Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొద్దిసేపు కాదు.. ఎప్పటికీ మెరిసిపోవడానికి.. హోంమేడ్ స్ర్కబ్స్
చర్మం మెరిసిపోవాలని ఎవరు కోరుకోరు. అందంగా కనిపించాలని అనుకోని వాళ్లు ఎవరుంటారు. దానికోసం ఎన్నో.. ఎన్నెన్నో క్రీములు, స్ర్కబ్స్, ఫేస్ వాష్ లు వాడేస్తూ ఉంటారు. అయితే.. మార్కెట్ లో దొరికే ఏ క్రీమ్, స్ర్కబ్ లోనైనా.. కెమికల్స్ కంపల్సరీ ఉంటాయి. కానీ.. అలాంటి స్ర్కబ్స్ ముఖానికి ఉపయోగిస్తే.. తాత్కాలికంగా మెరిసిపోతున్నామన్న ఫీలింగ్ కల్పించినా.. తర్వాత.. వాటి ఫలితాలు చర్మ సమస్యలకు కారణమవుతాయి.
మార్కెట్ పై ఆధారపడకుండా.. మీ వంటింట్లో ఉన్న వస్తువులతోనే స్ర్కబ్ తయారు చేసుకుని.. ఉపయోగిస్తే ఎంతో ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఇంట్లో చేసుకోవడమా అంత తీరిక లేదని ఢీలా పడకండి. కాసేపు టైం కేటాయిస్తే.. సింపుల్ గా, న్యాచురల్ గా ఉండే స్ర్కబ్స్ తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే స్ర్కబ్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

తేనె, ఆరంజ్
నారింజ తొక్క పొడి, ఓట్స్ ని సమానంగా రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని బాగా మిక్స్ చేయాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకుని పేస్ట్ తయారు చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ స్ర్కబ్ తో పై నుంచి కిందకి.. గుండ్రంగా స్ర్కబ్ చేయాలి. కాసేపు ముఖంపై అలానే వదిలేసి.. శుభ్రం చేసుకోవాలి. ఇది టోనర్ లా, మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

అరటిపండు
బాగా పండిన రెండు అరటిపండ్లు తీసుకోవాలి. మెత్తగా పేస్ట్ లా చేసి.. చక్కెర కలపాలి. ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపితే.. మాయిశ్చరైజ్ లా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖంపై బాగా మసాజ్ చేయాలి. స్ర్కబ్ చేశాక 5 నిమిషాలు అలానే వదిలేసి.. చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం.

చేతులకు, పాదాలకు నిమ్మ స్ర్కబ్
ఒక నిమ్మకాయ తీసుకుని సగానికి కట్ చేయాలి. రెండింటినీ.. పంచదార పొడిలో అద్దాలి. ఇప్పుడు చేతులు, పాదాలపై 5 నిమిషాల పాటు స్ర్కబ్ చేయాలి. అయితే.. ఈ స్ర్కబ్ ని ఎప్పటికీ ముఖంపై ఉపయోగించకండి.
పాదాలు, చేతులపై 5 నిమిషాలు మసాజ్ చేశాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం స్మూత్ గా మారిపోతుంది.

పెరుగు, పపాయ
బాగా పండిన బొప్పాయి పండు గుజ్జు అర కప్పు తీసుకుని, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కలపాలి. మూడు చుక్కల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ స్ర్కబ్ తో ఫేస్ ని బాగా స్ర్కబ్ చేసి.. 5 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. గార్జియస్ స్కిన్ మీ సొంతం.

టమోటా
ఒక ప్లేట్ గ్రౌండ్ ఓట్స్, పంచదార పొడి తీసుకోవాలి. బాగా పండిన ఎర్రటి టమోటాలను కట్ చేసుకోవాలి. పంచదార, ఓట్స్ మిశ్రమంలో టమోటాలను అద్దాలి. ఇప్పుడు టమోటాను మీ చర్మంపై సర్కులర్ మోడ్ లో బాగా రబ్ చేయాలి. ఫేస్, నెక్ బాగా స్ర్కబ్ చేయాలి. ఇలా బాగా స్ర్కబ్ చేయడం వల్ల టమోటా.. న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ పని చేసి.. మీ చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది.

సాల్ట్, నిమ్మ, పంచదార
మీరు మీ చర్మాన్ని నవయవ్వనంగా మెరిపించుకోవాలి అనుకుంటున్నారా ? అయితే ఈ స్ర్కబ్ చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అరనిమ్మకాయ రసం, పంచదార తీసుకుని అన్నీ బాగా మిక్స్ చేయాలి. దీంతో బాగా స్క్రబ్ చేయడం వల్ల చర్మానికి న్యాచురల్ లుక్ సొంతమవుతుంది.

ఓట్ మీల్
పాలు 2టేబుల్ స్పూన్లు, ఓట్ మీల్ 1 కప్పు, ఒక గుడ్డులోని తెల్లసొన, పంచదార ఒక టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ బాదాం ఆయిల్ తీసుకోవాలి. ఓట్ మీల్ ని పొడి చేసుకోవాలి. మరీ స్మూత్ గా కాకుండా బరకగా పొడిచేయాలి. ఈ మిశ్రమంలోకి మిగిలిన పదార్థాలన్నీ మిక్స్ చేసి.. ముఖంపై స్ర్కబ్ చేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తేనె, నిమ్మరసం
నిమ్మరసం న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. అలాగే నిమ్మరసంను తేనెతో కలిపి రాసుకోవడం వల్ల చర్మం స్మూత్ గా, గ్లోయింగ్ గా మారుతుంది. 2 టేబుల్ స్పూన్ల తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ పంచదార మిక్స్ చేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ముఖానికి మసాజ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications