Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
వీకెండ్ స్పెషల్: ఇంట్లోనే తయారుచేసుకునే ట్యాన్ రిమూవల్ బ్లీచ్ లు..
సమ్మర్ వచ్చిందంటే.. ఎండ వేడికి చర్మం నల్లగా కమిలిపోతుంది. సన్ ట్యాన్ వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. ఇది సమ్మర్ లో ప్రతి ఒక్కరిలో కనిపించే సమస్య. ఈ సన్ ట్యాన్ తొలగించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించడం మామూలే. క్రీములు, ఫేస్ వాష్ లు, ఫేస్ ప్యాక్ లు.. మరికొందరు పార్లర్స్ కి వెళ్లి బ్లీచ్ చేయించుకుంటూ ఉంటారు.
అయితే పార్లర్ కి ప్రతి సారీ వెళ్లడం కుదరదు. అలాగని మార్కెట్ లో దొరికే బ్లీచ్ లు ఉపయోగించడం వల్ల కెమికల్స్ హాని చేస్తాయి. ఇవన్నీ ఖర్చుతో కూడిన పద్ధతులు. కాబట్టి.. ఇంట్లోనే.. న్యాచురల్ బ్లీచ్ లు తయారుచేసుకుంటే.. ట్యాన్ ఈజీగా తొలగిపోతుంది. ఇంట్లో తయారు చేసుకునే బ్లీచ్ లు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి కూడా.. మరి అవేంటి ? ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..

పెరుగు
బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి పెరుగు చాలా సహజసిద్ధంగా పనిచేస్తుంది. కాబట్టి పెరుగులో కాస్త పసుపు, పాలమీగడ కలిపి.. బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత శగనపిండితో.. స్క్రబ్ చేసుకుంటే.. సహజ మెరుపు సొంతం చేసుకోవచ్చు.

బ్రెడ్
బ్రెడ్ తో బ్లీచింగా అని ఆశ్చర్యపోతున్నారా ? నిజమే బ్రెడ్ ట్యాన్ తొలగించడంలో బాగా పనిచేస్తుంది. వైట్ బ్రెడ్ ని ముక్కలుగా కట్ చేసి.. నిమ్మరసం, పాలు కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో.. ట్యాన్ ఉన్న ప్రాంతంలో బాగా స్క్రబ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే.. ట్యాన్ తేలికగా తొలగిపోతుంది.

టొమాటొ
రెండు స్పూన్ల టొమాటొ రసానికి, అర స్పూన్ నిమ్మరసం, రెండు స్పూన్ల పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంతో.. ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత.. మళ్లీ అప్లై చేయాలి. మళ్లీ ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

కలబంద
కలబందలో న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది. కాబట్టి కలబంద గుజ్జు, టమోటా రసం సమానంగా తీసుకుని.. నానబెట్టి పేస్ట్ చేసి ఎర్రపప్పు మిశ్రమాన్ని కలపాలి. ఈ మూడింటిని కలిపిన పేస్ట్ తో.. ట్యాన్ ఉన్న దగ్గర మసాజ్ చేసి.. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే... ట్యాన్ దూరమవుతుంది.

ఓట్ మీల్
రెండు స్పూన్ల పెరుగు, స్పూన్ ఓట్ మీల్ వేసి బాగా కలపాలి. కాసేపు రెండు బాగా నానిన తరవ్ాత.. ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే.. ట్యాన్ దూరమవుతుంది.

బొప్పాయి
బొప్పాయి బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. బొప్పాయి, పైనాపిల్ ముక్కల్ని సమానంగా తీసుకుని మిక్సీ పట్టాలి. ఇందులో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ట్యాన్ తొలగిపోవడంతో పాటు.. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

ఆరంజ్
ఆరంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని చాలా మంచిది. రెండు ముక్కల ఆరంజ్ ముక్కల గుజ్జుకి, 2 స్పూన్ల పెరుగు కలిపి.. మిక్స్ చేయాలి. ఫేస్ కి అప్లై చేసి.. శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
