Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
డ్రై స్కిన్ తో బాధపడుతున్నారా ? ఇదిగో సింపుల్ రెమిడీ
కాంతివంతమైన చర్మం కలిగి ఉండి, ఎలాంటి చర్మ సమస్యలు లేకపోతే.. ఎంత బావుంటుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందమైన చర్మం పొందడానికి మనమందరం.. చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. రకరకాలుగా ట్రై చేసి.. ఆకర్షణీయమైన చర్మం పొందాలని భావిస్తుంటారు.
కానీ కొంతమందికి డ్రై స్కిన్ చాలా పెద్ద సమస్యగా మారి ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్నవాళ్లు ఎంతగా ప్రయత్నించి.. స్కిన్ టోన్ మెరుగుపరుచుకోవాలని భావించినా.. సరైన ఎఫర్ట్ పెట్టలేకపోతారు. కానీ.. కాస్త ఓపిక చేసుకుని ప్రయత్నిస్తే.. మీరు అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

చర్మ సమస్యలు రకరకాలుగా వస్తుంటాయి. యాక్నె, పిగ్మెంటేషన్, టానింగ్, డార్క్ సర్కిల్స్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, ఎగ్జిమా, ర్యాషెస్.. ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏదైతేనేం.. చర్మ సమస్యలతో ఉండటం అంటే.. చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వీటిని మొదట్లోనే గుర్తించడం చాలా అవసరం.
డ్రై స్కిన్ అనేది ఒక ముఖ్యమైన, అత్యంత విసుగు పుట్టించే చర్మ సమస్య. ఇది దురద, స్ట్రాబింగ్, ఫ్లాకింగ్ వంటి సమస్యలు తీసుకొచ్చే.. మీ ఆకర్షణపై దుష్ర్పభావం చూపిస్తుంది. కాబట్టి డ్రై స్కిన్ నివారించడానికి న్యాచురల్ ట్రీట్మెంట్ కోసం ప్రయత్నించాలి అనుకుంటే.. ఇక్కడున్న హోం మేడ్ ఫేస్ ప్యాక్,... చక్కటి పరిష్కారం.

కావాల్సిన పదార్థాలు
టమోటా సగం
పెరుగు 2 టేబుల్ స్పూన్లు
అవకాడో గుజ్జు 2 టేబుల్ స్పూన్లు
చర్మాన్ని న్యాచురల్ గా హైడ్రేటింగ్ ఏజెంట్ లా పనిచేస్తాయి టమోటా, పెరుగు, అవకాడో. వీటన్నింటినీ మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల.. డ్రై స్కిన్ చాలా త్వరగా నివారించవచ్చు. ఈ పదార్థాలన్నీ చర్మానికి ఎంతో అవసరమైన పీహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి.
చర్మాన్ని సాఫ్ట్ గా, హెల్తీగా ఉంచుతాయి. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల.. న్యాచురల్ గ్లో వస్తుంది. చర్మంలోని ప్రతి కణాన్ని.. హైడ్రేట్ చేసే సత్తా.. ఈ ఫేస్ ప్యాక్ కి ఉంటుంది. డ్రైనెస్ నుంచి రిలీఫ్ అందిస్తుంది. రఫ్ నెస్ ని నివారించి.. చర్మానికి గ్లోయింగ్ అందిస్తుంది.

తయారు చేసే విధానం
పైన చెప్పిన పదార్థాలన్నీ తగిన మోతాదులో తీసుకుని.. బ్లెండ్ లో వేసి.. మెత్తగా పేస్ట్ చేయాలి.
ఈ పదార్థాన్ని వడకట్టాల్సిన అవసరం లేదు.
మిశ్రమాన్ని ముఖానికి సమానంగా పట్టించాలి.
15 నిమిషాలు ఆరిన తర్వాత మైల్డ్ ఫేస్ వాష్ ఉపయోగించి.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
అంతే.. సింపుల్ ఫేస్ ప్యాక్ డ్రై స్కిన్ కి గుడ్ బై చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications