For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మార్ట్ లుక్ కోసం.. అబ్బాయిలు వేసుకోవాల్సిన ఫేస్ ప్యాక్స్..!

By Swathi
|

మగవాళ్ల చర్మం కాస్త గరుకుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా వాళ్ల చర్మం కాస్త హార్డ్ గా, డల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫెయిర్ గా ఉండే వాళ్ల చర్మం నిగారిస్తూ కనిపించినప్పటికీ.. కాస్త ఎండలోకి వెళ్లేసరికి వాళ్లది కూడా జిడ్డు కారిపోతూ ఉంటుంది. దీనికి వాళ్లకున్న అలవాట్లు, షేవింగ్ క్రీమ్స్, రేజర్ ఎఫెక్ట్ కారణం కావచ్చు.

అబ్బాయిలు వాళ్ల జుట్టు విషయంలో చేసే కామన్ మిస్టేక్స్..!

అయితే మగవాళ్లు కూడా చర్మం స్మూత్ గా, ఎట్రాక్టివ్ గా మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సలూన్ లలో చేయించుకునే ఫేషియల్స్, క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ అంత ఎఫెక్టివ్ ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీరు కూడా వారానికి ఒకసారి ఇంట్లో ఫేస్ ప్యాక్ లు వేసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. మరి మగవాళ్లు ఇంట్లో వేసుకునే సింపుల్ ఫేస్ ప్యాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

వెనిగర్

వెనిగర్

గ్లోయింగ్, కాంప్లెక్షన్ స్కిన్ పొందడానికి రాత్రి పడుకోవడానికి ముందు ఈ సింపుల్ టిప్ ఫాలో అయిపోండి. రెండు కప్పుల నీళ్లు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కలిపి రాత్రి పడుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇది చర్మానికి క్లెన్సింగ్ లా పనిచేసి.. గ్లోయింగ్ అందిస్తుంది.

నిమ్మకాయ

నిమ్మకాయ

నిమ్మ న్యాచురల్ క్లెన్సర్ లా పనిచేస్తుంది. చర్మం తాజాగా కనిపించాలంటే.. కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అంతే.. మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

ఎగ్

ఎగ్

మీది పొడిచర్మం అయితే.. ఒక గుడ్డులోని పచ్చసొన తీసుకుని.. కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలపాలి. ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే.. కేవలం ఎగ్ వైట్ తీసుకోవాలి. ఒకవేళ నార్మల్ స్కిన్ అయితే.. ఎగ్ మొత్తం ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్ ని అప్లై చేసి.. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ శుభ్రం చేసుకునేటప్పుడు ఫేస్ వాష్ ఉపయోగించరాదు.

పాలు

పాలు

ఎక్కువ కష్టపడకుండా.. ఫ్రెష్ లుక్ సొంతం చేసుకోవడానికి ఇదో చక్కటి పరిష్కారం. పాలు, తేనె కలిపి ప్యాక్ తయారు చేసి.. ముఖానికి అప్లై చేయాలి. చాలా మందంగా ఉండాలి. పూర్తీగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. కొత్త నిగారింపు సొంతమవుతుంది.

పెరుగు

పెరుగు

చర్మానికి నిగారింపు తీసుకురావడానికి, ట్యాన్ తొలగించడానికి పెరుగు చక్కటి పరిష్కారం. చర్మంపై మొటిమల వల్ల ఏర్పడిన గుంతలు నివారించాలని భావిస్తుంటే.. పెరుగుని డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

అరటిపండ్లు

అరటిపండ్లు

చర్మానికి మాయిశ్చరైజర్ అందించి.. చర్మాన్ని సాఫ్ట్ గా మారుస్తాయి అరటిపండ్లు. ఒక అరటిపండుని మెత్తటి పేస్ట్ చేసుకుని చర్మానికి అప్లై చేయాలి. ముఖానికి, మెడకు రాసి.. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. అవసరమైతే.. కొంచెం తేనె, రోజ్ వాటర్ కలుపుకోవచ్చు.

పెరుగు, ఆరంజ్ జ్యూస్

పెరుగు, ఆరంజ్ జ్యూస్

పెరుగు మాత్రమే కాకుండా.. పెరుగుకి ఆరంజ్ జ్యూస్, అలోవెరా మిక్స్ చేసి.. ఫేస్ కి అప్లై చేయాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మానికి నూతనోత్తేజం వస్తుంది.

English summary

Effective Homemade Face Packs for Men to Look Smart

Homemade Face Masks for Men. Face Masks for Men. He Can Make At Home. We suggest some simple and natural remedies for your face.
Story first published:Wednesday, June 1, 2016, 10:04 [IST]
Desktop Bottom Promotion