Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే చర్మ సమస్యలు..
పంచదారను డైలీ డైట్ లో తీసుకోవడం మనకు అలవాటు. పూర్తీగా దీన్ని తీసుకోకుండా ఉండటం సాధ్యం కాదు. దీన్ని కేక్స్, డోనట్స్, స్వీట్స్, ఐస్ క్రీంస్, చాక్లెట్స్, జ్యూస్ ల రూపంలో రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాం. వీటన్నింటినీ ఇష్టపడేవాళ్లు తినకుండా ఉండలేరు.
అయితే పంచదార తినడం వల్ల చర్మానికి హాని కలుగుతుందని మీరు ఎప్పుడూ ఊహించలేదా ? పంచదార తినడం వల్ల చర్మానికి మంచిది కాదని తాజా అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. పంచదార చర్మానికి ఎలా హాని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పంచదార చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది
చర్మ కణాల నుంచి నీటి శాతాన్ని పంచదార తొలగిస్తుంది. దీనివల్ల.. అవి డీహైడ్రేట్ అవుతాయి. దీనివల్ల చర్మం సాగుతుంది. పోషణ కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువగా పంచదార తీసుకుంటూ ఉంటే.. ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలి. దీనివల్ల హైడ్రేట్ గా ఉంటారు. చర్మం సాగకుండా నివారించవచ్చు.

చర్మానికి డ్యామేజ్ అవుతుంది
పంచదార చర్మంలోని కొలాజెన్ ని డ్యామేజ్ చేస్తుంది. కొలాజెన్ చర్మంతో కలిసి ఉండటం వల్ల హెల్తీగా ఉంటుంది. పంచదారలో ఎక్కువగా ఉండే గ్లూకోజ్.. చర్మంలో ఉండే.. బలమైన కొలాజెన్ ను బలహీనంగా మారుస్తుంది. దీనివల్ల అది బలహీనపడి చర్మం నిర్జీవంగా మారుతుంది. అంతేకాదు కొలాజెన్ కోల్పోతే.. త్వరగా వయసు ఛాయలు కనిపిస్తాయి. చర్మం బలహీనంగా మారడం వల్ల.. కాలుష్యం, యూవీ రేస్ వల్ల మరింత హానికలుగుతుంది.

చర్మంలో ఇన్ల్ఫమేషన్ కి కారణం
చక్కెరలో ఉండే గ్లూకోజ్ చర్మంలో ఉండే కొల్లాజెన్ పనితీరుపై దుష్ర్పభావం చూపుతుంది. కొలాజెన్ సరిగా పనిచేయకపోతే.. చర్మం ఎలాస్టిసిటీని కోల్పోతుంది. దీనివల్ల ముడతలు, లైన్స్ ఏర్పడతాయి. అలాగే చర్మం సాగడానికి, యాక్నె రావడానికి కారణమవుతుంది. వీటన్నింటి కారణంగా చర్మంపై ర్యాషెస్ ఏర్పడతాయి.
ఇన్ని చర్మ సమస్యలకు కారణమయ్యే పంచదారను డైట్ లో నుంచి పూర్తీగా కట్ చేయడం సాధ్యంకాని పని. అయితే.. కొన్ని జాగ్రత్తలు, టిప్స్ ఫాలో అవడం వల్ల చర్మం డ్యామేజ్ కాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా ఎక్కువ నీళ్లు తాగాలి. నీళ్లు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి, ముడతలు రాకుండా నివారిస్తాయి. అలాగే విటమిన్ సి, ఈతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవడం వల్ల చర్మం స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది.



Click it and Unblock the Notifications