For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై స్కిన్ ను సాఫ్ట్ గా, బ్యూటిఫుల్ గా మార్చే హోం రెమెడీస్

|

చలికాలంలో మాత్రమే కాదు వేసవి కాలంలో కూడా స్కిన్ డీహైడ్రేషన్ వల్ల చర్మం డ్రైగా మారుతుంది. ఈ డ్రై స్కిన్ నివారించుకోవడానికి వేసవిలో విరివిగా దొరికే అరటిపండ్లు బాగా సహాయపడుతాయి. అరటి పండ్లలో ఎక్కువ న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, ఇవి చర్మానికి చాలా అవసరం అవుతాయి . ఇది చర్మానికి తగిన తేమను అందించడంతో పాటు, చర్మ యొక్క డ్రై నెస్ ను నివారిస్తుంది.

డ్రై స్కిన్ నివారించడానికి కొన్ని బనాన ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వాటిని మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాము. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్నిచూడటానికి యవ్వనంగా మరియు మెరిసే విధంగా మార్చేస్తాయి.

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

పొడి చర్మం నివారించుకోవడానికి మార్కెట్లో అనేక లోషన్స్, మాయిశ్చరైజింగ్ క్రీములు ఉన్నాయి. అయితే అన్నీ కూడా ఎక్కువ ధర కలిగి ఉంటాయి. ఫలితం కూడా తాత్కాలికంగా ఉంటుంది. అయితే నేచురల్ హోం రెమడీస్ చవకైనవి మాత్రమే కాదు, ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి మరియు మంచి ఫలితాలను అంధిస్తాయి. ఇవి మీచర్మానికి తగినంత తేమను అంధించి, మీ చర్మానికి తిరిగి పూర్వ అనుభంను తీసుకొస్తాయి.

వేసవిలో పొడి బారిన చర్మం నివారించే బానానా ఫేస్ ప్యాక్స్

అరటి మరియు ఆలివ్ ఆయిల్ ప్యాక్: బనానా(అరటి)-నేచురల్(సాధారణ)నూనెలు: అరటి పండు, నేచురల్ ఆయిల్స్ (బాదాం నూనె, ఆలివ్ నూనె) వంటివి ఫర్ ఫెక్ట్ నేచురల్ స్కిన్ కేర్ కాంబినేషన్స్. ఒక బౌల్లో అరటి పండు గుజ్జు, తర్వాత ఒక చెంచా మీకు నచ్చిన ఏదేని నేచురల్ ఆయిల్ తీసిని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ముఖం స్మూత్ గా తయారవుతుంది. వీటితో పాటు మరికొన్ని నేచురల్ హోం రెమెడీస్ డ్రై స్కిన్ నివారించడానికి ఈ క్రింది విధంగా...

పాలు:

పాలు:

పాలలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు చర్మాన్ని సున్నితంగా మార్చే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది డ్రై అండ్ దురద చర్మాన్ని నివారిస్తుంది. మరియు ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. చర్మ సామర్థ్యంను పెంచుతుంది మరియు మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది. అలా మీ చర్మ రంగును కూడా మెరుగుపరుస్తుంది. * బాగా శుభ్రం చేసిన వస్త్రంను పాలలో డిప్ చేసి తర్వాత శరీరం మరియు ముఖంను శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే మరో వస్త్రంను వేడినీటిలో డిప్ చేసి, నీరు పిండిసే తర్వాత శరీరంను క్లీన్ గా తుడవాలి . ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మంచి

ఫలితం ఉంటుంది.

 కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె పొడి చర్మం నివారించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది . ఇందులో మంచి ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉన్నాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి . మరియు చర్మం నుండి తేమను కోల్పోకుండా, మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది. *నిద్రించడానికి ముందు గోరెవెచ్చకొబ్బరి నూనెను మీ శరీరానికి మొత్తానికి మర్దన చేయాలి. తర్వాత మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మీ చర్మం సున్నితంగా మరియు నునుపుగా తయారవుతుంది.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక ఉత్తమ మాయిశ్చరైజర్ గా మరియు పొడి చర్మానికి లూబ్రికేటర్ గా పనిచేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ చర్మం మరియు మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో జిడ్డు తక్కువగా ఉండి, చర్మంలోని చాలా తేలికగా చొచ్చుకొనిపోతుంది. *కొన్ని చుక్కల బాదంనూనెను చేతిలోని తీసుకొని మీ మొత్తం శరీరానికి అప్లై చేసి, మర్దన చేసుకోవాలి. అరగంట తర్వాత స్నానం చేసుకోవాలి . తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా రోజుకు ఒక సారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలొవెరా:

