Latest Updates
-
భార్య ఎల్లప్పుడూ భర్తకి ఎడమవైపునే ఎందుకు కూర్చుంటుందో తెలుసా.? -
మగవారికి షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం గమనిస్తున్నారా.? -
ఆలయాల్లో దేవతలను మేల్కొలిపే సుప్రభాతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం -
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా.. -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా? -
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
ఫోర్ హెడ్ (నుదిటిన)పింపుల్స్ మాయం చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్
చాలా మంది ఫోర్ హెడ్ (నుదిటిన) మొటిమలతో ఇబ్బందిపడుతుంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన సాధారణ సమస్య . ఈ సమస్యను ఎవరైనా ఫేస్ చేయవచ్చు. ముఖ్యంగా ఫోర్ హెడ్ ప్రాబ్లమాటిక్ ఏరియా . చాలా సులభంగా మొటిమలకు దారితీస్తుంది .
ఆయిల్ హెయిర్ మరియు చుండ్రు వంటివి ఫోర్ హెడ్ మీద మొటిమలు ఏర్పడటానికి ముఖ్యకారణం. అలాగే హార్మోనుల ప్రభావం కూడా ఫోర్ హెడ్ పింపుల్ కు కారణం అవుతుంది .
బ్యాక్ స్కార్స్ (వీపున మచ్చలు, మొటిమలు)నివారించే చిట్కాలు
ఫోర్ హెడ్ మీద కనిపించే మొటిమలను కవర్ చేయాలంటే చాలా కష్టం. ఫోర్ హెడ్ చాలా త్వరగా జిడ్డుగా మరుతుంటుంది. అంతే కాదు ఫోర్ హెడ్ తో పాటు, ముక్కు కూడా ఆయిలీగా మారుతుంది . ఫోర్ హెడ్ ఆయిల్స్ , కండీషనర్స్, డైస్, మరియు షాంపులకు ఎక్స్ఫోజ్ అవుతుంటుంది. ఈ అన్ని రకాల కాంబినేషన్స్ ఫోర్ హెడ్ మీద మొటిమలు మరియు మచ్చలు ఏర్పడటానికి కారణం అవుతుంది.
మొటిమలను నివారించే రెగ్యులర్ స్కిన్ కేర్ టిప్స్
ఫోర్ హెడ్ పింపుల్స్ నివారించడానికి హోం రెమెడీస్ చక్కగా పనిచేస్తాయి. కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు, మొటిమలను నివారించడంలో ప్రత్యేకంగా పనిచేస్తాయి. ఇవి మొటిమలను , మచ్చలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ఫోర్ హెడ్ మీద ఏర్పడ్డ మొటిమలను నివారించడానికి సహాయపడే కొన్ని ఎఫెక్టివ్ మార్గాలు ఈ క్రింది విధంగా...

టమోటో:
టమోటోను రెండు గా కట్ చేసి మొటిమలున్న ప్రదేశంలో నేరుగా అప్లై చేసి మర్ధన చేయాలి . ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ఫోర్ హెడ్ మీద వచ్చిన మొటిమలు మచ్చలు తొలగిపోతాయి . ఫోర్ హెడ్ పింపుల్స్ తొలగించడంలో మరియు స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపరచడంలో టమోటో గ్రేట్ గా సహాయపడుతుంది.

గుడ్లు:
గుడ్లు మొటిమలను మచ్చలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఎగ్ వైట్ చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది మరియు ఫోర్ హెడ్ పింపుల్స్ నివారిస్తుంది. ఫోర్ హెడ్ పింపుల్ మీద నేరుగా ఎగ్ వైట్ ను అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

క్లే మాస్క్:
మట్టితో మాస్క్ వేయడం వల్ల ఫోర్ హెడ్ పింపుల్స్ గ్రేట్ గా నివారించుకోవచ్చు . కొద్దిగా సీమడ్ కు టీట్రీ ఆయిల్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ఫోర్ హెడ్ స్కిన్ కు అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొత్తమీర జ్యూస్:
కోరియాండర్ జ్యూస్ లో కొద్దిగా పసుపు చేర్చి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ పీల్ పేస్ట్:
ఆరెంజ్ పీల్ పౌడర్ చాలా గ్రేట్ గా పనిచేస్తుంది . ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ . ఆరెంజ్ పీల్ పౌడర్ కు కొద్దిగా పసుపు చేర్చి పేస్ట్ లా చేయాలి. తర్వాత దీన్ని ఫోర్ హెడ్ మీద అప్లై చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ఫోర్ హెడ్ పింపుల్స్ మాయం అవుతాయి,.

నిమ్మరసం:
భాదకరమైన మొటిమలను నివారించడానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసం చర్మ రంధ్రాల్లోనికి చొచ్చుకొనిపోయి మురికిని తొలగిస్తుంది. నిమ్మకాయను రెండు లేదా మూడు భాగాలుగా కట్ చేసి ముఖం మీద రుద్దాలి. రుద్దిన తర్వాత కొన్ని గంటలు అలాగే ఉంచాలి. తర్వాత కోల్డ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల పెయిన్ ఫుల్ పింపుల్స్ ను నివారించి, చికిత్సనందిస్తుంది.

అద్భుతమైన మూలిక మెంతి:
మీరు మెంతి ఆకులను మెత్తగా పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేవచ్చు. నొప్పికలిగించే మొటిమల నివారణకు ఇది ఒక అద్భుతమైన హెర్బల్ రెమడీ. కొన్ని తాజా మెంతి ఆకులను తీసుకొని, కొద్దిగా నీళ్ళు చేర్చి, మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15నిముషాలు అలాగే వదిలేసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

వేపతో అమ్మమ్మ చిట్కా:
స్నానం చేసే నీటిలో వేపాకులను వేయడం మీ అమ్మ లేదా బామ్మగారు వేయడాన్ని బహుశా మీరు చూసి ఉంటారు. అనేక చర్మ సమస్యలను నివారించడంలో అద్భుతమైన గుణగణాలు వేపలో పుష్కలంగా ఉన్నాయి. వేపఆకులను మెత్తగా పేస్ట్ చేసి ప్రతి రోజూ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు మచ్చలు నివారించుకోవచ్చు.

తేనె:
మొటిమల ఉన్న ముఖం మీద వారం రోజుల పాటు క్రమంగా తేనెను అప్లై చేసి పది నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇది మొటమలకు దారితీసే చర్మ రంధ్రాలు మూసుకుపోయేందుకు బాగా సహాయపడుతుంది.

అలోవెర జెల్:
అనేక బ్యూటీ సమస్యలను నివారించడం కోసం అలోవెర జెల్ ను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. చాలా రకాలా బ్యూటీ క్రీముల్లో వినియోగిస్తున్నారు. అలోవెరా జెల్ ను సింపుల్ గా ముఖానికి అప్లై చేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది. మొటిమలను పూర్తిగా నివారించడం కోసం ఇందులో పుష్కలమైన ఔషధగుణాలున్నాయి.



Click it and Unblock the Notifications