Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
పరీక్షల సమయంలో అందంగా ముస్తాబవ్వడం ఎలా..
పిల్లలకు పరీక్షలంటనే భయం, ఎప్పుడు చూసినా బుక్స్!నోట్స్! పెన్స్! పెన్సిల్స్! తల మీద పెద్ద బారం అదే ఎక్సామ్! పరీక్షల సమయంలో వీటన్నిటి తర్వాతే ఫిజిలకల్ అప్పీయరెన్స్ మీద మనస్సు పోతుంది.
పరీక్షల సమయంలో, ఎక్సామ్స్ పూర్తి అయ్యే వరకూ ఒత్తిడి, ఆందోళతో ఉంటారు . వ్యక్తిగత అలంకరణ మీద అంతగా మనస్సు పోద సరికదా, అందంగా ముస్తబవ్వడానికి కూడా సమయం ఉండనంత బిజీగా గడుపుతుంటారు.
కానీ, మరి పరీక్షల కాలంలో మీరు వికారంగా కనిపిస్తే ఎలా? ముఖ్యంగా పరీక్షల కాలంలో ఎక్కువగా నిద్రమేల్కోవడం, ఒత్తిడి, సరిగా ఆహారపానీయాలు తీసుకోకపోవడం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు , అలసటతో కలిగిన మొహం, జిడ్డు చర్మంతో కనబడుతుంటారు . కాబట్టి, సాధారణంగా లాగే ఎక్సామ్స్ సమయంలో కూడా అందంగా, ఆకర్షణీయంగా కనబడాలంటే కొన్ని సులభ చిట్కాలున్నాయి.
మరి పరీక్షల సమయంలో అందంగా ఎలా కనిపించాలి? అందంగా కనిపించడం కోసం ప్రీమర్, ఫౌండేషన్, కోల్ లేదా లిప్ స్టిక్ ఉపయోగించాల్సి అవసరం లేదు
వీటన్నింటి అలంకరించుకోవడం కోసం మీకు సమయం ఉండదు . అదే సమయాన్ని మేకప్ కోసం వ్రుదా చేయకుండా మీరు ఖచ్చితంగా చదువుకోసం కేటాయిస్తుంటారు .
అయితే, మీకు తెలుసా ఎలాంటి హంగూ, ఆర్బాటాలు, మేకప్ లు లేకుండానే అందంగా కనబడవచ్చన్న విషయం మీకు తెలుసా?పరీక్షల సమయంలో కూడా అందంగా కనబడుటకు కొన్ని బ్యూటిఫుల్ టిప్స్ ఉన్నాయి . వీటిని అనుసరిస్తే చాలు మీ మేక్ ప్రొడక్ట్స్ గుడ్ బై చెప్పేసి, రిఫ్రెష్ గా కనబడుతారు.
మరి పరీక్షల సమయంలో అందంగా కనబడుటకు కొన్ని బ్యూటిఫుల్ టిప్స్ ను ఇక్క డ అందివ్వడం జరిగింది . అందుకుమీరు టైమ్ వేస్ట్ చేయాల్సిన పనిలేదు . ఎప్పుడూ అందగా కనబడేలా చేస్తాయి .
ఈ చిట్కాలను ఉపయోగించడం వల్ల ఒత్తిడిలో ఉన్న సమయంలో కొద్దిగా ఉపశమనంగా అనుభూతిని కలిగి ఉంటారు. మనస్సు తేలికపడుతుంది . దాంతో పరీక్షలకు కూడా బెటర్ గా తయారవ్వడానికి సహాయపడుతుంది . మరి మీరు ఎలాంటి స్ట్రెస్, ఆందోళన లేకుండా అందంగా పరీక్షలకు తయారై పోవండి

ఫేస్ స్క్రబ్:
మీరు దీర్ఘకాలం నుండి చదువుతున్నట్లైతే , మద్యలో లేచి మైల్డ్ స్ర్కబ్బర్ తో ఎక్స్ ఫ్లోయేట్ చేయాలి . ఇలా చేయడం వల్ల మీరు కొద్దిగా రిలాక్స్ అవుతారు . అంతే కాదు ఈ రిఫ్రెష్ నెస్ వల్ల మీరు చదిన దాన్ని బాగా గుర్తించుకుంటారు . ఎక్స్ ఫ్లోయేట్ చేయడానికి టైమ్ వేస్ట్ చేయడానికి లేదు స్నానం చేసేప్పుడు చేసుకుంటే చాలు. పరీక్షా సమయంలో కూడా అందంగా కనబడుతారు.

