Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ పొందడానికి డైట్ లో చేర్చుకోవాల్సిన ఫుడ్స్..
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కేవలం ఫేషియల్స్, క్రీమ్స్, స్క్రబ్ లు మాత్రమే కాదు.. ఆహారం కూడా చాలా ముఖ్యమైనది. తీసుకునే ఆహారం కూడా.. మీ చర్మ సౌందర్యాన్ని డిసైడ్ చేస్తుంది. చర్మం నిగారింపు పొందడానికి కొన్ని ఫ్రూట్స్, ఫుడ్స్ ని డైట్ లో చేర్చుకోవాలి.
స్కిన్ ని గ్లోయింగ్ మార్చడానికి ముందు కాస్మటిక్స్‌కు దూరంగా ఉండాలి. వాస్తవానికి అందమంటే కేవలంపై పై పూతలతో మెరిసే చర్మం కాదు నిజమైన అందం లోపలి నుంచి పొందాలి. మనం తీసుకునే ఆహారమే ఇందుకు ప్రాణమవుతుంది. కొన్ని ఆహార పదార్థాలు మీకు సహజ సౌందర్యాన్ని అందిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టమోటో
ఆహారంలో అతి ముఖ్యమైనవి టమోటోలు. ఇందులో సమృద్ధిగా ఉండే లైకోపిన్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎండకు కమిలిన చర్మాన్ని టమోటోలో ఉండే కెరటాయిడ్స్ చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు నివారిస్తాయి. టమోటోలను రసంగా, సాస్‌గా, పేస్ట్‌గా వాడుకోవచ్చు.

అవకాడో
చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో అవకాడో చాలా కీలకంగా పనిచేస్తాయి. అవకాడోసలో ఉండే పోషకాలు జుత్తు, గోళ్లు, చర్మానికి ఎంతో సహాయపడతాయి.

సిట్రస్ ఫ్రూట్స్
సిట్రస్ ఫ్రూట్స్ లో సమృద్ధిగా ఉండే విటమిన్ సి చర్మానికి చక్కటి ఆకర్షణను ఇస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గానే కాకుండా, చర్మంలో ఉండే ఆక్సిడేటివ్ సిట్రస్‌ను తగ్గిస్తాయి. ఇవి చర్మంలో ముడతలు పడకుండా కాపాడతాయి.

గుడ్లు
రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లో ఉడికించిన గుడ్లను తీసుకుంటే మీ చర్మం చాలా అందంగా తయారవుతుంది. గుడ్డల్లో ప్రొటీన్‌తో పాటు విటమిన్ ఏ, జింక్, విటమిన్ సి పొందవచ్చు. వీటితోపాటు ట్రెటినిన్ అనే పోషకం నిర్జీవమైన చర్మాన్ని గ్లోయింగ్ గా మారుస్తుంది.

బాదం
బాదాంలో చర్మానికి పోషణ అందించే ప్రొటీన్స్ ఉంటాయి. అలాగే విటమిన్ ఈ, సెలేనియం ఉండటం వల్ల సూర్మరశ్మికి చర్మం దెబ్బ తినకుండా రక్షణ పొందవచ్చు. అలాగే చర్మం పొడి బారకుండా, వాపు రాకుండా కాపాడుతుంది.

పాలకూర
పాలకూరలో విటమిన్ బి, సి, ఇ లుఎక్కువగా ఉండటంతో పాటు లైకెలుటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శక్తివంతంగా యవ్వనంగా మారుస్తాయి.



Click it and Unblock the Notifications