For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గించే మిల్క్ పౌడర్-కోకనట్ మిల్క్ మాస్క్

By Super Admin
|

స్కిన్ పిగ్మెంటేషన్ అనేది చర్మ రంగులో మార్పు రావడం. ఇటువంటి చర్మ సమస్య వల్ల చర్మం చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది, మొత్తం చర్మ అందాన్ని పాడు చేస్తుంది.

చర్మ స్థితిగతులను అర్థం చేసుకోవడాని , కొద్దిగా సైన్స్ పరిజ్ఝానం తెలిసుండాలి.

మన చర్మం మరియు చర్మకాంతి చర్మంలో ఉండే మెలనిన్ వల్ల సాధ్యం అవుతుంది. ప్రస్తుత కాలంలో స్కిన్ పిగ్మెంటేషన్ తో చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వారిలో మెలనిన్ అత్యధికంగా ఉత్పత్తి అవడం లేదా మెలనిన్ లోపించడం ఈ రెండింటిలో ఏదో ఒక కారణం చేత స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణమవుతున్నారు. ఈ కారణంగా చర్మంలో కాంతి కోల్పోవడం, లేదా చర్మం మీద డార్క్ పాచెస్ ఏర్పడటం లేదా చర్మ రంగులో మార్పు కనబడుతుంది.

Milk Powder And Coconut Water Face Mask For Skin Pigmentation

అదే విదంగా స్కిన్ పిగ్మెంటేషన్ కు ఇంటర్నల్ గా హార్మోనుల ప్రభావం మరియు ఎక్సటర్నల్ గా యూవీ కిరణాలకు ఓవర్ గా ఎక్స్ ఫోజ్ అవ్వడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ ఎక్కువ కారణమవుతున్నాయి.

స్కిన్ పిగ్మెంటేషన్, స్కిన్ డిస్ కలర్ వల్ల చర్మ పూర్తిగా డల్ గా మరియు నిర్జీవంగా కనబడుతుంది. దాంతో అందంగా కనబడుటుకోసం, స్కిన్ టోన్ అందాన్ని పెంపొందించుకోవడం కోసం మేకప్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడటం ఎక్కువ అవుతుంది.

అందువల్ల, ఈ రోజు ఆ అవసరం లేకుండా ఫేస్ మాస్క్ కోసం రెండు అద్భుతమైన హోం రెమెడీస్ ను మీకు పరిచయం చేస్తోంది. ఇవి స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తాయి .

Milk Powder And Coconut Water Face Mask For Skin Pigmentation

వాటిలో ఒకటి పాల పౌడర్, కోకనట్ వాటర్. పాలపౌడర్ లో ప్రోటీనులు అధికంగా ఉంటాయి మరియు కోకనట్ వాటర్ లోల్యాక్టిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి . చర్మానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కు ఇవి ఒక గొప్ప మూలం.

ఈ నేచురల్ పదార్థాలను రెండింటిని కంబైండ్ చేసినప్పుడు స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది .చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. నేచురల్ గ్లోను అందిస్తుంది.

కావల్సినవి:

మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు

కొబ్బరి పాలు 1/3 కప్పు

ఎలా వాడుకోవాలి:

మిల్క్ పౌడర్, కోకనట్ వాటర్ రెండూ మిక్స్ చేయాలి.

పేస్ట్ లా అయిన తర్వాత ముఖం, మెడకు అప్లై చేయాలి.

అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

వారంలో రెండు మూడు సార్లు ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది

ఈ సులభమైన పద్దతిని ఉపయోగించి మాస్క్ తయారుచేసుకోవడం వల్ల స్కిన్ టోన్ చాలా ఎఫెక్టివ్ గా మెరుగుపరచుకోవచ్చు.

English summary

DIY Milk Powder And Coconut Water Face Mask For Skin Pigmentation

Internal factors like hormones and external factors like pollution or overexposure to ultraviolet radiation are the most common culprits behind the skin pigmentation issue.
Story first published:Wednesday, July 6, 2016, 11:15 [IST]
Desktop Bottom Promotion