Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
బ్లాక్ హెడ్స్ ని చిటికెలో మాయం చేసే ఫ్రూట్ స్క్రబ్స్
ఫ్రూట్ స్క్రబ్స్ చర్మ సమస్యల మీద పోరాటానికి సహాయపడతాయి. సమస్యాత్మకమైన మొటిమల నుంచి అసహ్యంగా ఉండే బ్లాక్ హెడ్స్ వరకు అన్ని సమస్యలను తగ్గించటానికి ఫ్రూట్ స్క్రబ్స్ సహాయపడతాయి.
మీరు చేయాల్సిన పని ఏమిటంటే పండ్ల గుజ్జు, విత్తనాలను చర్మం మీద రాయాలి. పండ్లలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు చర్మ సంరక్షణకు సహాయపడతాయి.
ఈ ఫ్రూట్ స్క్రబ్స్ ని ఉపయోగించటానికి ముందు ముఖాన్ని చల్లని పాలు లేదా రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ రెండు పదార్దాలలో శీతలీకరణ లక్షణాలు ఉండుట వలన చర్మానికి ఉపశమనం కలిగిస్తాయి. పండ్ల గుజ్జుతో ముఖం మీద మసాజ్ చేసినప్పుడు చర్మ రంద్రాలు నాని, తద్వారా బ్లాక్ హెడ్స్ తగ్గటానికి సహాయపడతాయి. కాబట్టి చర్మం మీద బ్లాక్ హెడ్స్ తొలగించటానికి 7 అద్భుతమైన పండు స్క్రబ్స్ ఉన్నాయి. వాటి మీద ఒక లుక్ వేయండి.

స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ముందుగా ముఖాన్ని చల్లని నీరు లేదా చల్లని పాలతో శుభ్రం చేసుకొని ఆ తర్వాత స్ట్రాబెర్రీ గుజ్జుతో మసాజ్ చేయాలి. స్ట్రాబెర్రీలో విత్తనాలు ఉండుట వలన చర్మ రంద్రాలను శుభ్రపరచి బ్లాక్ హెడ్స్ ని తొలగించటానికి సహాయపడుతుంది.

కివి
ఈ అందమైన ఆకుపచ్చని పండు చర్మానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కివి పండును సగానికి కోసి ప్రభావిత ప్రాంతంలో రుద్ది 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

అనాస పండు
అనాస పండు

ఆపిల్
ఆపిల్ చర్మ ఇన్ ఫెక్షన్స్ మరియు సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మం టోన్ అభివృద్ధి మరియు బ్లాక్ హెడ్స్ తొలగించుకోవటానికి సహాయపడుతుంది. ప్రభావిత ప్రాంతంలో ఆపిల్ గుజ్జుతో మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత చల్లని పాలతో కడగాలి.

పియర్
పియర్ లో చర్మాన్ని సంరక్షించే లక్షణాలు ఉన్నాయి. పియర్ ని కట్ చేసి ఒక చెంచా సాయంతో గుజ్జును బయటకు తీసి మెత్తని గుజ్జుగా చేయాలి. ఈ గుజ్జును ప్రభావిత ప్రాంతంలో రాసి వేళ్ళ సాయంతో మసాజ్ చేసి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి.

పుచ్చకాయ
వేసవి పండు అయిన పుచ్చకాయ చర్మ రంద్రాలను రిఫ్రెష్ చేయటానికి సహాయపడుతుంది. ఈ గుజ్జును ప్రభావిత ప్రాంతంలో రాసి మసాజ్ చేస్తే చర్మ రంద్రాలు శుభ్రం అయ్యి బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి.

టమోటా
బాగా పండిన టమోటాను తీసుకోని సగానికి కోసి గుజ్జును తీసుకోని ప్రభావిత ప్రాంతంలో రాసి మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే క్రమంగా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications
