Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
వయస్సు పెరిగినా యంగ్ గా కనబడేలా చేసే యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ ...
ఏజింగ్ ప్రొసెస్ (వయస్సు పెరగడం)అనేది ఒక నేచురల్ ప్రొసెస్. అదే విధంగా కొన్ని సందర్భాల్లో ముఖంలోనే వయస్సు మీదపడుతున్న లక్షణాలు చాలా త్వరగా...చిన్న వయస్సులోనే కనడుతుంటాయి. అందుకు ముఖ్య కారణం ముఖం డల్ గా, ముడుతలతో కనబడుట ప్రారంభం అవుతుంది కళ్ళ క్రింది మరియు మూతి వద్ద సన్నని లైన్స్ కనబడుతుంటాయి.
కొన్ని సందర్భాల్లో డ్రై స్కిన్ వల్ల, ఎండలో ఎక్కువ తిరగడం, ఎక్కువ సమయం గడపడ వల్ల కూడా ఏజింగ్ లక్షణాలు కనబడుటకు కారణమవుతుంది. శరీరం హైడ్రేషన్ పొందలేనప్పుడు, శరీరం స్ట్రెస్ కు కారణం అవుతుంది. దాంతో డ్రై స్కిన్ ఏజింగ్ లక్షణాలు కనబడుట ప్రారంభం అవుతుంది.
చర్మంలోని నేచురల్ ఎలాసిటి తగ్గినప్పుడు వెంటనే ముఖం సాగినట్లు, మరియు ముడుతలతో కనబడుతుంది. ముడుతలతో పాటు, చర్మం నేచురల్ గ్లోను కూడా తగ్గించి చర్మం చూడటానికి డల్ గా కనబడుతుంది.

వయసు పైబడే కొద్ది ఇంకా చిన్నవారుగానే కనపడాలనే కొరిక పెరగటం, మార్కెట్ లో దొరికే వివిధ క్రీములు చర్మానికి రాసి సంరక్షించుకోడం జరుగుతుంది. అయితే వీటికంటే కూడా సహజంగా మీ చర్మాన్ని వయసు బారినుండి రక్షించే మార్గాలేమిటో చూద్దాం! వయసు పైబడటం అనేది పూర్తిగా నిలిపివేయలేము. కాని దానిని కొంతమేరకు సహజ పోషణతో తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు.
వయస్సు లక్షణాలు పైకి కనబడనివ్వకుండా ఉండటానికి ఒక హోం మేడ్ ఫేస్ మాస్క్ ఉంది. ఈ మాస్క్ తయారుచేయడానికి వాల్ నట్స్, పెరుగు మరియు బాదం ఆయిల్ అవసరం అవుతుంది .
వాల్ నట్స్ లో న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి . ఇది నేచురల్ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది మరియు చర్మంలోని మలినాలను, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

అదే విధంగా పెరుగు, బాదం నూనె చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. చర్మం సాఫ్ట్ గా మరియు కాంతివంతంగా మార్చుతుంది. ఈ మూడు పదార్థాలను ఒకటిగా కలిపి ఫేస్ మాస్క్ తయారుచేసుకోవడం వల్ల ఏజింగ్ లక్షణాలను బయటకు కనబడుకుండా చేస్తుంది.
ఈ యాంటీఏజింగ్ మాస్క్ ను వేసుకోవడానికి ముందు అందుకు అవసరమయ్యే పదార్థాలు, తయారు చేసే పద్దతి ? ఎలా వేసుకోవాలన్న విషయం తెలుసుకోవాలి.
కావల్సినపదార్థాలు:
వాల్ నట్స్ : 3-4
పెరుగు: 2tbsp
బాదం ఆయిల్: కొద్దిగా

తయారుచేయు విధానం:
వాల్ నట్స్ ను మెత్తగా పొడి చేసుకోవాలి.
అందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. అలాగే బాదం నూనె కూడా వేయాలి.
మూడు పదార్థాలను బాగా మిక్స్ చేస్తూ పేస్ట్ లా తయారుచేయాలి .
తర్వాత ఈ పేస్ట్ ను ముఖం మొత్తం అప్లై చేయాలి .
అరగంట అలాగే ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ ను రెండు వారాలకొకసారి వేసుకుంటే స్కిన్ స్టక్చర్ మెరుగుపరుస్తుంది.
ఈప్యాక్ వేసుకోవడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎలాంటి ఇరిటేషన్ లేకుంటే నేరుగా ముఖానికి అప్లై చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
