For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశవంతమైన చర్మానికి పిప్పరమెంటు స్క్రబ్

స్క్రబ్ చర్మాన్ని మృదువుగా,కాంతివంతంగా చేస్తుంది. ఇంటిలో తయారుచేసుకున్న స్క్రబ్ చర్మానికి కొత్త కాంతిని ఇస్తుంది. స్క్రబ్ తయారుచేయడానికి ఏది ఉత్తమంగా ఉంటుందో దానితో తయారుచేసుకోవచ్చు.అది షాప్స్ లో

By Lekhaka
|

బాడీ స్క్రబ్స్ తయారుచేయటం మరియు ఉపయోగించటం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. . కాబట్టి శరీర చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి పిప్పరమెంటు స్క్రబ్ తయారి గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ స్క్రబ్ ని తయారుచేయడానికి ప్రక్రియ మరియు జాబితా ఉన్నాయి.

బాడీ స్క్రబ్ లను షాప్స్ లో కొంటే కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటాయి. అదే ఇంటిలో తయారుచేసుకుంటే ఖర్చు తగ్గటమే కాకుండా మంచిగా కూడా ఉంటాయి.

How To Make A Brightening Peppermint Body Scrub

స్క్రబ్ పరిపూర్ణంగా ఉందా లేదా అనేది చాలా మంది గుర్తించరు. చర్మం పొడిగా మారకుండా ఉండటానికి ఆయిలీ స్క్రబ్ అవసరం. చాలా బ్రాండ్ స్క్రబ్స్ లో ఆయిల్ బేస్ ఉండదు.

స్క్రబ్ చర్మాన్ని మృదువుగా,కాంతివంతంగా చేస్తుంది. ఇంటిలో తయారుచేసుకున్న స్క్రబ్ చర్మానికి కొత్త కాంతిని ఇస్తుంది. స్క్రబ్ తయారుచేయడానికి ఏది ఉత్తమంగా ఉంటుందో దానితో తయారుచేసుకోవచ్చు.

అది షాప్స్ లో కొన్న స్క్రబ్ లకు సాధ్యం అవుతుందా ? అయితే అది సాధ్యం అవుతుందని మేము భావించటం లేదు. కాబట్టి కాంతివంతమైన పిప్పరమెంట్ స్క్రబ్ ని ఇంటిలో సులభంగా తయారుచేసుకోవచ్చు.

సముద్రపు ఉప్పు

సముద్రపు ఉప్పు

సముద్రపు ఉప్పు అనేది బాడీ స్క్రబ్ లలో ఉపయోగించటానికి ఉత్తమమైన పదార్ధాలలో ఒకటి. ఈ పదార్ధానికి ఉన్న కరుకు నిర్మాణం చర్మం మీద ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. శరీరం మీద ఉపయోగించటానికి చాలా బాగుంటుంది. కానీ ముఖం మీద కఠినముగా ఉంటుంది. కాబట్టి ముఖానికి ఉపయోగించకూడదు.

 బాదం నూనె

బాదం నూనె

బాదం నూనె స్క్రబ్ తయారీలో బేస్ నూనెగా ఉంటుంది. బాదం నూనెలో విటమిన్ E ఉండుట వలన చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది.

నిమ్మకాయ:

నిమ్మకాయ:

నిమ్మకాయ నుండి రసాన్ని పిండి ఉపయోగించాలి. నిమ్మకాయ ఒక సహజ బ్లీచింగ్ ఏజెంట్ మరియు చాలా కఠినమైన చర్మ టోన్ ను ప్రకాశవంతం చేయటంలో సహాయపడుతుంది.

పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్

పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్

కొన్ని చుక్కల పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ ని జోడించాలి. ఈ స్క్రబ్ మీ చర్మంపై ఒక చల్లని ప్రభావాన్ని కలిగిస్తుంది. అలాగే రిఫ్రెష్ సువాసనను కూడా అందిస్తుంది. మీరు ఒక విలాసవంతమైన స్క్రబ్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టవలసిన లేదు.

జార్

జార్

ఒక కూజా లేదా ఒక కంటైనర్ లో పైన చెప్పుకున్న పదార్ధాలను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తీసుకోని శరీరం మొత్తం రుద్దాలి. చర్మం మీద మృత కణాలు అన్ని తొలగిపోయి చర్మం మృదువుగా మరియు సున్నితంగా మారుతుంది.

షవర్

షవర్

ఆ తర్వాత స్క్రబ్ ని శుభ్రం చేయటానికి షవర్ ని ఉపయోగించండి.

తేమ

తేమ

స్క్రబ్ లో తేమ పదార్ధం బాదాం నూనె ఉన్నప్పటికీ, చర్మానికి కోమలత్వం. కాంతివంతం మరియు మృదుత్వం ఉండాలంటే షవర్ తర్వాత చర్మాన్ని తేమగా ఉంచుకోవాలసిన అవసరం ఉంది.

English summary

How To Make A Brightening Peppermint Body Scrub

Body scrubs are incredibly fun to make and to use. So, let's try to make a peppermint scrub that would brighten your body skin. Listed here is the procedure on how to make a brightening body scrub with peppermint.
Story first published: Monday, December 5, 2016, 18:20 [IST]
Desktop Bottom Promotion