Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మోచేతులు మిళమిళా మెరిసిపోవాలంటే.. ?
చేతులంతా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. మోతులు చూస్తే నల్లగా ఇబ్బందికరంగా ఉంటాయి. వాటిని దాచుకోవడానికి ప్రతిసారీ పొడవు చేతుల డ్రెస్ లు వేసుకోలేం. మరి ఏం చేయాలి. ఎంత ప్రయత్నించినా.. ఎన్ని చిట్కాలు ఫాలో అయినా.. మోచేతుల నలుపు మాత్రం తగ్గడం లేదని చాలా మంది డీలా పడుతుంటారు. అయితే మీకు ఈజీగా, ఎఫెక్టివ్ గా రిజల్ట్స్ తీసుకొచ్చే అద్భుతమైన ట్రీట్మెంట్స్ మీ వంటింట్లో దాగున్నాయి.
కానీ ఒకసారి రెండు సార్లు ప్రయత్నిస్తే తగ్గదు. అలాగని.. ఎప్పుడో ఒకసారి ప్రయత్నించినా ఫలితం ఉండదు. కాబట్టి.. రెగ్యులర్ గా.. ఇక్కడ చెబుతున్న సింపుల్ టిప్స్ ట్రై చేయండి.. మీ మోచేతులు.. మిళమిళా మెరిపించుకోండి.

తేనె, చందనం
గంధం పొడి, తేనె మిశ్రమాన్ని కలిపి.. రెండు వారాలకు ఒకసారైనా మోచేతులకు అప్లై చేయండి. ఖచ్చితంగా ఈ ప్యాక్ మీ మోచేతులపై డెడ్ సెల్స్ తొలగించి.. హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.
పెరుగు, శనగపిండి
శనగపిండి, పెరుగు కలిపి.. మోచేతులకు రాసుకుని అరగంటపాటు ఆరనివ్వాలి. కొన్ని రోజుల్లోనే తేడా మీకు కనిపిస్తుంది. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం హెల్తీగా, మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది.

దోసకాయ, పపాయ
ఈ ప్యాక్ చాలా వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ రెండింటిని సమానంగా తీసుకుని పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని వారానికి ఒకసారి వీలైతే.. రెండుసార్లు అప్లై చేయాలి. త్వరలోనే మీ మోచేతులు తెల్లగా మిళమిళా మెరిసిపోతాయి.



Click it and Unblock the Notifications