For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాఫీ పౌడర్ తో కళ్ల కింద క్యారీ బ్యాగులకు చెక్

By Swathi
|

కాఫీ ఘుమఘుమలు తగలగానే.. వెంటనే కాఫీ తాగాలన్న ఫీలింగ్ కలుగుతుంది. నిద్ర వచ్చినట్టు ఉన్నా.. అలసటగా ఉన్నా.. తలనొప్పిగా ఉన్నా.. ముందు ప్రిఫర్ చేసేది కాఫీనే. మరి తాగడానికి ఉపయోగపడే కాఫీ.. కళ్ల కింద క్యారీ బ్యాగులు ఎలా తొలగిస్తుందని ఆశ్చర్యపోతున్నారా ? అవును ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ టిప్ ట్రై చేస్తే.. మీరే షాక్ అవుతారు.

ఒక కప్పు కాఫీతో ఆరోగ్యానికి ఆశ్చర్యం కలిగే లాభాలు

కళ్లకింద నల్లటి వలయాలు.. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్స్. ఎక్కువమందిని ఈ సమస్య వెంటాడుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం.. చర్మంలో ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గిపోవడం. ఒకవేళ మీరు ఈ సమస్యను ఫేస్ చేస్తుంటే.. ఇక్కడ సింపుల్ టిప్ ఉంది. ఇది ఫాలో అయి చూడండి. కళ్ల కింద నల్లటి వలయాలు తొలగించడానికి కాఫీ పౌడర్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

How Coffee Eliminates Dark Circles Under The Eyes

కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే కెఫీన్ చర్మాన్ని స్మూత్ గా మార్చేస్తుంది. ఇది కంటి చుట్టూ ఉండే బ్లడ్ వెజెల్స్ కుంచించుకుపోయేలా చేసి డార్క్ సర్కిల్స్ ని తగ్గిస్తాయి. ఎప్పుడైతే కాఫీ పొడి అప్లై చేస్తామో.. అప్పుడు నలుపుదనం పూర్తీగా తగ్గిపోతుంది.

రెగ్యులర్ గా కాఫీ తాగడం ఆరోగ్యమా ? అనారోగ్యమా ?

ఈ కాఫీని కళ్లకింద వలయాలకు అప్లై చేయాలంటే.. కాఫీపొడితో పాటు, కొబ్బరినూనె ఉపయోగిస్తే చాలు. మీ చర్మ తత్వం ఎలాంటిదైనా పర్వాలేదు.. ఇది చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఒక కప్ లో కొద్దిగా కాఫీ పౌడర్ తీసుకోవాలి. అందులో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్లకింద నల్లటి వలయాలపై జాగ్రత్తగా రాసుకోవాలి.

How Coffee Eliminates Dark Circles Under The Eyes

ఈ టిప్ ఫాలో అయ్యేటప్పుడు కాఫీ పేస్ట్ ని చేతి వేళ్లతో అప్లై చేయాలి. కళ్లలోకి ఏమాత్రం పడకుండా కేర్ ఫుల్ గా రాసుకోవాలి. ఇది అప్లై చేశాక 10 నిమిషాలు అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత దీన్ని తొలగించడానికి తడి గుడ్డ ఉపయోగించాలి. లేదా టిష్యూ అయినా వాడవచ్చు. దీన్ని తొలగించిన తర్వాత.. ఏదైనా లోషన్ రాసుకోవాలి. ఈ చిట్కాను వారానికి మూడు, నాలుగు సార్లు ఫాలో అయితే.. మీ కళ్లకింద క్యారీ బ్యాగులు మాయమవుతాయి. కాఫీ పొడి గ్రేట్ మాయిశ్చరైజర్ లా చర్మానికి పనిచేస్తుంది.

English summary

How Coffee Eliminates Dark Circles Under The Eyes

If you are suffering from dark shadows under your eyes, there is now a substance that can get rid of this skin problem. Find out how coffee will eliminate the appearance of puffy eyes by reading this article now.
Story first published: Tuesday, January 12, 2016, 15:40 [IST]
Desktop Bottom Promotion