పెదాలు నిండుగా....అందంగా..పింక్ కలర్లో కనబడుటకు హెర్బల్ హోం రెమెడీస్ ..!

By Lekhaka
Subscribe to Boldsky

మహిళలు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు . ముఖంలో కళ్ళు, పెదాలు అందంగా కనిపించాలని ఎన్నో మెరుగులు దిద్దుతారు, పెదాలు నిండుగా , లష్ గా , పింక్ కలర్ లో కనబడాలని కోరుకుంటారు.పురుషులను మీ అందంగా ఆకర్షించాలంటే, కళ్ళకు కాటుక లేదా హెయిర్ స్టైలింగ్ వంటి వాటిని పక్కన పెట్టి, పెదాల అందం మీదకాస్త శ్రద్ద పెట్టండి. పెదాలు అందంగా నిండుగా కనబడాలంటే కొన్ని హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి.

రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం , ఆవరేజ్ గా ఉన్న వారు , మహిళలను చూసిన 10 సెకెండ్స్ లో అట్రాక్టివ్ అవుతారు. అందులో 6 -7 సెకెండ్స్ ఆమె పెదాల మీద వారి చూపు ఉంటుంది, పెదాల ఆకారం , ఫుల్ నెస్, నేచురాలిటి, ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారని పరిశోధనల్లో గుర్తించారు.

Herbal Home Remedies For Fuller Lips

అందమైన...నిండైన...పింక్ కలర్ లో ఉండే పెదాలను కలిగి ఉండటం దేవుడిచ్చిన వరం. అలాంటి పెదాలకు మరికొంత అట్రాక్టివ్ గా కనిపించడానికి ఫేవరెట్ లిప్స్ పొందడానికి లిప్ కలర్స్ ను జోడిస్తే మరింత అందంగా కనబడుతాయి. అయితే ఇది తాత్కాలిక ప్రభావం మాత్రమే , కొద్ది సమయం తర్వాత, ఈ ఆర్టిఫిషియల్ లిప్ కలర్స్, లిప్ స్టిక్స్ తొలగిపోతాయి.

పెదాలను అందంగా, నేచురల్ గా , నిండుగా కనబడుటకు కొన్ని నేచురల్ ఆయుర్వేద పదార్థాలున్నాయి. ఇవి నేచురల్ గా పెదాల రంగును అందివ్వడం మాత్రమే కాదు, చాలా సులభంగా అందుబాటులో ఉండే, నాన్ టాక్సిక్ బ్యూటి పదార్థాలు, 90శాతం ఇవి మంచి ఫలితాలను సూచిస్తాయి.

పెప్పర్ మింట్ ఆయిల్ :

పెప్పర్ మింట్ ఆయిల్ :

ఆయిల్లో ఉండే మెంథోల్ చర్మంను క్రమబద్దం చేస్తుంది, పెదాల చర్మానికి అదనంగా నేచురల్ పింక్ కలర్ ను జెడిస్తుంది, సింపుల్ గా కొన్ని చుక్కల పెప్పర్ మింట్ ఆయిల్ ను పెదాలకు అప్లై చేసి సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. మసాజ్ చేసి, అరగంట అలాగే వదిలేయాలి. తర్వత క్లీన్ చేసి, సాప్ట్ గా ఉండే టవల్ తో తుడుచుకోవాలి. తర్వాత లిప్ బామ్ ను తరచూ అప్లై చేస్తుండాలి.

దాల్చిన చెక్క , పెట్రోలియం జెల్లీ:

దాల్చిన చెక్క , పెట్రోలియం జెల్లీ:

దాల్చిన చెక్క పెదాల మీద ఉన్న సెన్సిటివ్ స్కిన్ కు చీకాకు కలిగించవచ్చు, పెదాల వాపుకు, పెదాలరంగు మారడానికి కారణమవ్వొచ్చు.కొంత సమయం తర్వాత చీకాకు తొలగిపతుంది , పెదాలు అందంగా, నిండుగా కనబడుతాయి.

ముండుగాకొద్దిగా పెట్రోలియం జెల్లీని పెదాల మీద అప్లై చేయాలి. తర్వాత చిటికెడు దాల్చిన చెక్క పొడిని పెదాల మీద అప్లై చేసి15నిముషాలు అలాగే ఉండనిచ్చి, తర్వాత తడిగా ఉండే క్లాత్ తో తుడిచేయాలి

ఆలివ్ ఆయిల్ , షుగర్, పెప్పర్ :

ఆలివ్ ఆయిల్ , షుగర్, పెప్పర్ :

పెదాలు ఉబ్బుగా, నిండుగా కనబడేట్లుచేయడంలో పెదాలకు కావల్సిన రక్తంను సరఫరా చేయడంవల్ల ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి, పెదాలుఫుల్ గా రెడ్ గా కనబడేందుకు సహాయపడుతాయి.

ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను అరటీస్పూన్ పంచదార, చిటికెడు మిరియాల పొడిని మిక్స్ చేసి, టూత్ బ్రెష్ తో అద్ది పెదాల మీద మర్ధన చేయాలి. దీన్ని సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది, ఇలా 5నిముషాలు చేసిన తర్వాత నీళ్ళుతో కడిగేసి, తేమ ఆరిన తర్వాత లిప్ బామ్ ను అప్లై చేయాలి.

 రెడ్ పెప్పర్:

రెడ్ పెప్పర్:

రెడ్ పెప్పర్ పెదాలకు లైట్ గా మంట కలిగించవచ్చు , పెదాలకు బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరు్తుంది, పెదాలరు ఫుల్ గా, లష్ గా కనబడేలా చేస్తుంది.

కొన్ని చుక్కుల రెడ్ పెప్పర్ ఆయిల్ తీసుకుని, పెదాల మీద అప్లై చేయాలి. 5 నిముషాలు అలా ఉండనిచ్చి తర్వాత కడిగేసుకోవాలి.

తేనె:

తేనె:

మరో నేచురల్ హోం రెమెడీ తేనె. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి,ఇది పెదాల స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది, దాంతో లిప్ మాయిశ్చరైజింగ్ మెరుగుపరుస్తుంది, పెదాలు నిండుగా, నేచురల్ షైనింగ్ తో కనబడుతాయి. పెదాలకు తేనెను అప్లే చేస్తుండాలి, రాత్రుల్లో అప్లై చేసి, ఉదయం పెదాలను మీద బ్రష్ తో రద్ది కడిగేయడంతో పెదాలు ఎక్స్ ఫ్లోయేట్ అవుతాయి. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతుంది.

బీవాక్స్ , కర్పూరం ఆయిల్:

బీవాక్స్ , కర్పూరం ఆయిల్:

ఈ ఆయుర్వేదిక్ రెమెడీస్, పెదాలను నిండుగా కనబడేలా చేయడంతో పాటు , పెదాల మీద డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది,పెదాలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, పెదాలకు వాల్యూమ్ పెంచుతుంది.

ఒక టీస్పూన్ పెట్రోలియం జెల్లీ తీసుకుని, ఒక టీస్పూప్ బీవాక్స్, 5 చుక్కల కర్పూరం ఆయిల్ ను మిక్స్ చేయాలి. అన్ని పదార్థాలను బ్లెండ్ చేయాలి. పేస్ట్ లా తయారైన తర్వాత దీన్ని చిన్న డబ్బలో నిల్వ చేసుకోవాలి.దీన్ని రెగ్యులర్ లిప్ బామ్ గా ఉపయోగించుకోవాలి.

