Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
సింపుల్: వారంరోజులు ఈ ప్యాక్ వేస్తే.. యంగ్ లుక్ మీ సొంతం..!!
ప్రపంచంలోనే అత్యంత అందమైన, యంగ్ లుక్ కలిగిన మహిళ అంటే.. జపాన్ కి చెందిన మహిళలు. వాళ్ల చర్మం ఏమాత్రం నిర్జీవంగా ఉండదు. ఎప్పుడూ యంగ్, గార్జియస్ గా కనిపిస్తారు. వాళ్ల ముఖంలో ముడతలు, వయసు ఛాయలు కనిపించవు. దీనికి కారణం వాళ్ల దగ్గర దాగున్న మిరాకిలస్ బ్యూటీ సీక్రెట్.
వాళ్లు ఫాలో అయ్యే సింపుల్ బ్యూటీ టిప్ వల్ల.. ఎప్పుడు యంగ్ లుక్ తో మెరిసిపోతారు. ముఖం, కాంప్లెక్షన్ వల్ల 50 ఏళ్లలో కూడా 30 ఏళ్ల అందంతో మెరిసిపోతారు. అయితే దానికోసం మీరు చింతించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే మనం నిత్యం ఉపయోగించే వస్తువులతోనే.. చర్మాన్ని యంగ్ అండ్ డైనమిక్ గా మార్చేసుకోవచ్చు.

వయసు చాయలు, ముడతలతో పోరాడే.. సింపుల్ రెమిడీ మీ చేతుల్లో ఉంది. అయితే మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనికూడా లేదు. పార్లర్ ట్రీట్మెంట్ అసలే అవసరం లేదు. ఈ న్యాచురల్ ట్రీట్మెంట్ కి కావాల్సిన ముఖ్య పదార్థం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. రైస్ లేదా బియ్యం.
చర్మానికి నూతనోత్తేజాన్ని ఇవ్వడంలో బియ్యం గ్రేట్ గా పనిచేస్తాయి. ఇది చాలామందికి తెలియదు. జపనీస్ మహిళలు ఈ రైస్ నే బ్యూటీ సీక్రెట్ గా ఫాలోఅవుతారు. మరి బియ్యంతో.. ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ? చర్మానికి ఎలా గ్లోయింగ్ తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు
3 టేబుల్ స్పూన్ల బియ్యం
1 టేబుల్ స్పూన్ పాలు
1 టేబుల్ స్పూన్ తేనె
ముందుగా బియ్యం ఉడికించి వడకట్టాలి. బియ్యం ఉడికిన నీటిని పక్కనపెట్టుకోవాలి. ఆ అన్నంలోకి ఒక స్పూన్ వేడిపాలు కలపాలి. బాగా మిక్స్ చేశాక బాగా కలపాలి. ఇఫ్పుడు తేనె కలపాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత.. ఆరిన వెంటనే.. మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత అన్నం ఉడికించిన నీళ్లు ( గంజితో ) ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
రైస్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల.. చర్మాన్ని మాయిశ్చరైజర్ అందిస్తాయి. చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే వయసు ఛాయలను చూపించే స్పాట్స్, ఇన్ల్ఫమేషన్ తగ్గిస్తాయి. అలాగే రైస్ వాటర్ హెల్తీ, క్లియర్ మాయిశ్చరైజ్డ్ స్కిన్ అందిస్తాయి. అలాగే సన్ ప్రొటెక్షన్ ని అందిస్తాయి. దీంతో చర్మం యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications