Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
నారింజ తొక్క ఫేస్ ప్యాక్స్ లో దాగున్న స్కిన్ సీక్రెట్స్..!
ఆరంజ్ జ్యూస్ నుంచి తొక్క వరకూ అంతా ఉపయోగకరమో. ఆరంజ్ పీల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని స్మూత్ గా, హెల్తీగా మార్చేస్తాయి.
బిజీ లైఫ్, ఒత్తిడి, చర్మం డ్రైగా మారడం, ఏసీల వల్ల చర్మం చాలా నిర్జీవంగా మారుతుంది. డ్రైగా, లైఫ్ లెస్ గా మారుతుంది. ఇలాంటప్పుడు చర్మానికి నూతనోత్తేజాన్ని అందించే మాస్క్ అప్లై చేసుకోవాలి. అందుకు అద్భుతమైన పదార్థం ఆరంజ్.

ఆరంజ్ ఆరోగ్యానికే కాదు.. అందానికి చాలా సూపర్ పవర్ ఫుల్ రెమిడీ. ఇందులో రిచ్ గా ఉండే విటమిన్ సి చర్మ సౌందర్యానికి పవర్ ఫుల్ గా ఉపయోగపడుతుంది. ఆరంజ్ జ్యూస్ నుంచి తొక్క వరకూ అంతా ఉపయోగకరమో. ఆరంజ్ పీల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని స్మూత్ గా, హెల్తీగా మార్చేస్తాయి.
ఆరంజ్ పీల్ అందానికి మంచిది అని చెప్పామని.. మార్కెట్ లో దొరికేది కాకుండా.. ఇంట్లోనే ఆరంజ్ తిన్న తర్వాత తొక్కలు పారేయకుండా.. హోంమేడ్ ఆరంజ్ పీల్ పౌడర్ తయారు చేసుకోండి. ఇలా ఇంట్లో తయారు చేసుకున్నఆరంజ్ పౌడర్ అయితే మెరుగైన ఫలితాలు చూడవచ్చు.

ఆల్మండ్ స్క్రబ్, ఆరంజ్ పీల్
ఆరంజ్ పీల్, ఆల్మండ్ స్క్రబ్ చర్మంలోని మలినాలను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. అలాగే ఫ్రెష్, రేడియంట్ లుక్ అందిస్తుంది. ఎండిన నారింజ తొక్కలు, 10 నుంచి 20 బాదాం గింజలను బ్లెండర్ లో వేసి పొడిచేయాలి. దీన్ని ప్రతిరోజూ పాలు కలిపి.. స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. ఇది క్లియర్ కాంప్లెక్షన్ ని ఇస్తుంది.

ఆరంజ్ పీల్, పెరుగు
ఆరంజ్ పీల్, పెరుగు రెండూ.. చర్మంలో ఫైన్ లైన్స్, ముడతలను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. కొద్దిగా ఆరంజ్ పీల్ పొడి తీసుకుని పెరుగు కలిపి ముఖానికి మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆరంజ్ పీల్, షుగర్ స్క్రబ్
ఆరంజ్ పీల్ ని కొద్దిగా తరుముకోవాలి. అందులో కొద్దిగా పంచదార కలపాలి. ఇందులో కొద్దిగా కొబ్బరినూనె, తేనె కలిపి.. ముఖానికి అప్లై చేసి.. స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే.. ఫ్రెష్ అండ్ క్లియర్ స్కిన్ మీ సొంతమవుతుంది.

ఆరంజ్ పీల్, పాలు
ఆరంజ్ పీల్, పాల మిశ్రమం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే పెద్ద పెద్ద చర్మ రంధ్రాలను సన్నగా మారుస్తుంది. 2 స్పూన్ల ఆరంజ్ పీల్ పౌడర్ లో, పాలు లేదా పాల మీగడ మిక్స్ చేయాలి. అలాగే కొబ్బరినూనె కొద్దిగా కలిపి.. ముఖానికి మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆరంజ్ పీల్, వేప ఆకులు
ఆరంజ్ పీల్, వేప ఆకులు మొటిమలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. సున్నితమైన, ఆయిలీ స్కిన్ పై ఈ ప్యాక్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కొద్దిగా ఆరంజ్ పీల్ పౌడర్ తీసుకుని, కొద్దిగా వేప పొడి కలపాలి. కొబ్బరినూనె మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయి.



Click it and Unblock the Notifications