బాదం ఆయిల్ :

బాదం ఆయిల్ :

బాదం నూనెలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, ఇది మురికి, ఇతర డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి కొత్త చర్మ కణాలను ఏర్పడుటకు సహాయపడుతుంది. నేచురల్ లిప్ కలర్ ను అందిస్తుంది. ప్రతి రోజు రాత్రుల్లో కొన్ని చుక్కల బాదం ఆయిల్ ను పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. బాదం ఆయిల్లో ఉండే పోషక గుణాలు పెదాలకు అందుతాయి.

మెంథోల్ , దాల్చిన చెక్క, వీట్ జర్మ్ ఆయిల్ :

మెంథోల్ , దాల్చిన చెక్క, వీట్ జర్మ్ ఆయిల్ :

ఫ్లెవనాయిడ్స్ , నేచురల్ యాసిడ్స్ తో నిండి ఉంటుంది, ఇందులో బ్లీచింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి, ఈ హోం రెమెడీస్ పెదాల మీద పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది, పెదాలు నిండుగా కనబడేలా చేస్తుంది. ఒకటేబుల్ స్పూన్ పెట్రోలియం జెల్లీలో 5 చుక్కల మెంథోల్, 5 చుక్కల దాల్చిన చెక్క నూనె, 3 చుక్కల వీట్ జర్మ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. చేతి వేళ్ళతో ఈ మిశ్రమాన్ని తీసుకుని పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. కొన్ని గంటల్లోనే మంచి మార్పు వస్తుంది,

షీ బటర్:

షీ బటర్:

షీబటర్ లో నేచురల్ విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్, అధికంగా ఉంటాయి, ఇవి పెదాలకు పోషణను అందిస్తాయి, గాయాలను మాన్పుతుంది, బ్రోకెన్ స్కిన్ టిష్యులను రిపేర్ చేస్తుంది, ప్యూర్ షీ బటర్ ను పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి, రోజూ రాత్రి నిద్రించడానికి ముందు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రి రోజూ రాత్రుల్లో ఈ చిట్కాను అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

లవంగంనూనె:

లవంగంనూనె:

లవంగం నూనెచర్మానికి కొద్దిగా ఇరిటేషన్ కలిగించవచ్చు , దాంతో వాపు వల్ల పెదాలు ఉబ్బుగా తెలుస్తాయి. కొన్ని చుక్కల లవంగం నూనెలో ఒక టీస్పూన్ బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. కాటన్ బాల్ తీసుకుని, పెదాలకు మీద అప్లై చేసి, 5 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయాలి.

క్యారెట్ ఆయిల్, కోకోబట్టర్:

క్యారెట్ ఆయిల్, కోకోబట్టర్:

ఈ హోం రెమెడీ పెదాలను నిండుగా ఉంచుతుంది , ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది మరియు ఇది నేచురల్ ఎమోలియంట్, పగిలిన పెదాలను నయం చేస్తుంది, పెదాలకు మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది బ్రోకెన్ స్కిన్ టిష్యుల ను రిపేర్ చేస్తుంది. పెదాలు ఫుల్ గా కనబడేలా చేస్తుంది. ఒక టీస్పూన్ కోకబటర్ లో 10 చుక్కల క్యారెట్ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. దీన్ని రాత్రుల్ల అప్లై చేస్తే మంచి ఫలితంఉంటుంది.

టమోటో:

టమోటో:

టమోటోలో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, లైకోపిన్ కూడా అధికంగా ఉంటుంది, టమోటోలు పెదాలను ఫుల్ గా రెడ్ గా మార్చుతుంది. టమోటోను మెత్తగా పేస్ట్ చేసి, పెదాల మీద అప్లై చేసి , మసాజ్ చేయాలి, ఈ హోం రెమెడీని మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Herbal Home Remedies For Fuller Lips

    Herbal Home Remedies For Fuller Lips,There is something so sensuous about lips that are full, lush and pink. If you want to catch a man's attention, forget about fluttering your lashes, or twirling your hair, go straight to the pout. And if you don't have a perfect set of full, lush pout, these home remedies
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more