Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
జస్ట్ 7డేస్ లో 2ఇంచెస్ హెయిర్ గ్రోత్ కు హోం మేడ్ హెర్బల్ ఆయిల్ ..!
జుట్టు పెరుగుదల గురించి మనకు తెలియదు, ఎంత పెరుగుతుంది,ఎలా పెరుగుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. సహజంగా ప్రతి నెలా ఒక అంగుళం పొడవు పెరుగుతుంది. అయితే అదే జుట్టు ఒక వారంలో పెరిగితే జుట్టు పొడవులో ఎంత మార్పు వస్తుంది! ఆశ్చర్యం కలుగుంది కదా..!7డేస్ లో ఒక అంగుళం పొడవు జుట్టు పెరగడానికి ఒక ఎఫెక్టివ్ హోం మేడ్ ఆయిల్ ఉంది.
ఈ హోం మేడ్ ఆయిల్ ను తయారుచేయడానికి కావల్సిన ముఖ్యమైన వస్తువులు, హైబిస్కస్ ఫ్లవర్ (మందారం పువ్వులు), మందరాం ఆకులు, కొబ్బరి నూనె, కరివేపాకు, ఆవనూనె, ఆలివ్ ఆయిల్, ఆనియన్ జ్యూస్, ఇంకా ల్యావెండర్ ఆయిల్ .
7రోజుల్లో ఈ పదార్థాలెలా ఒక అంగుళం పొడవు హెయిర్ గ్రోత్ చేస్తాయని ఆశ్చర్యం కలగవచ్చు. కానీ సౌందర్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా మార్పు ఉంటుందని, చెబుతున్నారు . అయితే ఎలాగో తెలుసుకుందాం..

మందారపువ్వు ఆయుర్వేదిక్ ఆయిల్లో ఉపయోగించే మందారపువ్వులో విటమిన్ ఎ, సి, అమినోయాసిడ్స్, ఆల్పా హైడ్రాక్సైడ్ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు రాలకుండా హెయిర్ ఫోలిసెల్స్ కు జుట్టుకు బలాన్ని చేకూర్చుతుంది. మూసుకుపోయిన చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి, రక్తప్రసరనలను మెరుగుపరిచి జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది.
కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్, వివిధ రకాల విటమిన్స్ ఉన్నాయి. ఇవి సెబమ్ ఉత్పత్తి అండుకుని, తలకు తగిన పోషణను అందిస్తుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది.

ఈ హోం మేడ్ హెయిర్ ఆయిల్లో ఉపయోగించే కరివేపాకులో ప్రోటీన్స్, బీటా కెరోటీన్స్ అధికంగా ఉండటం వల్లఇది జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ఫోలిసెల్స్ ను ప్రోత్సహిస్తుంది .
హెర్బల్ రెమెడీలో ఉపయోగించే తర్వాత పదార్థం ఆవనూనె. ఆవనూనె జుట్టు రాలడం తగ్గిస్తుంది? ఆవనూనెలో యాంటీఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే మినిరల్స్, మరియు విటమిన్స మీ జుట్టును శుభ్రం చేస్తుంది.ఇది జుట్టుకు కండీషనర్ గా పనిచేసి, హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

ఇక ఉల్లిపాయరసం, ఇందులో సల్ఫర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల హెయిర్ కు కండీషనర్ గా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు కావల్సిన కెరోటిన్ అనే ప్రోటీన్ అందిస్తుంది. ఇది సల్ఫర్ తో కలిసినప్పుడు జుట్టు ఒత్తుంగా పెరడగానికి రక్షణ కల్పిస్తుంది, ప్రతి వెంట్రుక పెరగడానికి సహాయపడే ఫోలిసెల్స్ కు రక్షణగా ఉండి, జుట్టు పెరడగానికి సహాయపడుతుంది.
ల్యావెండర్ ఆయిల్ సువాసన మాత్రమే కాదు, ఈహోం మేడ్ హెర్బల్ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అందువల్ల ల్యావెండర్ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉన్నాయి . జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మరి జుట్టు రాలడం తగ్గించడానికి ఈ ఎఫెక్టివ్ హెయిర్ ఆయిల్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

కావల్సినవి:
మందారం పువ్వు: 1
మందారం ఆకులు: 3
కొబ్బరి నూనె : 1టేబుల్ స్పూన్

కరివేపాకు: కొద్దిగా
ఆవనూనె: 1టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్ : 1టేబుల్ స్పూన్
ఉల్లిపాయ రసం: 1టేబుల్ స్పూన్
ల్యావెండర్ ఆయిల్: 10 చుక్కలు
విటమిన్ ఇ క్యాప్స్యూల్ : 1

తయారుచేయు పద్దతి:
మందారం పువ్వులు మరియు ఆకులను మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను పేస్ట్ చేసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
కొబ్బరి నూనెను పాన్ లో వేసి తక్కువ మంట మీద వేడి చేసి, అందులో కరివేపాకు వేయాలి. కరివేపాకు నూనెలో కాగిన తర్వాత డార్క్ గా మారుతుంది. క్రిందికి దింపుకుని, ఈ నూనెను ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ రసం, ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, మరియు విటమిన్ ఇ జెల్ మిక్స్ చేయాలి.
మరో 5నిముషాలు సిమ్మర్లో వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో మందారం పేస్ట్ ను మిక్స్ చేయాలి. నూనె కలర్ మారడం ప్రారంభమైనప్పుడు స్టౌ ఆఫ్ చేయాలి.
ఈ నూనెను మరో బౌల్లోకి మార్చుకోవాలి. గది ఉష్గోగ్రతలో చల్లారనివ్వాలి. తర్వాత కాటన్ బాల్ తీసుకుని ఈ నూనెలో డిప్ చేసి, తలకు మరియు జుట్టు మొత్తానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. చేతి వేళ్ళతో 15 నిముషాలు మసాజ్ చేయాలి.
మసాజ్ చేసిన తర్వాత వేడినీటిలో డిప్ చేసిన టవల్ ను తలకు చుట్టి అరగంట అలాగే ఉండాలి. అరగంట తర్వాత షాంపుతో మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి.
ఈ హెర్బల్ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం మాత్రమే కాదు, జుట్టును సాఫ్ట్ గా మరియు సిల్కీగా మార్చుతుంది.



Click it and Unblock the Notifications