Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
స్కిన్ మీద బ్రౌన్ అండ్ డార్క్ ప్యాచ్ లు నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్
శరీరంలో చర్మం మీద ఎలాంటి మచ్చలు మొటిమలు, స్కార్క్ లేకుంటేనే చర్మం చూడటానికి అందంగా ఉంటుంది. అదే అందమైన ఫెయిర్ స్కిన్ మీదే ఎక్కడో ఒక చోట చిన్న మచ్చ కనబడితే చాలు అది చూడటానికి ఎంత అసహ్యంగా కనబడుతుందో. ముఖ్యంగా తెల్లగా ఉండే వారిలో ఇలాంటి డార్క్ పాచ్ లు మరింత ఇబ్బందికరంగా మారుతాయి . ఈ సమస్యను నివారించడానికి నిమ్మరసం చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.
అదే విధంగా, లాక్టిక్ యాసిడ్స్ లేదా ఏలాంటి యాసిడ్స్ ఉన్న ఆహారాలైనా డార్క్ ప్యాచ్ లను నివారిస్తుంది . హార్మోనుల సమస్యలు, సన్ టాన్ మరియు వయస్సు రిత్యా చర్మంలో డార్క్ ప్యాచ్ లు ఏర్పడుతాయి.
మెడ చుట్టూ డార్క్ స్కిన్ ప్యాచెస్ నివారించే ఉత్తమ హోం రెమెడీస్
హార్మోనుల సమస్య వల్ల ఎవరైతే ఇలా స్కిన్ ప్యాచ్ లు, మెడ మీద నల్ల చారలు, మచ్చలతో బాధపడుతున్నారో వారిని చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు ముఖ్య కారణం అసహ్యమైనటువంటి స్కిన్ ప్యాచ్ లు. ఈ సమస్య నుండి తక్షణం బయటపడాలంటే, నేచురల్ హోం రెమెడీస్ ఉపయోగపడుతాయి. ఇవి డార్క్ గా ఉన్న స్కిన్ ప్యాచ్ లను లైట్ చేస్తాయి.
మోచేతులు నల్లగా, గరుకుగా మారి ఇబ్బంది పెడుతున్నాయా ?
అయితే, ఈ నేచురల్ రెమెడీస్ ఉపయోగించడానికి ముందు స్కిన్ టెస్ట్ చేసి తర్వాత నేరుగా స్కిన్ ప్యాచ్ లున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అప్లై చేయకూడదు. మరి రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

పెరుగు:
స్కిన్ టోన్ మార్చడంలో పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది: ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, 2 చెంచాలా నిమ్మరసం మరియు ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వీటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ మరియు బ్లీచింగ్ లక్షణాలు డార్క్ ప్యాచ్ లను నివారిస్తుంది.

షుగర్ అండ్ లెమన్:
డార్క్ ప్యాచ్ లను నివారించడంలో నిమ్మ మరియు షుగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసానికి కొద్దిగా షుగర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి రబ్ చేయాలి. తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత 4-5గంటలు సేపు ఎండలో తిరగకుండా ఉండాలి.

పచ్చిపాలు:
పచ్చిపాలను ప్రతి రోజూ రాత్రి పడుకొనే ముందు అప్లై చేయాలి. ఇది స్కిన్ టోన్ ను గ్రేట్ గా నివారిస్తుంది. పాలు చాలా ఎఫెక్టివ్ గా స్కిన్ టోన్ మార్చడంలో సహాయపడుతుంది.

బొప్పాయి జ్యూస్:
బొప్పాయి జ్యూస్ చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ . ముఖం మరియు శరీరంలో ఏర్పడ్డ డార్క్ ప్యాచెస్ ను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా రోజూ అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

మిల్క్ పౌడర్:
మిల్క్ పౌడర్ ను నీళ్ళతో మిక్స్ చేసి, ముఖానికి పట్టించాలి . అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది . పాలపౌడర్లోని ల్యాక్టిక్ యాసిడ్ మరియు ఎంజైమ్స్ డార్క్ ప్యాచ్ లు నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది మొటిమలు మరియు మొటిమలతో వచ్చిన చర్మ రంద్రాల మీద ఎఫెక్టివ్ గా పనిచేసి, డార్క్ ప్యాచ్ లను నివారిస్తుంది. చర్మ రంద్రాలు శుభ్రం చేసి, రంద్రాలు క్లోజ్ అయ్యేలా చేస్తుంది. నీటితో మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

తేనె:
డార్క్ ప్యాచ్ ల మీద తేనెతో ప్యాక్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తేనెతో ప్యాక్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత దాని మీద నిమ్మరసంను అప్లై చేయాలి . బాగా మసాజ్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా మూడు రోజుల తర్వాత తిరిగి అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద:
స్కిన్ మీద ఉండే డార్క్ ప్యాచ్ లకు అలోవెర జెల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ జెల్ తో ముఖం మీద నేరుగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . తర్వాత పాలతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక వారం తర్వాత తిరిగి ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

బాదం:
బాదంలో ఉండే విటమిన్ ఇ చర్మ సంరక్షణకు గ్రేట్ గా సహాయపడుతుంది. బాదంను రాత్రి నీళ్ళలో వేసి నానబెట్టి, తర్వాత పేస్ట్ చేసి ఉదయం ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డార్క్ స్పాట్స్ ను తగ్గించి, చర్మంను కాంతివంతంగా మార్చుతుంది.

బంగాళదుంప:
బంగళదుంపను డార్క్ సర్కిల్స్ నివారించుకోవడానికి ఉపయోగిస్తుంటారు. బంగాళ దుంప రసం నల్లమచ్చలతో పాటు, స్కిన్ ప్యాచ్ లను నివారిస్తుంది . బంగాళదుంప రసం పట్టించి, డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications