ముఖానికి గోల్డెన్ గ్లో అందించే గోల్డెన్ ఫ్రూట్ మామిడి పండ్లు..

మామిడి పండు నోరూరించే ఊరించే రంగుతో, కమ్మనైన రుచితో.. నోరంతా తీపి చేసే మామిడి పండ్లు ఆరోగ్య ప్రదాయినే కాదు, సౌందర్య సంరక్షిణిగా కూడా ఉపయోగ పడుతుంది. ఒక్క వేసవిలో మాత్రమే లబించే ఈ సీజనల్ ఫ్రూట్ కు ఎంత విశిష్టత ఉందో మీకు తెలుసా...? తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%) చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ,బి,సి(A,B,C) విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి చాల ఉపయోగ పడతాయి.మామిడి కాయను వివిధ రూపాలలో వంటలలో వాడుతుంటారు. సున్నపు శక్తి (కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది.

మామిడి పండ్లంటే అందరీ చాలా ఇష్టం వాటి వాసన, రుచి, రంగు ఇట్టే ఆకర్షించేస్తాయి. అంతే కాదండోయ్ వీటిలో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఎక్కువే. ప్రతి రోజూ ఒక మామిడి పండును తీసుకోవడం వల్ల హెల్తీ డైట్ పూర్తవుతుంది. ఇవి మీ డైట్, మరియు టేస్ట్ ను ఫుల్ ఫిల్ చేయడం మాత్రమే కాదు అనేక స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది ఆశ్చర్యమే కావచ్చు. అయితే ఇది మాత్రం నిజం.

సమ్మర్ లో మామిడితో మజా చేయండి..సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి...!

ఎందుకంటే మామిడిలోని గుణాలు నల్లమచ్చలను, మొటిమలరు పోగొట్టి ముఖంలో కొత్తదనం, గ్లోయింగ్ స్కిన్ ను నింపుతుంది. మామిడిలో ఉండే పుష్కలమైన న్యూట్రీషియన్స్, విటమిన్ ఎ మరియు బీటాకెరోటిన్ ఇవన్నీ కూడా చర్మానికి రక్షణ కల్పించి అందంగా తీర్చిదిద్దుతుంది. మరి మామిడి పండు ఉపయోగించి చర్మంలో మార్పులు ఎలా తీసుకురావచ్చో తెలుసుకుందాం...

మ్యాంగో స్క్రబ్

మ్యాంగో స్క్రబ్

ఒక చెంచా మామిడి పండు గుజ్జులో అర చెంచా పాలు లేదా పాల పౌడర్ మిక్స్ చేసి, తేనె కూడా మిక్స్ ముఖానికి అప్లై చేసి బాగా స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. బ్లాక్ హెడ్స్ తొలగించబడంతో ముఖ్యం మెరుస్తుంటుంది.

మాంగ్యో క్లెన్సర్:

మాంగ్యో క్లెన్సర్:

ఒక చెంచా గోధుమపిండి, కొద్దిగా మామిడి పండు గుజ్జు వేసి రెండింటినీ బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ఇది ఫర్ ఫెక్ట్ యాస్ట్రిజెంట్ ను ఉపయోగపడుతుంది. ఇది చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

సన్ టాన్ తొలగిస్తుంది.

సన్ టాన్ తొలగిస్తుంది.

మామిడి డిటానింగ్ ఏజెంట్ ను పనిచేస్తుంది. పచ్చిమామిడి తొక్క లేదా పండిన మామిడి తొక్కను ముఖానికి, చేతులకు బాగా రుద్దాలి. అవసరం అయితై మిల్క్ క్రీమ్ ఉపయోగించి కూడా స్ర్కబ్ చేయవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ిన 10-15నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయడం వల్ల సన్ టాన్ తొలగిపోతుంది.

 బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది:

బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది:

బాగా పండిన మామిడిపండు గుజ్జులో అర టీస్పూన్ పాలు, రెండు మూడు చుక్కల తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో బాగా మర్ధన చేయాలి . ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది మరియు బ్లాక్ హెడ్స్ ను తొలగించి ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది.

స్కిన్ కంప్లెక్షన్స్ మెరుగుపరుస్తుంది:

స్కిన్ కంప్లెక్షన్స్ మెరుగుపరుస్తుంది:

మామిడిపండ్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇంకా బోలెడు న్యూట్రీషియన్ ఉండటం వల్ల హెల్తీ స్కిన్ పొందడానికి గ్రేట్ గా సహాయపడుతుంది మరియు మ్యాంగ్ స్కిన్ డీటానింగ్ ఏజెంట్ .అందుకు పచ్చిమామిడికాయ తొక్క కు కొద్దిగా పాలు చేర్చి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే క్రమంగా టానింగ్ తొలగిపోతుంది.

యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది:

యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది:

మామిడి పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ ఏజింగ్ మరియు పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది . ఇవి స్కిన్ క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. మామిడిపండ్లలో ఉండే విటమిన్ సి మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది. మామిడిపండ్ల గుజ్జును నేరుగా చర్మానికి అప్లై చేసినప్పుడు ఇది చర్మాన్ని స్మూత్ గా మార్చడంతో పాటు మాయిశ్చరైజర్ గాపనిచేస్తుంది.

డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది:

డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది:

ముఖంలో డార్క్ స్పాట్స్ కనబడకుండా ఉండాలంటే డ్రై మ్యాంగ్ స్కిన్ ను పొడి చేసి, దీనికి కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి . క్రమంగా డార్క్ స్పాట్స్ తొలగిపోయి మీ ముఖానికి గోల్డెన్ గ్లోను అందిస్తుంది.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

ఇది ఒక గొప్ప ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది.దాంతో మొటిమలను నివారిస్తుంది, అందుకు ఒక పచ్చి మామిడికాయను, అరకపు వాటర్ అవసరం అవుతుంది. నీటిలో మామిడిపండు ముక్కలు వేసి వేడి చేసి గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవడం వల్ల మొటిమలను నివారించబడుతాయి.

మామిడి -బాదాం ఫేస్ వాష్:

మామిడి -బాదాం ఫేస్ వాష్:

ఒక చెంచా మామిడి గుజ్జు మరియు బాదాం పౌడర్ మరియు ఒక చెంచా పాలు, వేసి బాగా మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి , అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇది అన్ని రకాల చర్మతత్వానికి ఉపయోగపడుతుంది.

మ్యాంగో -ఓట్ మీల్ ఫేస్ ప్యాక్:

మ్యాంగో -ఓట్ మీల్ ఫేస్ ప్యాక్:

ఇది సున్నిత చర్మ తత్వం కల వారి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మామిడి పండు గుజ్జును, ఓట్ మీల్, పాలు, మరియు తేనె ను బాగా మిక్స్ చేయాలి. ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసి, తడి ఆరిన తర్వాత, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

 మామిడి తొక్క :

మామిడి తొక్క :

మామిడి తొక్కను ఎండ బెట్టి పొడి చేసుకొని, ఇదే విధంగా ముఖానికి స్ర్కబ్బింగ్ మిశ్రమంలో కలుపుకొని ముఖానికి మర్ధన చేయవచ్చు, మామిడి పొడి, ఒక చెంచా పెరుగు, బాగామిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకొని, అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

పచ్చమామిడి జ్యూస్ :

పచ్చమామిడి జ్యూస్ :

చిన్న మామిడి కాయలు, పచ్చివి ఉన్నట్లైతే వాటిని చక్రల్లా కట్ చేసి, వేడి నీటిలో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుుడు ఈ నీటితో మీ ముఖాన్ని శుభ్రం పరచుకోవాలి. ఇది అద్భుతమైన ఆస్ట్రిజెంట్ గా పనిచస్తుంది.

మామిడిపండు :

మామిడిపండు :

మామిడి పండు గుజ్జులో 7 లేదా 8 బాదమ్, మూడుస్పూన్ల ఓట్‌మీల్, కొద్దిగా పాలు, నీళ్లు, మూడు టేబుల్‌స్పూన్ల ముల్తానీ మట్టి కలిపి గ్రైండ్ చేయాలి. ఫేస్‌కు అప్లయ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత కడుక్కుంటే ముఖం తాజాగా ఉంటుంది.

Story first published: Monday, May 9, 2016, 17:03 [IST]
Desktop Bottom Promotion