For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమ‌లు నివారించ‌డంలో హెర్బ‌ల్ టీ చ‌క్క‌టి ప‌రిష్కారం..!!

By Swathi
|

మూడు నెలల పాటు రోజుకి రెండు కప్పుల టీ తాగితే మొటిమలు రాకుండా 31 శాతం నివారించొచ్చు అంటోంది ఓ అధ్య‌య‌నం. హెర్బ‌ల్ టీ త‌ప్ప‌కుండా తాగ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మొటిమ‌ల‌కు కార‌ణ‌మ‌య్యే అనే క్రిముల‌ను నివారించ‌డంలో ఎఫెక్టివ్ ప‌రిష్కారం అంటున్నాయి అధ్య‌య‌నాలు.

యుక్త వయసులోనే కాదు కాస్త పెద్దయ్యాక కూడా ఎంతోమందిని మొటిమలు ఇబ్బందిపెడతాయి. అదీ ఆడవాళ్లలో అయితే 50 శాతం మంది వాళ్ల జీవితంలో ఒక్కసారైనా మొటిమల బారిన పడక తప్పదు అంటోంది ఆ స్టడీ. అలా చూసుకుంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ మొటిమల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తారన్నమాటే కదా. కాబ‌ట్టి మొటిమ‌లు నివారించ‌డంలో హెర్బ‌ల్ టీ ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో ఇప్పుడు చూద్దాం..

హెర్బ‌ల్ టీ

హెర్బ‌ల్ టీ

హెర్బల్‌ టీ తాగితే చర్మానికి, శిరోజాలకి మేలనే విషయం తెలిసిందే. అందులో కూడా స్పియర్‌మింట్‌ టీ అయితే మరీ మంచిది. దీన్ని తాగితే మొండి మొటిమల నుంచి బయటపడొచ్చనేది స్టడీ సారాంశం.

మొటిమ‌ల వ‌ల్ల ఏర్ప‌డిన గాయాలు

మొటిమ‌ల వ‌ల్ల ఏర్ప‌డిన గాయాలు

రెండు కప్పుల ఆర్గానిక్‌ స్పియర్‌మింట్‌ టీని నెలరోజులు సేవిస్తే 25 శాతం మొటిమల వల్ల గాయాలు కాకుండా నివారించొచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

రోజుకి 3 నుంచి 4 క‌ప్పుల గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల యాక్నెనీకి కార‌ణ‌మ‌య్యే హార్మోన్స్‌ని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంద‌ని.. స్ట‌డీస్ చెబుతున్నాయి.

యాంటీ-ఇన్‌ఫ్లెమేటరీ గుణాలు

యాంటీ-ఇన్‌ఫ్లెమేటరీ గుణాలు

స్పియర్‌మింట్‌లో యాంటీ-ఇన్‌ఫ్లెమేటరీ గుణాలు ఉంటాయి. దానివల్ల చర్మం శుభ్రపడుతుందని స్ట‌డీస్ చెబుతున్నాయి.

జిడ్డు తగ్గుతుంది

జిడ్డు తగ్గుతుంది

స్పియర్‌మింట్‌ టీ తాగడం వల్ల హార్మోన్ల మీద ప్రభావం పడుతుంది. దానివల్ల చర్మంపైన ఉండే గ్రంధులనుంచి నూనె ఉత్పత్తి తగ్గుతుంది. అలా జిడ్డు తగ్గి మొటిమలు రావడం తగ్గిపోతుంది.

క్లెన్సర్‌, టోనర్‌

క్లెన్సర్‌, టోనర్‌

టీ, పళ్లరసాల వంటివి తాగడం వల్ల ఒరిగే లాభం కొంతమేరకే. అందుకని క్రమం తప్పకుండా మంచి క్లెన్సర్‌, టోనర్‌ వాడాలి. ఇలాచేస్తే మొటిమలు రాకుండా నివారించవచ్చు.

బ్యాక్టీరియా

బ్యాక్టీరియా

మొటిమ‌ల‌కు కార‌ణ‌మ‌య్యే బ్యాక్టీరియాను గ్రీన్ టీ నివారిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు ఉండ‌టం వ‌ల్ల ఇది యాక్నెకి కార‌ణ‌మ‌య్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

English summary

How Herbal Tea Helps To Reduce Acne

How Herbal Tea Helps To Reduce Acne. There are plenty of commercial acne products available, but they’re expensive and they cause unwanted side effects.
Story first published:Saturday, July 30, 2016, 9:39 [IST]
Desktop Bottom Promotion