For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ స్కిన్ కేర్ కు గ్రేట్ హోం మేడ్ రెమెడీ: రోజ్ వాటర్ రిసిపి

By Super
|

ప్రస్తుతం వేసవి కాలంలో . వేసవి కాలంలో చర్మానికి చాలా హని జరుగుతుంది . సూర్యకిరణాల నుండి వచ్చే వేడి, ఎండ వల్ల చర్మంలో మొటిమలు, మచ్చలు, సన్ టాన్ మొదలగు చర్మ సమస్యలు ఏర్పడుతాయి . అందువల్ల ఈ సీజన్ లో చర్మం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

వేసవి కాలంలో ఎండకు మొదట ప్రభావితమయ్యేది చర్మం మరియు చాలా త్వరగా సూర్యకిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. దాంతో ఎంత అలంకరించుకొన్నా అందంగా కనబడరు.

మరి వేసవి కాలంలో ఎండ వేడిమి నుండి చర్మాన్ని కాపాడుకోవడం కోసం లక్కీగా , కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి . వాతావరణం ఎంత వేడిగా , ఎండగా ఉన్నా కొన్ని హోం రెమెడీస్ ను అందం కోసం ఉపయోగించక తప్పదు . అందుకోసం రోజ్ వాటర్ గ్రేట్ గా పనిచేస్తుంది.

రోజ్ వాటర్ మార్కెట్లో బ్యూటీ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. రోజు వాటర్ తీసుకొచ్చి మీ దిన చర్యలోఒక బాగం చేసుకోండి.

DIY Homemade Rose Water Recipe For The Summers

ప్రపంచంలో చాలా మంది సౌందర్య సాధానాల్లో ఒకటిగా రోజ్ వాటర్ ను ఉపయోగిస్తున్నారు . రోజ్ వాటర్ స్వచ్చమైనది, మన్నికైనది కొనుగోలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .

రోజ్ వాటర్ కాటన్ పాడ్ ను ముంచి ముఖానికి , లేదా సమస్య ఉన్న చోట అప్లైచేసినట్లైతే చర్మం మీద ఎఫెక్టివ్ గా పనిచేసి, చర్మానికి మంచి మార్పుతు తీసుకొస్తుంది.


రోజ్ వాటర్ చర్మానికి తగిన తేమను అందిస్తుంది .దాంతో చర్మం తాజాగా రోజంతా కనబడేలా చేస్తుంది .ముఖ్యంగా ఇది ఒక నేచురల్ రెమెడీ . అన్ని రకాల చర్మతత్వాలకు సరిపోతుంది . అన్ని రకాల బ్యూటీ సమస్యలను సింగిల్ గా నివారించడంలో రోజ్ వాటర్ గొప్పగా సహాయపడుతుంది.


వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం , ఇంట్లోనే సొంతంగా తయారుచేసుకోవడానికి రోజ వాటర్ తో పాటు ఇతర పదార్థలు ఉపయోగించి రెమెడీని ఎలా ఉపయోగించుకోవాలనే పద్దతిని ఈ బోల్డ్ స్కై మీకు అందిస్తోంది..

DIY Homemade Rose Water Recipe For The Summers

కావాల్సిన పదార్ధాలు

రోజ్ పువ్వు రేకులు

నీరు

వేడి చేయడానికి చిన్న పాట్

ఐస్ ముక్కలు

తయారు చేసే పద్దతి:
మొదట ఫ్రెష్ గా ఉన్న రోజా పువ్వు యొక్క రేకులను శుభ్రంగా కడిగి లోతుగా ఉన్న సాస్ పాన్ లో పెట్టాలి మరియు వీటితో పాటు, రోజా పువ్వు రేకులు మునిగే వరకూ నీరు పోయాలి . తర్వాత మూత పెట్టాలి. ఇప్పుడు బాయిల్ చేయాలి. 5 నిముషాలు ఉడికించిన తర్వాత మూత తీసి, పైన ఐస్ ముక్కలను వేయాలి.

ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి 30-35నిముషాలు ఉడికించడం వల్ల రోజా పువ్వు రేకుల కలర్ లో మార్పు చోటు చేసుకుంటుంది. తెల్లగా మారిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఈ ద్రావకాన్నీ బాగా చల్లారనివ్వాలి . తర్వాత ఒక బిగుతైన మూతున్నబాటిల్లో వడగట్టి పోసి , మీకు అవసరం అయినప్పుడు దీన్ని సౌందర్య సాధనంగా ఉపయోగించుకోవచ్చు.

English summary

DIY Homemade Rose Water Recipe For The Summers

summer is a season that is particularly harsh on your skin. To keep acne, breakouts, blemishes, etc, at bay, one must take due care of their skin during this season. Summer woes can greatly impact your skin and affect your appearance to a great extent.
Story first published: Wednesday, May 11, 2016, 18:38 [IST]
Desktop Bottom Promotion