Latest Updates
-
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా!
మొటిమ మచ్చలు తొలగించే తులసి, వేప ఫేస్ ప్యాక్..!
మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు నివారించడం చాలా కష్టం. సాధారణంగా మొటిమలు గిల్లకూడదు, ముట్టుకోకూడదని సలహా ఇస్తుంటారు. అలా చేయడం వల్ల.. మొటిమలు మచ్చలుగా ఏర్పడి.. ఏం చేసినా.. తగ్గిపోవు. అయితే.. తులసి, వేప ఆకులతో ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేయడం వల్ల మొటిమ మచ్చలు నివారించడం తేలికవుతుంది.
ప్రతి ఒక్కరికీ ఏదో ఒకసారి.. మొటిమలు వస్తుంటాయి. టీనేజ్ లో అయినా.. కనీసం మొటిమలు సమస్య ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ మొటిమలు నివారించుకుంటాం. కానీ.. వాటి తాలుకు మచ్చలు మాత్రం తగ్గిపోవు. నల్లగా కనిపించే ఈ మచ్చల వల్ల ముఖ సౌందర్యం చాలా దెబ్బతింటుంది.

అయితే ఈ మచ్చలు తేలికగా నయం చేసుకోవడానికి సింపుల్ హోంమేడ్ ఫేస్ ప్యాక్ ఉంది. అది కూడా.. అందరికీ అందుబాటులో ఉండే.. పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. చాలామంది ఇలాంటి రెమిడీస్ ప్రయత్నించకుండా.. కన్సీలర్ తో కవర్ చేసుకుంటుంటారు. కానీ.. ఇలా మేకప్ తో కవర్ చేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు.

కావాల్సిన పదార్థాలు
3 తులసి ఆకులు
2 పుదీనా ఆకులు
2 వేప ఆకులు
1 నిమ్మకాయ
1 టీ స్పూన్ పసుపు
తయారు చేసే విధానం, అప్లై చేసే పద్ధతి
ముందుగా నిమ్మకాయ నుంచి రసం తీయాలి. ఆకులన్నీ మిక్సీలో గ్రైండ్ చేయాలి. పేస్ట్ తయారు చేసుకోవాలి. అందులో పసుపు, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ ఉపయోగించి.. ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత ఫేస్ ప్యాక్ మొత్తం డ్రైగా మారిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
తులసి, వేపలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. డార్క్ స్పాట్స్, స్కిన్ డ్యామేజ్ ని తొలగించవచ్చు. పుదీనా ఆకులు చల్లటి అనుభూతిని ఇస్తాయి. రెడ్ నెస్ ని తొలగిస్తాయి. నిమ్మరసం న్యాచురల్ బ్లీచింగ్ లా పనిచేస్తుంది. మచ్చలు నివారిస్తుంది.

పసుపులో యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల ఇన్ల్ఫమేషన్ ని తగ్గించి.. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. పసుపు చర్మానికి న్యాచురల్ గా మెరుపుని అందిస్తుంది. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తే.. చర్మంపై మచ్చలు తొలగిపోవబమే కాదు.. చర్మం నిగారిస్తుంది.



Click it and Unblock the Notifications