Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
ఎగ్‌వైట్ మాస్క్‌తో తెల్లగా మారడం తేలికే..!!
గుడ్డులోని తెల్లసొన మీ చర్మానికి ఫర్ఫెక్ట్ ఫుడ్. ఇది చాలా చీప్.. అలాగే చాలా ఎఫెక్టివ్ కూడా. ఎగ్ వైట్ లో ఉండే ప్రొటీన్స్ న్యాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. చర్మాన్ని స్మూత్ గా, సాఫ్ట్ గా మార్చే గుణం ఉంటుంది. ఆరోగ్యకరమైన విటమిన్ ఏ ముఖంపై ముడతలు, గీతలను కూడా న్యాచురల్ గా తొలగించి.. చర్మం స్మూత్ గా మారడానికి సహాయపడుతుంది. ఎగ్ వైట్ ని ముఖానికి అప్లై చేయడం వల్ల చాలా ఫెయిర్ స్కిన్ పొందవచ్చు. ఇంతకీ ఎగ్ వైట్ ని స్కిన్ కి ఎలా అప్లై చేయాలి అని అనుకుంటున్నారా ? చాలా సింపుల్.. రిజల్ట్స్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.
గుడ్డు తినండి గుడ్ గా ఉండండి: వరల్డ్ ఎగ్ డే 2015 స్పెషల్

రెండు కోడిగుడ్ల తెల్లసొన తీసుకుని, పావు కప్పు ఫ్రెష్ టమోటా జ్యూస్ కలపాలి. ఒక స్పూన్ ముల్తానీ మట్టి కూడా యాడ్ చేయాలి. బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత మరోసారి ఇంకో లేయర్ అప్లై చేయాలి. పూర్తీగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఫెయిర్ నెస్ లుక్ తీసుకొస్తుంది.
పచ్చసొన తినడం లేదా ? ఐతే పోషకాలు కోల్పోయినట్టే

2 కోడిగుడ్లు తీసుకుని.. తెల్లసొన తీయాలి. అందులో 2 టీస్పూన్ల నిమ్మరసం, 2 టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపాలి. ఫోర్క్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి. తర్వాత 30 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టాలి. తర్వాత మీ ముఖాన్ని రోజ్ వాటర్ లో ముంచిన దూదితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు బ్రష్ ఉపయోగించి ప్యాక్ ని పలుచగా ముఖంపై అప్లై చేయాలి. 5 నిమిషాల తర్వాత మరో లేయర్ అప్లై చేయాలి. ఆరిన తర్వాత కింది నుంచి పైకి లేయర్ తీసేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ ప్యాక్ ని వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే.. మీకు ఆశ్చర్యం కలిగేలా తెల్లగా మారిపోతారు.

ఒక గుడ్డులోని తెల్లసొనకు 4 టీ స్పూన్ల ఫ్రెష్ కుకుంబర్ జ్యూస్, ఒక స్పూన్ శనగపిండి, 2 టీ స్పూన్ల చల్లటి పాలు కలిపి బాగా మిక్స్ చేయాలి. ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకుని తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయాలి. రెండు పొరలుగా ఈ ప్యాక్ వేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications
