అలాంటి నేచురల్ ప్రొడక్ట్స్ ఏంటంటే గ్రీన్ టీ, పంచదార మరియు శెనగపిండి . ఇవి చాలా సింపుల్ గా మరియు ఎఫెక్టివ్ గా పనిచేసి, మొటిలతో ఏర్పడ్డ మచ్చలను తొలగిస్తుంది.
ఈ పదార్థాల్లోని యాంటీబ్యాక్టీరియల్ మరియు ఎక్స్ ఫ్లోయేటింగ్ లక్షణాలు కొన్ని అద్భుతాలను చేస్తుంది . దాంతో మెటిమల ద్వార ఏర్పడ్డ మచ్చలు మాయం అవుతాయి . మరి ఈ పదార్థాలు ఉపయోగించి మచ్చలను మాయం చేసే ఈ ఫేస్ స్క్రబ్ ను ఎలా తయారుచేయాలి, ఏవిదంగా ఉపయోగించాలో తెలుసుకుందాం....

కావల్సినవి:
గ్రీన్ టీ బ్యాగ్స్ 2
పంచదార 2టేబుల్ స్పూన్లు
శెనగపిండి 1టేబుల్ స్పూన్
తయారీ:
గ్రీన్ టీ బ్యాగ్స్ ను బాయిలింగ్ వాటర్లో డిప్ చేసి పది , పదిహేను నిముషాలు ఉడికించాలి.
తర్వాత టీబ్యాగ్స్ ను వేడి నీటి నుండి తీసి, వాటిని కట్ చేసి అందులోని టీ లీవ్స్ ను బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి
టీఆకులు చల్లారిన తర్వాత ,వీటికి పంచదార, శెనగపిండి మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమం బాగా మిక్స్ చేయాలి.
ఉపయోగించే విధానం:
ఈ ఫేస్ స్క్రబ్ ను ముఖం మొత్తం పట్టించాలి. మొండి మచ్చలున్న ప్రదేశంలో కాస్త ఎక్కువగానే పట్టించాలి. తర్వాత ఈ ఫేస్ స్క్రబ్ ను సర్క్యులర్ మోషన్ లో స్క్రబ్ చేయాలి. అయితే ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా సున్నితమైన మసాజ్ చేయాలి . ఇలా స్క్రబ్ చేసిన 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి .
గమనిక : ఈ ఫేస్ స్క్రబ్ ఉపయోగించడానికి ముందు చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎలాంటి రియాక్షన్ లేకపోతే తర్వాత నేరుగా ముఖానికి అప్లేై చేసుకోవాలి. ఎలాంటి రియాక్షన్ లేకపోతే వారంలో రెండు సార్లు వేసుకోవడం ద్వారా ఎఫెక్టిగ్ గా పనిచేస్తుంది. అద్భుతమైన మార్పును మీ చర్మంలో గమనించవచ్చు. మొటిమలు మచ్చలు మాయం అవ్వడంతో పాటు, స్కిన్ కాంప్లెక్షన్ మెరుగుపడుతుంది.



Click it and Unblock the Notifications











