Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బ్యూటిఫుల్, గ్లోయింగ్ స్కిన్ పొందడానికి కాఫీ పౌడర్ స్ర్కబ్..
రోజంతా కాఫీ లేకుండా మీరుండగలరా ? ఒకసారి ఇమ్యాజిన్ చేసుకోండి, మనలో చాలమంది అలా ఉండలేరు, కనీసం రోజుకొక్కసారైనా కాఫీ రుచి చూడాల్సందే .
రోజుకొక్కసారైనా తీసుకునే ఈ వేడి వేడి కాఫీ తక్షణం ఉత్సహాన్ని మరియు ఎనర్జీని అందిస్తుంది.
అటువంటి కాఫీ మీ చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలందిస్తుందటే మీరేంచేస్తారు?అవును, ఖచ్చితంగా కాఫీబీన్ ను వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మార్చుతుంది.
ప్రతి రోజూ మనం అందంగా కనబడటానికి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం.
మనలో చాలా మందికి నార్మల్ చర్మ సంరక్షణ పద్దతులు మాత్రమే తెలుసు, చర్మాన్ని శుభ్రం చేసుకోవడం, ఎక్సఫ్లోయేట్ చేయడం, టోనింగ్ మరియు మాయిశ్చరైజింగ్ పద్దతులు మాత్రమే చాలా మందికి తెలుసు.

ప్రతి రోజూ చర్మానికి తీసుకొనే జాగ్రత్తల వల్ల చర్మంలోని మురికి మరియు మైక్రోబ్స్ తొలగిస్తుంది. చర్మ రంద్రాల సైజు తగ్గిస్తుంది, దాంతో స్కిన్ టోన్ పెరుగుతుంది.
చర్మకాంతిని మెరుగుపరచడంలో ఎక్సఫ్లోయేటింగ్ చాలా ముఖ్యం.ఎందుకంటే దీని వల్ల చర్మంలో మ్రుతకణాలు తొలగిపోతాయి. చర్మాన్ని కొత్తగా మెరిపిస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది, దాంతో చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.
చర్మం ఎక్సఫ్లోయేట్ చేసుకోవడానికి మార్కెట్లో వివిధ రకాల స్క్రబ్స్ ఉన్నాయి, కానీ వీటిలో చాలా వరకూ కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్, ఇవి చర్మానికి హాని కలిగిస్తాయి.
అందువల్ల, మీరు కూడా చర్మ అందాన్ని కాపాడుకోవడానికి నేచురల్ స్ర్కబ్ కోసం ప్రయత్నిస్తుంటే, హోం మేడ్ కాఫీ స్ర్కబ్ ను ప్రయత్నించండి. ఇది సురక్షితమైనది, ఖరీదు తక్కువ మరియు దీన్ని వంటగదిలోఉండే చాలా సింపుల్ పదార్థాలతో తయారుచేసుకోవచ్చు.
బాడీ స్ర్కబ్బింగ్ కోసం తయారుచేసే రిసిపి

కావల్సినవి:
కాపీ పౌడర్ 3 టేబుల్స్ స్పూన్
కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్
కాఫీ పౌడర్ అద్భుతమై నేచురల్ స్కిన్ ఎక్సఫ్లోయేటింగ్ ఏజెంట్. చర్మం మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది, దాంతో చర్మంలో డల్ మరియు డ్రై ప్యాచ్ లను తొలగిస్తుంది.
అదనంగా, కాఫీ పౌడర్ చర్మంలో మలినాలను మరియు మైక్రోబ్స్ ను తొలగిస్తుంది, వాటిని పూర్తిగా స్క్రబ్ చేసి నిర్మూలిస్తుంది.
కొబ్బరి నూనె, మరో నేచురల్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్ . ఇందులో చర్మాన్ని హైడ్రేట్ గా మార్చే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది చర్మంను సాఫ్ట్ గా మార్చుతుంది !
కొబ్బరి నూనె చర్మానికి తగిన పోషణను అందిస్తుంది. చర్మకాంతిని పెంచే ఆరోగ్యకరమైన చర్మ కణాలను ఉత్పత్తి చేస్తుంది. దాంతో చర్మం కాంతివంతగా మారుతుంది.
తయారీ
పైన సూచించన విధంగా పదార్థాలను ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి.
ఈ పదార్థాలను బాగా మిక్స్ చేసి పేస్ట్ చేయాలి.
ఈ పేస్ట్ ను శరీరానికి, ముఖం, మెడ మొత్తానికి అప్లై చేయాలి.
అప్లై చేసిన తర్వాత సున్నితంగా స్ర్కబ్ చేయాలి.
అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications