For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్ పొందడానికి హోం మేడ్ ఫేస్ వాష్

By Super
|

కొన్ని వేల సంవత్సరాల నుంచి మనందరికి రకరకాలుగా ఉపయోగపడుతోంది తేనె. తేనెలో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ఔషధగుణాలు మాత్రమే కాదు, సౌందర్యగుణాలు కూడా దాగున్నాయి. అందుకే తేనెను పురాత కాలం నుంచి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. చర్మ సౌందర్యం విషయంలో అనేక బ్యూటీ సెంటర్లలో తేనెను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తేనెను చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక అద్భుతమైన నేచురల్ రెమెడీ. చర్మంను ఆరోగ్యంగా, స్మూత్ గా మారుస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, స్కిన్ హెల్త్ కు దీన్ని ఉపయోగించడం మంచిది.

face wash

బ్యూటీ స్టోర్స్ లో ఉండే ఫేష్ వాష్ లను ఉపయోగించడం వల్ల వాటిలోని కెమికల్స్ చర్మంలోని నేచురల్ ఆయిల్స్ తగ్గిస్తాయి, చర్మాన్ని డ్రైగా మారుస్తాయి, మాయిశ్చరైజ్ తగ్గిస్తాయి. కాబట్టి, తేనెతో అద్భుతమైన హోం మేడ్ ఫేష్ వాష్ ను తయారుచేసి, ఉపయోగించవచ్చు.

తేనెతో ఫేష్ వాష్ తయారుచేసుకోవడానికి రెండు పదార్థాలు ముఖ్యంగా అవసరం అవుతాయి. కొబ్బరి నూనె, కాస్టిల్ సోప్. కొబ్బరి నూనె నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది చర్మానికి చాలా ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. కాస్టిల్ సోప్ ను వెజిటబుల్ ఆయిల్ తో తయారుచేస్తారు. ఇది మొటిమలు మచ్చలు, ఇతర స్కిన్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుదుంది. ఈ మూడింటి కాంబినేషన్ లో ఫేస్ వాష్ ఎలా తయారుచేయాలి, ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం...

homemade honey face wash

కావల్సినవి:
తేనె : 3 టీస్పూన్లు
1 టీస్పూన్ కొబ్బరి నూనె
1 టీస్పూన్ కాస్టిల్ సోప్ లిక్విడ్
10 మీకు నచ్చిన ఆయిల్

ఉపయోగించే పద్దతి:
పైన సూచించిన పదార్థాలన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి స్పూన్ తో బాగా బ్లెండ్ చేయాలి. ఈపేస్ట్ ను ఫేస్ ప్యాక్ గాను, నార్మల్ ఫేస్ క్లెన్సర్ గాను ఉపయోగించుకోవచ్చు. బాగా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. స్కిన్ డ్రైనెస్ ను నివారించుకోవడానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

honey face wash

ఈ హోం మేడ్ మాయిశ్చరైజర్ ను రోజుకు రెండు సార్లు ఉపయోగించి ఫేష్ వాష్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ బ్యూటీ టీట్రెంట్ ఉపయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఇతర స్కిన్ సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. స్కిన్ ఇరిటేషన్, దురద వంటి లక్షణాలు ఉంటే ఈ ఫ్యాష్ వాష్ చేసుకోకూడదు? ఈ ఫేస్ వాష్ వల్ల చర్మ కాంతి మెరుగుపడుతుంది. వైట్ హెడ్స్ నివారించబడతాయి.

English summary

Homemade Honey Face Wash For Smooth Skin

Homemade Honey Face Wash For Smooth Skin. Honey is jam-packed with unique properties that make it an ideal natural ingredient for getting a healthier and smoother skin.
Story first published: Thursday, June 2, 2016, 16:18 [IST]
Desktop Bottom Promotion