For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిడ్డు చ‌ర్మానికి ఇంట్లో సింపుల్‌గా త‌యారుచేసుకునే ఫేస్ వాష్

By Swathi
|

ఆయిలీ స్కిన్ నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తుంటారు. జిడ్డు చ‌ర్మాన్ని త‌గ్గించుకోవాల‌ని మార్కెట్ లో దొరికే క్రీమ్‌లు, మాయిశ్చ‌రైజ‌ర్లు, స్ర్క‌బ్, ఫేస్ వాష్‌లు ట్రై చేసే ఉంటారు. కానీ ఫ‌లితం అంద‌క‌పోగా.. వాటికి పెట్టిన ఖ‌ర్చంతా వృధా అయిపోయిందని ఫీల‌వుతున్నారా ?

READ MORE: పురుషుల్లో ఆయిల్ స్కిన్ నివారించే హోం మేడ్ ఫేస్ ప్యాక్స్

అయితే నో ప్రాబ్ల‌మ్స్. హోం మేడ్ ఫేస్ వాష్ మీరే స్వ‌యంగా త‌యారు చేసుకుంటే.. జిడ్డు వ‌దిలించుకోవ‌డం ఈజీనే అవుతుంది. ఈ ఫేస్ వాష్ చాలా న్యాచుర‌ల్‌గా ప‌నిచేస్తుంది. చ‌ర్మంపై ఆయిల్‌ని మిరాకిలిస్‌గా త‌గ్గిస్తుంది. అలాగే చ‌ర్మం పొడిబార‌కుండా కాపాడుతుంది. బ్యాక్టీరియా కార‌ణంగా వ‌చ్చే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, గుంత‌ల‌ను తొల‌గించి.. చ‌ర్మం కొత్త నిగారింపు సంత‌రించుకునేలా కాపాడుతుంది.

ఆయిలీ స్కిన్ ప్రాబ్ల‌మ్స్

ఆయిలీ స్కిన్ ప్రాబ్ల‌మ్స్

ఆయిలీ స్కిన్ కార‌ణంగా మొటిమ‌లు, యాక్నే, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, గుంత‌లు ఏర్ప‌డి చ‌ర్మం నిర్జీవంగా, అంద‌విహీనంగా క‌నిపిస్తుంది. ఇలాంటి చ‌ర్మత‌త్వం ఉన్న‌వాళ్లు కాస్త కేర్, అటెన్ష‌న్ అవ‌స‌రం. మార్కెట్‌లో దొరికే ఫేస్ వాష్‌ల‌లో కెమిక‌ల్స్, ఫ్రాగ్రెన్సేస్ ఉంటాయి. ఇవి చ‌ర్మానికి మ‌రింత హాని చేస్తాయి. కాబ‌ట్టి ఇంట్లోనే న్యాచుర‌ల్‌గా త‌యారు చేసుకునే ఫేస్ వాష్ ద్వారా ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ, క్లెన్సింగ్, న్యూట్ర‌లైజింగ్ గుణాలుంటాయి. ఇవి జిడ్డు చ‌ర్మానికి, మొటిమ‌ల‌ను తొల‌గించడంలో ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తాయి.

తేనె

తేనె

తేనె చ‌ర్మాన్ని స్మూత్‌గా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ గుణాలు.. మొటిమ‌లు, ఇన్ఫెక్ష‌న్‌ల‌కు కార‌ణ‌మ‌య్యే బ్యాక్టీరియాతో పోరాడ‌తాయి.

ప‌సుపు

ప‌సుపు

ప‌సుపులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ, యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు మెండుగా ఉంటాయి. అలాగే ర‌క‌ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో పోరాడే స‌త్తా ప‌సుపులో ఉంటుంది. అలాగే చ‌ర్మాన్ని కాంతివంతంగా మార్చ‌డంలోనూ ప‌సుపు ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తుంది.

ఫేస్ వాష్‌

ఫేస్ వాష్‌

చ‌ర్మాన్ని గోరువెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒక టీ స్పూన్ తేనె, చిటికెడు ప‌సుపు, అర టీ స్పూన్ బేకింగ్ సోడా అర‌చేతిలో వేసుకోవాలి. వీటన్నింటినీ రెండు చేతుల‌తో మొఖంపై బాగా రుద్దాలి. సర్కుల‌ర్ మోష‌న్ లో 2 నిమిషాల పాటు స్క్ర‌బ్ చేయాలి. ఎక్కువ ఆయిలీగా అనిపించే ప్రాంతంలో ఎక్కువ‌గా రుద్దుకోవాలి. త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే హోంమేడ్ ఫేస్ వాష్ అయిపోతుంది. చాలా సింపుల్ గా ఉన్న ఈ టిప్ ట్రై చేస్తారు క‌దూ.. !

English summary

Homemade Face Wash For Oily Skin

Homemade Face Wash For Oily Skin. Homemade face wash is gentle, safe and easy alternative to commercial facial cleanser for oily skin. This all natural homemade face wash reduces oiliness without drying the skin.
Story first published: Friday, January 29, 2016, 10:30 [IST]
Desktop Bottom Promotion