For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోం రెమెడీస్ తో ఫేస్ లో డార్క్ స్పాట్స్ కంప్లీట్ గా మాయం...

|

డార్క్ స్పాట్స్ తో విసిగిపోయారా? డార్క్ స్పాట్స్ అనేది చర్మ సమస్యలో చాలా సాధారణ సమస్య. డార్క్ స్పాట్స్ ముఖంలో చాలా ఇబ్బంది కరంగా ఉంటాయి. ముఖ్యంగా ఫేర్ గా ఉన్న అమ్మాయిల్లో డార్క్ స్పాట్ వల్ల ముఖం డల్ గా కనబడుట వల్ల అమ్మాయిలు తామూ అందంగా కనబడుమేమో అన్న బెంగ పెట్టుకొంటుంటారు. ఈ డార్క్ స్పాట్స్ నివారించడానికి కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ సింపుల్ రెమెడీస్ నేచురల్ గా డార్క్ స్పాట్స్ ను నివారిస్తాయి. ఈ డార్క్ ప్యాచ్ లు చర్మంలో కలిసిపోయాలే చేస్తాయి. దాంతో మునపటి చర్మ సౌందర్యాన్ని పొందుతారు.

డార్క్ స్పాట్స్ చర్మంలో మెలనిన్ ఉత్పత్తి అధికమవ్వడం వల్ల ఏర్పడుతాయి. ముఖ్యంగా సూర్య రశ్మి వల్ల, హార్మోనుల అసమతుల్యత, ప్రెగ్నెన్సీ, మెడికేషన్స్, విటమిన్స్ లోపం, నిద్రలేమి మరియు ఒత్తిడి, వాతావరణ కాలుష్యం వల్ల కూడా డార్క్ స్పాట్స్ ఏర్పడుతాయి. కాబట్టి వీటిని సరైన ట్రీట్మెంట్ తో సరైన క్రమంలో తొలగించుకోవాలి. డార్క్ స్పాట్స్ ను ఇంట్లోనే సులభంగా తొలగించుకోవచ్చు. డార్క్ స్పాట్స్ మరియు పిగ్మెంటేషన్ అన్నవి ముఖసౌందర్యంలో చాలా అసౌకర్యానికి, ఇబ్బంది కలిగించేవి . ఈ స్పాట్స్ ను నివారించుకోవడానికి ఒక ఉత్తమ మార్గం నేచురల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడమే.

ముఖం మీద బ్లాక్ హెడ్స్ కారణాలు: నివారణ చిట్కాలు

ఈ డార్క్ స్పాట్స్ మరియు ప్యాచెస్ చాలా అస్యహంగా కనబడుతూ... ఉన్నఅందాన్ని కాస్త పాడుచేస్తుంటాయి. వ్యక్తిగత సంతోషాన్ని దూరం చేస్తాయి . ఈ స్పాట్స్ అండ్ ప్యాచెస్ ను నివారించుకోవడానికి రసాయనిక ఉత్పత్తుల కంటే హోం రెమెడీస్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

అలోవెర ప్యాక్:

అలోవెర ప్యాక్:

చర్మ సమస్యలను నయం చేసే గుణాలు అలోవెరాలో గ్రేట్ గా ఉన్నాయి. డార్క్ స్పాట్స్ తగ్గించడంలో ఇది చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . అలోవెర జెల్ కు కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి, స్మూత్ గా చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగుప్యాక్:

పెరుగుప్యాక్:

చర్మంలోని డార్క్ స్పాట్స్ నివారించుకోవడానికి కర్డ్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది . ప్లెయిన్ గా ఉన్న గట్టి పెరుగును ముఖానికి నేరుగా అప్లై చేయొచ్చు లేదా అందులో కొద్దిగా ఎగ్ వైట్ ను మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఫేవ్ లెస్ స్కిన్ పొందడానికి నెలకొకసారి దీన్ని అప్లై చేయండి.

మెంతి ఆకులతో ప్యాక్:

మెంతి ఆకులతో ప్యాక్:

డార్క్ స్పాట్స్ నివారించడంలో మెంతిఆకులు గ్రేట్ గా సహాయపడుతాయి . మెంతి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకొని, అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బాగా ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

లెమన్ ప్యాక్:

లెమన్ ప్యాక్:

ఆరెంజ్, లెమన్, వంటి సిట్రస్ ఫ్రూట్స్ లో యాంటీఆక్సిడెంట్స్ , విటమిన్ సి వంటివి డార్క్ స్పాట్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతాయ. ఒక స్పూన్ తేనెలో అరస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాలు మరియు తేనె:

పాలు మరియు తేనె:

పాలు మరియు తేనె చర్మానికి పూర్తి పోషణను అందిస్తుంది. డార్క్ స్పాట్స్ ను కంప్లీట్ గా తొలగిస్తుంది. తేనె మరియు పాలు సమంగా తీసుకొని, బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్ది సేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

 ఉల్లిపాయ మరియు వెల్లుల్లి:

ఉల్లిపాయ మరియు వెల్లుల్లి:

వీటిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు స్కార్స్ , డార్క్ స్పాట్స్ ను మాయం చేస్తుంది. వెల్లుల్లితో మిక్స్ చేసినప్పుడు డార్క్ స్పాట్స్ ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది . ఉల్లి, వెల్లుల్లి సమయంగా తీసుకొని, పేస్ట్ చేసి ముఖానికి పట్టించి 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ కనబడుతుంది.

సాండిల్ వుడ్ ప్యాక్ :

సాండిల్ వుడ్ ప్యాక్ :

గంధంలోని బ్యూటీ రహస్యాలు మనకందరికి తెలిసిన విషయమే . చర్మ కాంతిని మెరుగుపరచడంలో గందంకు మొదటి స్థానం ఉంది . గందం పొడిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్ మిక్స్ చేసి , ముఖానికి పట్టించి, కొంతసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖంలో నేచురల్ గ్లోను అందిస్తుంది.

బాదం:

బాదం:

బాదంలో ఉండే విటమిన్ ఇ చర్మ సంరక్షణకు గ్రేట్ గా సహాయపడుతుంది. బాదంను రాత్రి నీళ్ళలో వేసి నానబెట్టి, తర్వాత పేస్ట్ చేసి ఉదయం ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డార్క్ స్పాట్స్ ను తగ్గించి, చర్మంను కాంతివంతంగా మార్చుతుంది.

ఓట్ మీల్ పౌడర్ :

ఓట్ మీల్ పౌడర్ :

ఓట్ మీల్ పౌడర్ ను స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ గా కన్సిడర్ చేస్తారు. కాబట్టి, ఓట్ మీల్ మాస్క్ ను మెడ, ముఖంకు అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ మరియు బ్లాక్ స్పాట్స్ తొలగిపోతాయి. రోస్టెట్ ఓట్స్ ను అరకప్పు తీసుకొని అందులో 4చెంచాలా నిమ్మరసం వేసి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి , డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పసుపు:

పసుపు:

మరో పాపులర్ స్కిన్ లైటనింగ్ ఏజెంట్ బ్లాక్స్ స్పాట్స్ ను నివారించడంలో గ్రేట్ గా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. సన్ స్పాట్స్, ఏజ్ స్పాట్స్ ను చాలా వేగంగా తొలగిస్తుంది.

English summary

Homemade Masks To Eliminate Dark Spots Completely

Homemade Masks To Eliminate Dark Spots Completely,Dark spots on the face is one of the most common skin problems that all of us face. Dark spots make the skin appear dull and, therefore, there is a need to treat them properly. Dark spots can be treated at home easily.
Story first published: Tuesday, February 2, 2016, 17:04 [IST]
Desktop Bottom Promotion