స్నానం చేయాలి:
చాలా మంది స్టూడెంట్స్ పరీక్షల సమయంలో స్నానం చేయకుండావుంటారు . ఇటువంటి విలువలైన సమయంలో టైవేస్ట్ అని అనుకుంటారు. మరి చివరకు ఏం జరుగుతుంది?చర్మం జిడ్డుగా మారుతుంది, స్టిక్కిగా ఉంటుంది. తలకుషాంపు పెట్టి స్నానం చేయడం వల్ల రిఫ్రెష్ గా కనబడుతారు.

బాడీని హైడ్రేషన్ లో ఉంచుకోవాలి:
కొన్ని గంట కొద్ది చదివేటప్పుడు , నీరు త్రాగడం మర్చిపోతారు , ఇది డార్క్ సర్కిల్స్ కు కారణం అవుతుంది . ముఖంలో మచ్చలు, మొటిమలు కనబడుతాయి . కాబట్టి, ఎక్కువగా నీరు త్రాగుతూ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ అవుట్ చేయాలి.దాంతో మీ చర్మం ఫ్రెష్ గా కనబడుతుంది చర్మంలో ఎలాంటి మచ్చలు ఉండవు.

తగినంత విశ్రాంతి తీసుకోవాలి:
పరీక్షా సమయంలో అందంగా కనబడుట ఎలా?ఏకాగ్రతత ఎక్కువ గంటలు చదవుతూ ఉండిపోవడం వల్ల ఎనర్జీలెవల్స్ తగ్గిపోతాయి . దాంతో మీరు ఎక్కువ అలసటకు గురైనట్లు కనబడుతారు దాంతో డల్ గా కనబడుతారు . పరీక్షల సమయంలో కూడా మీరు కనీసం 5 నుండి 6 గంటల సమయం నిద్రపోయినట్లైతే , మరింత ఎనర్జీని పొందిన అనుభం కలుగుతుంది మరియు ఏకాగ్రత పెరగుతుంది.

విశ్రాంతి తీసుకోవాలి:
చెప్పడం సులభమే కానీ చేయడమే కష్టం. ముఖ్యంగా పరీక్షల సమయంలో అధిక అద్యాయాలు చదవాల్సి వచ్చినప్పుడు మరితకష్టంగా ఉంటుంది. అయితే, అటువంటి సమయంలో బ్రీగింగ్ వ్యాయామాలు చేయడం మంచిది . ఏదైనా ఓపెన్ ప్లేస్ లో కూర్చొని, గాలి లోతుగా పీల్చీ, బయటకు వదులుతుండాలి . ముఖంలో టెన్షన్ తగ్గి, ముఖ అందం రెట్టింపు అవుతుంది

కేశ అలంకరణకోసం :
మీకేశాలు నిరంతరం , మీ స్టడీస్ కు అంతరాయం కలిగిస్తుండవచ్చు , లేదా ఎక్సామ్ హాల్లో పేపర్ మీద పడవచ్చు , కాబట్టి కేశాలను పోనీటైల్ రూపంలో టైట్ గా వేసుకోవాలి ఇది మీకు అందమైన లుక్ ను ఇస్తుంది.ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని టైట్ గా టై చేయాలి. ఇలా చేయడం వల్ల పరీక్షల సమయంలో అందంగా కనబడుతారు

శుభ్రమైన దుస్తులు ధరించాలి:
మీరు పరీక్షలకు హాజరవుతారు , ఏ ఇతర రోడ్ క్లీనింగ్ కోసమో వెల్లటం లేదు . కాబట్టి, నీట్ గా మరియు క్లీన్ గా ఉండే దుస్తులను ధరించడం మంచిది . ఫ్యాబ్రిక్ సౌకర్యవంతంగా ఉండాలి . దాంతో చెమటలు ఎక్కువగా పట్టకుండా , అసౌకర్యం కలిగించకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications











