For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డార్క్ స్పాట్స్ మాయం చేసే.. ఎఫెక్టివ్ హోంమేడ్ ఫేస్ ప్యాక్స్

By Swathi
|

ముఖమంతా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ.. అక్కడక్కడ నల్లటి మచ్చలు... మీ అందాన్ని ఆవిరి చేస్తాయి. ఎంత అందంగా డ్రెస్ చేసుకుని, మేకప్ చేసుకున్నా.. నల్లటి మచ్చలు అందవిహీనంగా మారుస్తాయి. కాబట్టి వీటిని న్యాచురల్ గా మాయం చేసుకునే ప్రయత్నం చేయాలి.

ఈ నల్లటి మచ్చలు మొటిమలు, ర్యాషెస్, స్కార్స్ వల్ల వస్తాయి. వీటిని తగ్గించుకోవడం వల్ల.. మీ చర్మం గ్లోయింగ్ మారుతుంది. మరి ఈ నల్లటి మచ్చలు నయం చేయడానికి న్యాచురల్ పదార్థాలు అందుబాటులో ఉంటాయి. వంటింట్లో ఉపయోగించే పదార్థాలతోనే ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే.. నల్లటి మచ్చలు మాయమవుతాయి.

Face Packs To Treat Dark Spots

తేనె, పాలు
తేనె, పాలు కలిపిన ఫేస్‌ ప్యాక్‌ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ ప్యాక్‌తో యాక్నే, మొటిమలు పోతాయి. పాలు స్కిన్‌ క్లీన్సర్‌గా పని చేస్తాయి. పాల్లో తేనెను కలిపి రాసుకుంటే చర్మం నిగారిస్తుంది. ఒక గిన్నెలో పాలు, తేనె తీసుకుని రెండింటినీ బాగా కలిపి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత రెండు నిముషాలు ముఖాన్ని సున్నితంగా మసాజ్‌ చేయాలి. 15-20 నిమిషాల తర్వాత ప్యాక్‌ తొలగించుకోవాలి.

Face Packs To Treat Dark Spots

బంగాళాదుంప, నిమ్మకాయ
బంగాళాదుంప జ్యూస్, నిమ్మకాయ రసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే హైపర్‌ పిగ్మెంటేషన్‌, నల్లమచ్చలు పోతాయి. కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలు కూడా మాయమవుతాయి. ఒక బంగాళాదుంపను తీసుకుని తొక్కను తీసేసి.. గుజ్జులా చేయాలి. ఒక నిమ్మకాయ రసంను ఆ గుజ్జులో కలిపి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Effective Homemade Face Packs To Treat Dark Spots

Effective Homemade Face Packs To Treat Dark Spots. As girls, we already have so many problems to deal with, such as deciding which dress to wear the next day, what hairstyle to wear, which shoe to pick, which accessories to wear etc!
Story first published:Tuesday, August 30, 2016, 15:46 [IST]
Desktop Bottom Promotion