అలొవెరా:

కలబంద చర్మంను సున్నితంగా మరియ నునుపుగా మార్చే మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం పొడిబారడాన్ని, దురదను, మరియు పొరలును నివారిస్తుంది. ఈ సింపుల్ రెమడీ మీ చర్మానికి మాయిశ్చరైజర్ గాపనిచేస్తుంది. చర్మంలో ఎటువంటి మలినాలున్నా తొలగిస్తుంది. *ఆలొవెరా ఆకును కట్ చేసి తాజాగా ఉండే జెల్ ను మీ పొడి చర్మానికి అప్లై చేయాలి. చేసిన తర్వాత 10-15నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్:

ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్:

గుడ్డులోని తెల్ల సొన ఆయిల్ స్కిన్ ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎగ్ వైట్ తీసుకొని దాన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల మీ చర్మం మునపటి కంటే చాలా ఆరోగ్యంగా కనబడుటయే కాకుండా జిడ్డును వదిలించి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాదు ముఖ చర్మం వదులుగా లేకుండా టైట్ చేస్తుంది. చలికాలంలో దీన్ని వేసుకోవడం వల్ల చలినుండి, మంచు నుండి చర్మాన్ని కాపాడుతుంది.

బొప్పాయి ఫేస్ ప్యాక్:

బొప్పాయి ఫేస్ ప్యాక్:

బొప్పాయలో అనేక స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి శీతాకాలంలో చర్మ సంరక్షణకు అద్భుతంగా సహాయపడుతాయి . ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది మరియు చర్మం టైట్ చేస్తుంది. బాగా పండిన బొప్పాయిని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పది నిముషాల తర్వాత శుభ్ర చేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది.

శెనగపిండి మరియు పెరుగు :

శెనగపిండి మరియు పెరుగు :

డ్రై స్కిన్ నివారణకు ఇది ఒక పాపులర్ హోం మేడ్ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ కు నిమ్మరసాన్ని కలపకండి. ఎందుకంటే శీతాకాలంలో మీ చర్మాన్ని మరింత డ్రై గా మార్చుతుంది. తేనెను మిక్స్ చేసి ప్యాక్ లా వేసుకోవాలి.

తేనె

తేనె

తేనె ఒక నేచురల్ హైడ్రేషన్ ఏజెంట్. ఇది మాయిశ్చైజ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అందువల్ల తేనెను రఫ్ స్కిన్ మరియు డెడ్ స్కిన్ ను ఫ్రెష్ గా ఉంచడానికి తేనెను ఉపయోగించవచ్చు. రఫ్ గా ఉన్న చర్మంకి వారానికొక సారి తేనెను అప్లై చేయాలి. కొన్ని వారాల సమయంలో మంచి డిఫరెన్స్ కనబడుతుంది. అలాగే మీరు స్కిన్ టాన్, స్కిన్ డ్యామేజ్ ను నివారించుకోవాలంటే, తేనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, రఫ్ స్కిన్ కు అప్లై చేయాలి

ఫుల్లర్స్ ఎర్త్ ఫేస్ ప్యాక్

ఫుల్లర్స్ ఎర్త్ ఫేస్ ప్యాక్

ఫుల్లర్స్ ఎర్త్ ఫేస్ ప్యాక్ లను ఫుల్లర్త్ ఎర్త్ తో తయారుచేసినవి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది . ఇది రఫ్ మరియు డ్రై స్కిన్ కు ఒక ఉత్తమ పరిష్కారం . ఫుల్లర్స్ ఎర్త్ చర్మంను సాఫ్ట్ గా మార్చుతుంది. మరియు స్కిన్ డ్యామేజ్ ను నివారిస్తుంది . అందువల్ల ఫుల్లర్స్ ఎర్త్ డ్రైస్కిన్ కు రెగ్యులర్ గా అప్లై చేయడం ఒక మంచి స్కిన్ కేర్ టిప్ . ఫుల్లర్స్ ఎర్త్ చాలా సులభంగా లభ్యం అవుతుంది. మరియు ఖరీదు కూడా తక్కువే.

English summary

Dry Skin Remedies For Your Entire Body

There are a few home remedies that you can try to get rid of the dry skin on your entire body. We often only take care of our face forgetting to pamper the rest of our body.
Story first published: Saturday, February 27, 2016, 11:12 [IST]
Desktop Bottom Promotion