For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మాన్ని 2రెట్లు బ్రైట్ గా మార్చే అమేజింగ్ సీక్రెట్..! పొటాటో జ్యూస్..!

పచ్చి బంగాళాదుంపలో విటమిన్ ఏ, సి, బి ఉంటాయి. ఇవి చర్మాన్ని క్లెన్స్ చేస్తాయి. చర్మంలో పేరుకున్న మురికి తొలగించి, రంధ్రాలను సన్నగా మార్చి, చర్మానికి ఎనర్జీనిస్తాయి. దీనివల్ల చర్మం గ్లో పొందుతుంది.

By Swathi
|

మీ చర్మం డల్ గా ఉందా ? అలసిపోయినట్టు, నల్లగా కమిలిపోయిందా ? మీ చర్మ సంరక్షణకు ఉపయోగిస్తున్న వస్తువులు ఏమాత్రం సహాయపడటం లేదని భావిస్తున్నారా ? అయితే.. ఇప్పటికిప్పుడే.. మీరు ఉపయోగించే కెమికల్స్ తో కూడిన కాస్మొటిక్ ప్రాడక్ట్స్ కి స్వస్తి చెప్పాలి.

potato juice

హెర్బల్ అండ్ న్యాచురల్ రెమిడీస్ ని ఫాలో అయిపోవాలి. అదే.. బంగాళాదుంప జ్యూస్. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా ? నిజమే బంగాళదుంప జ్యూస్ మాస్క్ లు అద్భుత ఫలితాలను ఇస్తాయి. చర్మాన్ని రిపేర్ చేసి, ఉపశమనం కలిగించి, నూతనోత్తేజాన్ని ఇస్తుంది.

పచ్చి బంగాళాదుంపలో విటమిన్ ఏ, సి, బి ఉంటాయి. ఇవి చర్మాన్ని క్లెన్స్ చేస్తాయి. చర్మంలో పేరుకున్న మురికి తొలగించి, రంధ్రాలను సన్నగా మార్చి, చర్మానికి ఎనర్జీనిస్తాయి. దీనివల్ల చర్మం తక్షణమే గ్లోయింగ్ ని పొందుతుంది.

అలాగే పొటాటోలో హైక్యాల్షియం, ప్రొటీన్స్, ఐరన్ ఉంటాయి. ఇవి చర్మానికి ప్రొటెక్టివ్ లేయర్ లా పనిచేస్తాయి. డ్యామేజ్ అయిన స్కిన్ సెల్స్ ని రిపేర్ చేస్తాయి. కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడతాయి. దీనివల్ల చర్మం రెండురెట్లు గ్లోయింగ్ గా మారుతుంది.

మచ్చలు

మచ్చలు

బంగాళదుంప పొట్టు తీసి, జ్యూస్ తీయాలి. దీన్ని 15 నుంచి 20 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. కాటన్ బాల్ ముంచి.. చర్మంపై అప్లై చేయాలి. బాగా ఆరి చర్మం బిగుతుగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి. ఇది మీ చర్మానికి నిగారింపు అందించి, స్కిన్ టోన్ ని మెరుగుపరుస్తుంది.

కంటికింద నల్లటి వలయాలు

కంటికింద నల్లటి వలయాలు

1టేబుల్ స్పూన్ చల్లటి బంగాళదుంప రసం, 1టేబుల్ స్పూన్ దోసకాయ రసం కలపాలి. ఈ మిశ్రమంతో.. కళ్లకింద మసాజ్ చేయాలి. 20నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ రాత్రి అప్లై చేస్తే.. కళ్లకింద నల్లటి వలయాలు మాయమవుతాయి.

2రెట్లు గ్లోయింగ్ స్కిన్

2రెట్లు గ్లోయింగ్ స్కిన్

పాలు, బంగాళాదుంప కలిపి మిక్సీలో వేసి.. మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. 1టేబుల్ స్పూన్ ఈ మిశ్రమానికి, 1టీస్పూన్ తేనె, 5చుక్కల ఆల్మండ్ ఆయిల్, అవసరమైనంత రోజ్ వాటర్ కలపాలి. అన్నింటినీ మెత్తటి పేస్ట్ లా చేసుకుని.. ముఖానికి, మెడకు పట్టించాలి. బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ట్యాన్ తొలగించే మాస్క్

ట్యాన్ తొలగించే మాస్క్

1టేబుల్ స్పూన్ టమోటా జ్యూస్, అరటేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్, 5చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి.. బాగా పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ చాలా నీళ్లగా మారింటే.. కొద్దిగా శనగపిండి కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి.

యాంటీ ఏజింగ్ మాస్క్

యాంటీ ఏజింగ్ మాస్క్

అరకప్పు పొటాటో జ్యూస్, సమానంగా నీళ్లు కలపాలి. 5చుక్కల టీట్రీ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమంతో ప్రతిరోజూ చర్మాన్ని క్లెన్స్ చేసి, రెగ్యులర్ ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే.. చర్మం బ్రైట్ గా, యంగ్ గా కనిపిస్తుంది.

టోనర్

టోనర్

బంగాళాదుంపను సన్నగా తురిమి, 2టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి మిక్సీ పట్టాలి. బాగా పేస్ట్ లా తయారైన తర్వాత ముఖానికి, కళ్లకింద పట్టించాలి. 15నిమిషాల తర్వాత స్క్రబ్ చేసుకోవాలి. ఇలా 2నుంచి5 నిమిషాలు స్క్రబ్ చేసి.. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

డ్యామేజ్ స్కిన్

డ్యామేజ్ స్కిన్

చర్మాన్ని రిపేర్ చేయడానికి, హైడ్రేట్ చేయడానికి, చర్మం కాంప్లెక్షన్ పెంచడానికి ఈ ప్యాక్ ని వారానికి ఒకసారి అప్లై చేయాలి. ఒక గుడ్డులోని తెల్లసొన, 1టేబుల్ స్పూన్ చల్లటి పొటాటో జ్యూస్ కలపాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసి.. ముఖానికి, మెడకు పట్టించాలి. చర్మం బిగుతుగా మారిన తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Get 2 Times Brighter Skin Tone By Just Using Potato Juice, Try It!

Get 2 Times Brighter Skin Tone By Just Using Potato Juice, Try It. If you want to infuse life and shine back into your dull, dud and tired skin, you have to try these potato juice face masks.
Story first published: Monday, November 7, 2016, 12:08 [IST]
Desktop Bottom Promotion